ETV Bharat / opinion

'హోమియో'తో వ్యాధి మూలానికి మందు!

మనిషిని కేవలం ఒక రోగి(యంత్రం)లా చూస్తూ నిమిషాల్లో మందుల చీటీ రాసి ఇవ్వడం కాకుండా.. అతడి శారీరక, మానసిక తత్వాన్ని, అతడి సమస్యను సానుకూలంగా అర్థం చేసుకుని, దాన్ని బట్టి చికిత్స చేయడం హోమియో వైద్యవిధానంలోని మౌలిక అంశం. జర్మనీలో 1755 ఏప్రిల్‌ పదో తేదీన జన్మించిన డాక్టర్‌ శామ్యూల్‌ హానిమన్- తన రెండు దశాబ్దాల పరిశోధన అనంతరం.. ప్రపంచానికి హోమియో వైద్యాన్ని అందించారు. ఆయన స్మృత్యర్థం ఏటా ఏప్రిల్‌ పదో తేదీన ప్రపంచవ్యాప్తంగా 'హోమియోపతి దినోత్సవం'గా జరుపుకొంటున్నారు. వైద్యం సున్నితంగా, శీఘ్రంగా, శాశ్వతంగా జరగాలన్నది హోమియో వైద్యం ధ్యేయం. ‌

international homeopathy day
హోమియోతో వ్యాధి మూలానికి మందు!
author img

By

Published : Apr 10, 2021, 7:50 AM IST

హోమియో వైద్యవిధానంలో తక్షణ ప్రయోజనం ఏమిటని ఒక సామాన్య రోగిని అడిగితే 'అసలు నా బాధ ఏమిటో హోమియో వైద్యుడు ఆలకిస్తాడు' అని టక్కున సమాధానం ఇస్తాడు. మనిషిని కేవలం ఒక రోగి(యంత్రం)లా చూస్తూ నిమిషాల్లో మందుల చీటీ రాసి ఇవ్వడం కాకుండా.. అతడి శారీరక, మానసిక తత్వాన్ని, అతడి సమస్యను సానుకూలంగా అర్థం చేసుకుని, దాన్ని బట్టి చికిత్స చేయడం ఇందులోని మౌలిక అంశం. హోమియోపతిలో ప్రతి వ్యక్తీ భిన్నమైనవాడే. వ్యాధితోపాటు అతడి వ్యక్తిత్వమూ ముఖ్యమే. ఉదాహరణకు ఉబ్బసం(ఆస్థమా) చాలామందికి ఉండవచ్చు. కానీ, అది రావడానికి వెనక కారణాలు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటాయి. వాటిని గుర్తించి, వ్యక్తి శారీరక స్వభావాన్ని అర్థం చేసుకొని దాని ఆధారంగా వ్యాధిని సమూలంగా నయం చేయడం ఈ విధానంలోని ప్రత్యేకత. తన సమస్యను తానే నయం చేసుకునేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది హోమియోపతి వైద్యం.

సున్నితం, శీఘ్రం, శాశ్వతం..

జర్మనీలోని మీసేస్‌ అనే గ్రామంలో 1755 ఏప్రిల్‌ పదో తేదీన జన్మించిన డాక్టర్‌ శామ్యూల్‌ హానిమన్‌- ఎర్లాంజెన్‌ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్‌ వైద్యంలో ఎండీ పట్టా పొంది, 20 ఏళ్లు అల్లోపతి వైద్యాన్ని ప్రజలకు అందించారు. ఆ విధానంలో సంతృప్తి లభించకపోవడం వల్ల వైద్యం మానేశారు. మరో రెండు దశాబ్దాల పరిశోధనల అనంతరం ప్రపంచానికి హోమియో వైద్యాన్ని అందించారు. ఆయన స్మృత్యర్థం ఏటా ఏప్రిల్‌ పదో తేదీన ప్రపంచవ్యాప్తంగా 'హోమియోపతి దినోత్సవం'గా జరుపుకొంటున్నారు. వైద్యం సున్నితంగా, శీఘ్రంగా, శాశ్వతంగా జరగాలన్నది హోమియో వైద్యం ధ్యేయం. మనసు శరీరాల మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకొనే ఔషధాలను నిర్దేశిస్తారు. ఔషధాలవల్ల అవాంఛనీయ దుష్ఫలితాలు తలెత్తకుండా ఉండేందుకు వాటిని ప్రత్యేక పద్ధతిలో పల్చన చేసి వాడటం మొదలు పెట్టారు. ఆ ప్రక్రియ ద్వారా రస, విష, పాషాణాలను సైతం అమృతతుల్యమైన ఔషధాలుగా మార్చి, దుష్ప్రభావాల బెడద లేకుండా- ఔషధాన్ని సూక్ష్మ మోతాదులో వాడటం కీలకమైన అంశం.

అదే విధమైన బాధను..

ఒక ఔషధం ఆరోగ్యవంతుడిలో ఏ వ్యాధి లక్షణాలను సృష్టిస్తుందో.. ఆ లక్షణాలు గల రోగికి అదే ఔషధాన్ని సూక్ష్మ రూపంలో ఇచ్చినట్లయితే స్వస్థత చేకూరుతుంది. ఈ ప్రకృతి సిద్ధ నియమం- చికిత్స ఆవిష్కారానికి కొత్త ద్వారాలు తెరిచింది. అంతేకాకుండా ఔషధాలను ముందుగా మానవులపై ప్రయోగించి చూడటం అన్న విధానానికి పునాది వేసింది హోమియో వైద్యం. గ్రీకు భాషలో హోమియోపతి అనగా 'అదే విధమైన బాధ' అని అర్థం. శరీరానికి ఏ విధమైన బాధ ఉందో, అదే విధమైన బాధను శరీరంలోనికి మందుల ద్వారా చొప్పించడం వల్ల అసలు బాధను నిర్మూలించడం. ఇది మన పురాణాల్లో ఉన్న 'ఉష్ణం ఉష్ణేన శీతలం'ను పోలి ఉంటుంది. ఈ విశిష్టమైన పద్ధతిని ప్రజలు వెంటనే నమ్మలేదు. సమకాలీన వైద్యులు, ప్రభుత్వాల నుంచి ఈ విధానంపై విమర్శలు ఎదురయ్యాయి. క్రమేపీ ప్రజలు విశ్వసించడంతో, ప్రభుత్వాలూ ఈ విధానాన్ని గుర్తించాయి.

లక్షలాది మందిని రక్షించిన చరిత్ర

ప్రస్తుతం ప్రపంచంలో సుమారు 158 దేశాల్లో హోమియో వైద్యం ద్వారా ఎన్నో వ్యాధులు నయమవుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలు, ఆసుపత్రులు నిరంతర సేవలు అందిస్తున్నాయి. భారత్‌లో హోమియో విధానంలో 180 వైద్య కళాశాలలు, 40 పీజీ వైద్య కళాశాలలు ఉన్నాయి. మూడు లక్షల మందికి పైగా శిక్షణ పొందిన వైద్యులు సేవలందిస్తున్నారు. ఐరోపాలో 'క్రూప్‌' వ్యాధి ప్రబలినప్పుడు, జర్మనీలో ప్రమాదకరమైన 'స్కార్లెట్‌ ఫీవర్‌' వచ్చినప్పుడు, రష్యాలో కలరా సోకినప్పుడు లక్షలాది మందిని రక్షించిన చరిత్ర హోమియోపతికి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మెదడువాపును నయం చేయడంలో హోమియో వైద్యం పనితనం చాలామందికి తెలుసు. ప్రతి పౌరుడినీ గడగడలాడించిన చికున్‌ గన్యా, స్వైన్‌ ఫ్లూ వంటి ఎన్నో వ్యాధులకూ హోమియోలో మంచి ఔషధాలు ఉన్నాయి. పలు మొండి వ్యాధులనూ నయం చేయగల శక్తి ఉందనే నమ్మకంతో ఈ వైద్యవిధానాన్ని ఆశ్రయిస్తున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండటం మంచి పరిణామం!

- డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ (హోమియోపతిక్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు)

ఇదీ చూడండి: అసమానతల గుప్పిట వైద్యం విలవిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.