ETV Bharat / opinion

కరోనా వేళ.. నత్తనడకన టీకాల పంపిణీ

author img

By

Published : May 24, 2021, 9:26 AM IST

దేశవ్యాప్తంగా కరోనా రెండోదశ విజృంభణ కొనసాగుతున్న వేళ.. టీకాల పంపిణీ నత్తనడకన సాగుతోంది. ఆగస్టు-డిసెంబరు మధ్యకాలంలో 216 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని, 18 ఏళ్లు నిండిన 95 కోట్ల మందికీ ఈ సంవత్సరాంతానికి టీకాలు అందుతాయని నీతిఆయోగ్‌ చెబుతోంది. కానీ వాస్తవంగా ఆ పరిస్థితి కనబడటం లేదు.

White House
శ్వేతసౌధం

'భయానక వైరస్‌తో మనం యుద్ధం చేస్తున్నామంటే, దాన్ని మట్టుపెట్టే ఆయుధ సంపత్తిని, అంటే వ్యాక్సిన్లు ఇతర కీలక ఔషధాల్ని సిద్ధం చేసుకోవాలి. కానీ, ఇంకా మనం ఆ స్థాయికి చేరుకోలేదు'- ప్రపంచ ఆరోగ్య సదస్సులో సమితి ప్రధాన కార్యదర్శి చేసిన వ్యాఖ్య అది.

మహమ్మారి మృత్యుఘాతాలకు 34.5 లక్షల మంది అసువులు బాశారని అధికారిక గణాంకాలు చాటుతున్నా అంతకు మూడింతల మంది కొవిడ్‌ కారణంగా కడతేరిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అధ్యయనమూ ఇండియా సహా పలు వర్ధమాన దేశాల భవిష్యత్తుపై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

పటిష్ఠ చర్యలేవీ?

బ్రెజిల్‌ తరవాత భారత్‌లో కొవిడ్‌ మలిదశ భయానకంగా మారడం, ఆఫ్రికా ఖండంలోని దేశాలతోపాటు వర్ధమాన ప్రపంచానికి ప్రమాద సంకేతమంటూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. కరోనా మహమ్మారిని కాచుకోవాలంటే, అశేష జన బాహుళ్యానికి వడివడిగా టీకాలు వేయడం ప్రాణావసరమని అంతర్జాతీయ నిపుణులంతా ఎంతోకాలంగా మొత్తుకొంటున్నారు. విస్తృత టీకా కార్యక్రమంతో కొవిడ్‌ ఉక్కు పిడికిలి సడలిందని అమెరికా, బ్రిటన్లు ఊపిరి పీల్చుకొంటుంటే- ప్రాణవాయువు సరఫరాలూ మందగించి ఇండియాలో వందలమంది అసువులు బాస్తున్నారు. దేశంలో 19 కోట్ల మందికి టీకా అందిందని, ఆ సంఖ్య ఆస్ట్రేలియా జనాభాకు ఏడు రెట్లు, న్యూజిలాండ్‌ జనసంఖ్యకు 35 రెట్లు అని లేని గొప్పలు చెప్పుకొంటున్న ప్రధాని సలహాదారు- ప్రామాణిక రెండో డోసు టీకా అందింది మూడుశాతం భారతీయులకేనన్న వాస్తవాల్ని విస్మరిస్తున్నారు. ఆగస్టు-డిసెంబరు మధ్యకాలంలో 216 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని, 18 ఏళ్లు నిండిన 95 కోట్ల మందికీ ఈ సంవత్సరాంతానికి టీకాలు అందుతాయని నీతిఆయోగ్‌ చెబుతోంది. కాకి లెక్కలు కాదు, పటిష్ఠ కార్యాచరణే నేడు కావాలి!

మూడు వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని, వాటి ఉత్పత్తి ప్రణాళికతోపాటు అతి తక్కువ సమయంలోనే ప్రతి భారతీయుడికీ అవి అందేలా పంపిణీ మార్గసూచీని సిద్ధం చేశామని నిరుడు స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రధాని మోదీ ప్రకటించారు. వాటిలో రెండింటికి జనవరి తొలివారంలోనే అత్యవసర అనుమతులు మంజూరు చేసినా సమధిక ఉత్పత్తికి తోడ్పాటునందించడంలో నెలల తరబడి జాప్యం- ప్రాణాంతకంగా పరిణమించిందనడంలో సందేహం లేదు. డబ్ల్యూహెచ్‌ఓ, ఎఫ్‌డీఏల అనుమతి పొందిన ఏ విదేశీ టీకాలకైనా దిగుమతి లైసెన్సులు కోరితే, రెండు రోజుల్లో ఇస్తామని కేంద్రం చెబుతున్నా- ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తో నష్టపరిహార నిబంధనపై సంప్రదింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

కేంద్రమే వ్యాక్సిన్లను సేకరించే విధానానికి చెల్లుకొట్టింది, అతి వేగంగా అందరికీ అందించడానికేనని కేంద్రం చెప్పడం- తాడిచెట్టు ఎక్కింది దూడ మేతకేనని అన్నట్లుంది. వేర్వేరు ధరల పితలాటకానికి కేంద్రం తెరతీయడంతో, అనేక రాష్ట్రాలు గ్లోబల్‌ టెండర్ల వైపు మొగ్గుతున్నాయి. ఆ డోసులు ఎప్పటికి వస్తాయో, 18-45 ఏళ్లవారికి టీకా రక్షణ ఎప్పటికి లభ్యమవుతుందో చెప్పగలవారేరీ? దశాబ్దాలుగా సువ్యవస్థితమైన సార్వత్రిక ఉచిత టీకాల కార్యక్రమాన్ని పక్కనపెట్టి వ్యాక్సిన్ల సేకరణ పంపిణీలో కేంద్రం తెచ్చిన ద్వంద్వ విధానం- ఆర్థిక అసమానతలకు నెలవైన దేశంలో వికటించే ప్రమాదం ఉంది! టీకాల తయారీలో గతమెంతో ఘనకీర్తి కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల్ని తక్షణ వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

విదేశాల్లో వైద్యవిద్య పూర్తిచేసుకొని ఇక్కడ లైసెన్సు కోసం ఎదురు చూస్తున్న 90 వేల మంది తమ సేవల్ని వినియోగించుకోవాలని అర్థిస్తున్నా కేంద్రం మిన్నకుంది. ఉన్న ఆయుధాల్నీ కాలదన్నుకొంటే- కొవిడ్‌పై యుద్ధాన్ని గెలిచే అవకాశమేదీ?

ఇదీ చదవండి : ఒలింపిక్స్​కు కరోనా గండం- ఈ ఏడాదైనా జరిగేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.