ETV Bharat / opinion

బడి సంచి బరువు.. నాణ్యత కరవు! - బడి సంచి భారం

బడి సంచి భారీ బరువుల నుంచి చిన్నారులకు విముక్తి కల్పించే దిశగా.. ఇటీవలే 'స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ- 2020'ని ప్రకటించింది కేంద్రం. అయితే.. ఈ నిర్ణయాన్ని తీసుకోవడంలో కేంద్రం ఎంత శాస్త్రీయంగా వ్యవహరించిందో.. ఇది విజయవంతం కావాలంటే బడిపిల్లల బుర్రల్లోకి పాఠ్యాంశాలను సులభంగా ఎక్కించే విధానాలనూ అంతే శాస్త్రీయంగా మలచాల్సిన అవసరం ఉంది.

school bag weight
బడి సంచి బరువు.. నాణ్యత కరవు!
author img

By

Published : Jan 30, 2021, 6:54 AM IST

'చాలామంది చిన్నారులు తమ వీపుమీద ఉన్న రోజువారీ బరువుతో ముందుకు వంగిపోయి కనిపిస్తున్నారు. నడిచేటప్పుడు వారి చేతులు కిందికి వేలాడుతూ చింపాంజీలను తలపింపజేస్తున్నాయి. ఇది వారి పాలిట భయంకరమైన శిక్షలా అనిపిస్తోంది. దీన్ని సభ దృష్టికి తెస్తున్నాను. విద్యావ్యవస్థను, దానిపై ఉన్న దృక్పథాన్ని మార్చేలా దీనికో పరిష్కారాన్ని ఆలోచించండి. దానివల్ల వారి బాల్యం వికసించే అవకాశం ఉంటుంది'. భారీ బరువున్న బడి సంచులను మోస్తున్న విద్యార్థుల దురవస్థను ఏకరువు పెడుతూ ప్రముఖ రచయిత ఆర్‌.కె.నారాయణ్‌ 1989లో రాజ్యసభలో చేసిన సూచన ఇది. ఆ తరవాత మూడు దశాబ్దాలకు పైగా ఈ అంశంపై చర్చోపచర్చలు జరిగాయి. బడి సంచి బరువు తగ్గించాలంటూ 2018లో మద్రాస్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం నిపుణులను సంప్రతించి, పలు సర్వేలు చేపట్టి ఇటీవలే 'స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ- 2020'ని ప్రకటించింది.

ఆరోగ్యపరంగా తీవ్ర నష్టం..

పుస్తకాల్లోని సమాచారాన్ని మస్తిష్కాల్లోకి ఎక్కించే విధానం సరళంగా ఉండాలి. వారికి అది భారం కాకూడదు. నిత్యం వీపులపై మోసే భారీ బరువు విద్యార్థులకు ఆరోగ్యపరంగా తీవ్ర నష్టం కలిగిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బడి సంచి బరువు తగ్గిస్తూ 2018లోనే ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. ఎదిగే చిన్నారులు బండెడు పుస్తకాలను మోస్తూ ఉంటే వారి వెన్నెముక, మోకీళ్లు దెబ్బతినే ప్రమాదముందని అందులో పేర్కొంది. రెండో తరగతి వరకు చిన్నారులకు ఇంటి పని (హోంవర్క్‌) ఉండకూడదనేదీ స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ- 2020లో కీలకమైన అంశం. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు రోజూ రెండు గంటలవరకూ ఇంటిపని ఉండవచ్చు. 3, 4, 5 తరగతులవారికి వారానికి గరిష్ఠంగా రెండు గంటలు, 6, 7, 8 తరగతులకు రోజుకు గంట చొప్పున ఇంటిపని ఇవ్వవచ్చు. బడి సంచి బరువును పెంచడంలో ఇంటిపని దోహదం చేస్తుంది కాబట్టి ఈ మేరకు నిర్ణయించారు.

పునాదులు బలంగా ఉండాలి..

కొత్త విధానం ప్రకారం ఒకటో తరగతిలో 1.6 కిలోలతో ప్రారంభమయ్యే బడి సంచి బరువు పదో తరగతికి గరిష్ఠంగా 4.5 కిలోల వరకు ఉంటుంది. పుస్తకాల భారం తగ్గించడంలో కేంద్రం ఎంత శాస్త్రీయంగా వ్యవహరించిందో- ఇది విజయవంతం కావాలంటే బడిపిల్లల బుర్రల్లోకి పాఠ్యాంశాలను సులభంగా ఎక్కించే విధానాలనూ అంతే శాస్త్రీయంగా మలచాల్సిన అవసరం ఉంది. గతంలో సర్వశిక్షా అభియాన్‌ నిర్వహించిన పలు సర్వేల్లో- ఆంగ్లం, గణిత, భౌతిక శాస్త్రాల్లో విద్యార్థులు ఎంతో వెనకబడిఉన్నట్లు తేటతెల్లమయింది. సర్కారు బడిలో చదివే అయిదో తరగతి విద్యార్థి రెండో ఎక్కమూ పూర్తిగా చెప్పలేని పరిస్థితి చాలాచోట్ల ఉంది. విద్యార్థులు భవిష్యత్తులో ఇంజినీరింగ్‌, మెడిసిన్‌వంటి రంగాల్లో రాణించాలంటే 8, 9, 10 తరగతుల్లో గణిత, జీవ శాస్త్రాల్లో పునాదులు బలంగా ఉండాలి.

భారత్‌లో అభ్యసన ప్రక్రియలో సమూల మార్పులను ప్రతిపాదిస్తూ ఎన్నో కమిషన్లు పలు సూచనలు చేశాయి. జాతీయ నూతన విద్యావిధానం విద్యార్థి పురోగతికి, సమగ్ర వికాసానికి అవసరమైన విషయాలతో పాఠ్యప్రణాళిక తయారు కావాలని పేర్కొంది. పరిశోధనల ఆధారంగా పాఠ్యప్రణాళికలో తరచూ మార్పులు ఉండాలని కొఠారీ కమిషన్‌ 1960వ దశకంలోనే సూచించింది. విద్యలో నాణ్యతాప్రమాణాలు సాధించాలంటే ప్రాథమిక స్థాయి నుంచే విద్యా ప్రణాళిక పకడ్బందీగా ఉండాలి.

ఆన్​లైన్​ విద్యతో..

కొవిడ్‌ మహమ్మారి సృష్టించిన సంక్షోభ సమయంలో ఆన్‌లైన్‌ విద్యకు గిరాకీ పెరిగింది. బడి సంచి బరువు తగ్గించే చర్యలకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహదం చేస్తోంది. ప్రస్తుతం ఎన్నో యాప్‌లు, అభ్యసనానికి ఉపకరించే సాఫ్ట్‌వేర్‌లు విస్తృతంగా వాడుకలోకి వచ్చాయి. ఇవన్నీ బడి సంచి బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. లాకర్ల వంటివి ఏర్పాటు చేసే దిశగా- పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను విస్తరించేందుకూ ఈ విధానం ఉపకరిస్తుంది. ప్రపంచ దేశాలు విద్యారంగంలో దీర్ఘకాలిక విధానాలను నిర్దేశించుకొని ముందుకు పోతుంటే- స్వాతంత్య్రం వచ్చిన తరవాత రెండు దశాబ్దాలవరకు భారత్‌లో సమగ్ర విద్యావిధానమే లేకపోవడం ఇక్కడ నెలకొన్న దుస్థితికి దర్పణం పడుతుంది.

ఆచరణలో ఉంటేనే..

మహారాష్ట్ర ప్రభుత్వం బడి సంచి బరువు తగ్గించే దిశగా 2018లోనే చర్యలు చేపట్టినా- ఆచరణలో అది విఫలమైంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం పదిశాతం పాఠశాలల్లో సర్వే చేసి పూర్తిస్థాయిలో ఈ విధానం అమలవుతున్నట్లు ప్రకటించింది. నిర్ణయాలు తీసుకోవడం సహా వాటిని పకడ్బందీగా అమలు చేస్తేనే ఏ విధానమైనా ఫలవంతమవుతుందనడానికి మహారాష్ట్ర ఉదంతం నిదర్శనం. బడి సంచి బరువును తగ్గించడం సహా, విద్యార్థి సమగ్ర వికాసానికి బాటలు వేసేలా బోధనా విధానాలను సమూలంగా మార్చడం ఉపాధ్యాయుల చేతుల్లో ఉంటుంది. కొత్త విధానం పటిష్ఠంగా అమలు కావడానికి రాష్ట్ర ప్రభుత్వాల దృఢ సంకల్పమూ కీలకం కానుంది.

- నీలి వెన్నెల

ఇదీ చదవండి:విద్యార్థులకు 'స్మార్ట్‌' సాయం- ప్రభుత్వాల పాత్రే కీలకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.