ETV Bharat / opinion

ప్యాకేజీ కష్టాలు: ఉద్దీపనలకు నిధులు ఎలా?

author img

By

Published : May 21, 2020, 6:53 AM IST

కరోనా కరాళనృత్యాన్ని అధిగమించి ఆర్థిక కార్యకలాపాలను మళ్లీ పట్టాలెక్కించడానికి ప్రపంచ దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. వాటి విలువ 10 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రభుత్వాలు వరుసపెట్టి ప్రకటిస్తున్న బృహత్తర ప్యాకేజీలకు నిధులు సమీకరించాలంటే పన్నులు పెంచడం, అప్పులు చేయడం వినా మరో మార్గం లేదు.

Editorial on special economic packages by world Nations amid corona virus outbreak
ఉద్దీపనల ప్రకటన ఓకే.. మరి నిధుల మాటేంటీ!

కరోనా వైరస్‌ తాకిడికి చిన్నాపెద్ద వ్యాపారాలు స్తంభించి, కోట్ల సంఖ్యలో ప్రజలు వృత్తి, ఉపాధి కోల్పోయారు. ఆర్థిక కార్యకలాపాలు సాగక ప్రభుత్వాలకు ఆదాయం పడిపోయింది. ‘లాక్‌డౌన్‌’ అమలు, క్వారంటైన్‌, మందులు వగైరాల కోసం, పేదలకు నగదు బదిలీ కోసం ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేయడం అనివార్యమైంది. కరోనా కరాళ నృత్యాన్ని అధిగమించి ఆర్థిక కార్యకలాపాలను మళ్లీ పట్టాలెక్కించడానికి ప్రపంచ దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. వాటి విలువ 10 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. జపాన్‌ జీడీపీలో 21.1 శాతం, అమెరికా 13 శాతం, స్వీడన్‌ 12 శాతం, జర్మనీ 10.7 శాతం నిధులను ఆర్థిక ఉద్దీపనకు కేటాయించాయి. వ్యక్తులు, కుటుంబాలు, చిన్న వ్యాపారాల నగదు చెల్లింపులకు, రుణాల బదిలీకి ఈ నిధులు వెచ్చిస్తారు. కొవిడ్‌ నివారణ, చికిత్సలకు ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు ఉద్దీపన ప్యాకేజీలకు అదనం. ఇంత వ్యయాన్ని భరించగల స్థాయిలో ప్రభుత్వాలు లేవు. ఈ తరుణంలో ప్రభుత్వాలు వరుసపెట్టి ప్రకటిస్తున్న బృహత్తర ప్యాకేజీలకు నిధులు సమీకరించాలంటే పన్నులు పెంచడం, అప్పులు చేయడం వినా మరో మార్గం లేదు.

ఇండొనేసియా ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా డాలర్ల రూపంలో నిధులు సేకరించతలపెట్టింది. ఇవి డాలర్ల రూపంలో విదేశీ మదుపరుల నుంచి సేకరించే రుణాలు తప్ప మరేమీ కావు. రేపు అప్పు తీర్చాల్సి వచ్చేసరికి స్థానిక కరెన్సీ విలువ తగ్గిపోతే, డాలర్‌ బాండ్ల రూపంలో చెల్లించాల్సిన బకాయి తడిసిమోపెడవుతుంది. ఇప్పటికే అధిక పన్నులు విధిస్తున్న అర్జెంటీనా, పన్నులను మరింత పెంచడం ద్వారా ఉద్దీపన నిధులు సమీకరించాలనుకొంటోంది. పన్ను వసూళ్లు భారీగా పడిపోయినా కొవిడ్‌పై పోరాటానికి పెద్దయెత్తున ఖర్చు చేయాల్సి వచ్చినందున కెనడా బడ్జెట్‌ లోటు ఈ ఏడాది 12 రెట్లు పెరగనుంది. గతంలో తీసుకున్న రుణాలను చెల్లించలేక అవస్థలు పడుతున్న ఆఫ్రికా దేశాలు ఉద్దీపన కోసం కొత్త అప్పులు చేసే స్థితిలో లేవు.

సర్దుబాట్లే ఎక్కువ

కరోనా సంక్షోభానికి ముందే ఆర్థిక మందగతిని ఎదుర్కొన్న భారతదేశం తాజాగా 10 శాతం జీడీపీకి (సుమారు రూ.20 లక్షల కోట్లు) సమానమైన ఉద్దీపన పథకం ప్రకటించింది. దీని కింద నిధుల కేటాయింపును రంగాల వారీగా, పలు తడవలుగా ప్రకటిస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) రంగానికి, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు బ్యాంకు రుణాల రూపంలో పూచీకత్తు అవసరం లేని నిధులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిస్కంలకు రూ.90,000 కోట్లను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ అందిస్తాయి. బ్యాంకులతోపాటు, మంచి రుణ రేటింగ్‌ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) సైతం ఉద్దీపనకు నిధులు సమకూర్చుతాయి. గతంలో రిజర్వు బ్యాంకు, కేంద్రం వివిధ ప్యాకేజీలకు ప్రకటించిన రూ.7.5 లక్షల కోట్లనూ ఉద్దీపనలో కలిపేశారు. టీడీఎస్‌ చెల్లింపుల వాయిదా పద్దు కింద రూ.50,000 కోట్లు చూపారు. ఇంతకుమించి ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఉద్దీపనకు ఇవ్వలేదు. జనం చేతిలో ఎక్కువ డబ్బు ఉండేట్లు చూసే ఈ పథకాన్ని ఆర్థిక సహాయ పథకం అనాలే తప్ప, ఆర్థిక ఉద్దీపన అనకూడదని నిపుణులు సూత్రీకరిస్తున్నారు. ప్రభుత్వం నిజంగా నిధులు వెచ్చించే ఉద్దీపన కార్యక్రమం మున్ముందు రావచ్చంటున్నారు. రూ.20 లక్షల కోట్ల ఉద్దీపనలో రూ.6.8 లక్షల కోట్ల లోటును నగదీకరించాల్సిందిగా రిజర్వు బ్యాంకును ప్రభుత్వం కోరవచ్ఛు నగదీకరణ అంటే ప్రభుత్వం మార్కెట్‌ నుంచి బాండ్ల రూపంలో రుణ సమీకరణ జరపకుండా, రిజర్వు బ్యాంకును ఆశ్రయించడమన్నమాట. అలాగే రిజర్వు బ్యాంకు వద్ద నిల్వ ఉన్న ప్రభుత్వ నిధుల్లో కొంత తిప్పి తీసుకోవచ్చు కూడా. అంతేతప్ప ప్రభుత్వానికి అదనంగా కరెన్సీ నోట్లను ముద్రింపజేసే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాల వివరణలను బట్టి తెలుస్తోంది. ద్రవ్య లోటును పూర్తిగా నియంత్రణలో ఉండేట్లు చూసుకుంటూ, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకుంటూ, ఆర్థిక వ్యవస్థలోకి ఎక్కువ నిధులు ప్రవహింపజేయడం ఉద్దీపన లక్ష్యమని ప్రభుత్వ ముఖ్య సలహదారు కె.వి.సుబ్రమణియన్‌ చెప్పారు. ద్రవ్యలోటు ఎక్కువైతే రుణ రేటింగ్‌ తగ్గి విదేశాల నుంచి పెట్టుబడులు రాకపోవచ్ఛు దీనివల్ల చైనా నుంచి పరిశ్రమలను భారత్‌కు ఆకర్షించాలనే లక్ష్యం దెబ్బతినవచ్ఛు

మరి సంపన్న దేశాలు లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీలను ఎలా ప్రకటించగలుగుతున్నాయో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. అమెరికా, జపాన్‌ వంటి సంపన్న దేశాలు అదనపు డాలర్లు, యెన్‌లను ముద్రించినా వాటి రేటింగ్‌ ఏమీ పడిపోదు. కారణం- ఈ దేశాలు విదేశాల నుంచో, విదేశీ బ్యాంకుల నుంచో, అంతర్జాతీయ సంస్థల నుంచో డాలర్‌ రుణాలు తీసుకోవడం లేదు. తమకు తామే బకాయి పడుతున్నాయి. ఇవాళ ఉద్దీపన వల్ల ఏర్పడే లోటు రేపు జీడీపీ అభివృద్ధి సాధిస్తే ముటమాయమైపోతుంది. కానీ, భారత్‌ వంటి వర్ధమాన దేశాల కరెన్సీ విలువ డాలర్‌తో ముడివడి ఉంది. అవి కనుక అదనంగా కరెన్సీ ముద్రిస్తే డాలర్‌తో వాటి కరెన్సీ విలువ పడిపోతుంది. దానివల్ల విదేశాల నుంచి చమురు కొనాలన్నా, హైటెక్‌ పరికరాలు దిగుమతి చేసుకోవాలన్నా ఇదివరకటికన్నా ఎక్కువ మొత్తాలను డాలర్లలో చెల్లించాలి. ఫలితంగా రుణభారం మరింత పెరిగి, జీడీపీ-రుణ నిష్పత్తి అదుపుతప్పుతుంది. దాంతో డాలర్‌ రుణాల సేకరణ మరింత కష్టమవుతుంది. ఇదొక విష వలయం.

ధనిక దేశాలది రాచబాట

ప్రస్తుతం అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాల్లో వడ్డీ రేట్లు దాదాపు సున్నాకు చేరువలో ఉన్నాయి. ఇంత తక్కువ రేట్లకు కూడా ఇతర దేశాలు, కంపెనీలు తమ నగదు నిల్వలను భద్రత కోసం డాలర్‌ బాండ్ల రూపంలో దాచుకుంటున్నాయి. అంటే ఉద్దీపనకు కావలసిన నిధులను అత్యల్ప రేట్లకు అప్పు తీసుకునే భోగం అమెరికా సొంతం. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రభుత్వానికి ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని ముద్రించి ఇస్తానంటోంది. ప్రభుత్వం విడుదల చేసే బాండ్లను ఫెడరల్‌ రిజర్వు కొనుగోలు చేసి డాలర్లు విడుదల చేస్తుంది. డాలర్లను మనమే ముద్రిస్తాం కాబట్టి అప్పులు తీర్చలేకపోవడం, ఎగవేయడమనే ప్రసక్తే ఉండదని 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్‌ ట్రంప్‌ ఉద్ఘాటించడం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. అందుకే అమెరికా తన చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో రెండు లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించగలిగింది. నోబెల్‌ బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త పాల్‌ క్రుగ్‌మాన్‌ ఇంతటితో ఉద్దీపన కథ ఆగకూడదనీ, అమెరికా, ఐరోపా, జపాన్‌ దేశాలు ఇకపై కూడా ఏటా తమ జీడీపీలో రెండు శాతాన్ని మౌలిక వసతుల కల్పనకు, శాస్త్రసాంకేతిక పరిశోధనకూ, బాలల సంక్షేమానికీ ఖర్చుపెడుతూనే ఉండాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా జీడీపీకన్నా రుణాలు 100 శాతం ఎక్కువ. జపాన్‌లో 200 శాతం ఎక్కువ. అయినా జపానీయులేమీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోలేదనీ, అమెరికా సైతం అప్పులు పెంచుకునైనా సరే మౌలిక వసతులు, ఆర్‌ అండ్‌ డీ, బాలల అభివృద్ధికి అధిక వ్యయాలు చేయాలనీ క్రుగ్‌మాన్‌ సలహా ఇస్తున్నారు. సంపన్నుల లోకమే వేరు!

--- కైజర్​ అడపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.