ETV Bharat / opinion

వ్యూహాత్మక దిద్దుబాటు.. సంస్కరణల బాటలో పీఎస్​బీలు

ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై నిరర్థక ఆస్తుల ప్రభావం భారీగా ఉంది. అయితే నిరర్థక ఆస్తుల భారాన్ని తగ్గించేందుకు వీలుగా యూకో బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలను ప్రైవేటీకరించాలని నీతిఆయోగ్‌ గత నెల సూచించింది. కానీ ఈ ప్రైవేటీకరణ సూచనను ఆర్‌బీఐ తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్తుల నాణ్యతపై దృష్టిపెట్టింది కేంద్ర బ్యాంకు. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, యూబీఐ, బీఓబీ, కెనరా బ్యాంక్‌, బీఓఐ వంటి ఆరు అగ్రశ్రేణి పీఎస్‌బీలలో ముందుగా ప్రభుత్వం తన వాటాను 51 శాతానికి తగ్గించుకోవాలని సలహానిచ్చింది.

author img

By

Published : Aug 25, 2020, 9:18 AM IST

Editorial on reforms in banking sector
వ్యూహాత్మక దిద్దుబాటు- సంస్కరణ బాటలో పీఎన్​బీలు

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రస్థానానికి నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) గుదిబండల్లా మారుతున్నాయి. బ్యాంకుల పనితీరుపై ఇవి కీలక ప్రభావాన్ని చూపుతున్నాయి. 90 రోజులుగా అసలు లేదా వడ్డీ వసూలవ్వని రుణాన్ని ఎన్‌పీఏగా పరిగణిస్తారు. ఎన్‌పీఏలు ఆందోళనకరంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నియంత్రణ మరింత పకడ్బందీగా మారాల్సిన అవసరం ఉంది. ఎన్‌పీఏలు భారీగా పేరుకుపోయిన నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో యూకో బ్యాంక్‌ ఒకటి. ఈ క్రమంలో కొత్త రుణాలు మంజూరు చేయకుండా నిషేధిస్తూ, ఆర్‌బీఐ వీటిని 'ప్రాంప్ట్‌ కరెక్టివ్‌ యాక్షన్‌(పీసీఏ)' నిబంధనల పరిధిలోకి తెచ్చింది. ఆర్‌బీఐ నిషేధ ఆంక్షల పరిధిలో ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఉన్నాయి. గత దశాబ్ది కాలంలో మొత్తం రుణ మంజూరులలో పీఎస్‌బీల వాటా 75.1శాతం నుంచి 57.5శాతానికి క్షీణించింది.

ప్రైవేటీకరణకు ఆర్‌బీఐ విముఖత

నిరర్థక ఆస్తుల భారాన్ని తగ్గించేందుకు వీలుగా యూకో బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలను ప్రైవేటీకరించాలని నీతిఆయోగ్‌ గత నెల సూచించింది. కొన్ని పీఎస్‌బీలను ప్రైవేటీకరించినట్లయితే, వాటి మొత్తం రుణాలు మరింత క్షీణించి ఎన్‌పీఏలు తగ్గిపోతాయని, భవిష్యత్తులో ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి తలనొప్పులు తగ్గుతాయనేది నీతిఆయోగ్‌ ఉద్దేశం. అయితే ఈ ప్రైవేటీకరణ సూచనను ఆర్‌బీఐ తోసిపుచ్చింది. దేశ అభివృద్ధి అవసరాలు తీర్చడంలో, ముఖ్యంగా బలహీన వర్గాలను ఆదుకొనే విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యంత అవసరమని కేంద్ర బ్యాంకు అభిప్రాయపడింది. ప్రైవేటు సంస్థలేవీ ఈ స్థాయి సంక్షోభంలో కూరుకొన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను అక్కున చేర్చుకునేందుకు ముందుకు రావనేది ఆర్‌బీఐ ఉద్దేశం. ఆస్తులు ఎక్కువగా ఉండి, ఎన్పీఏలు తక్కువగా ఉండే బ్యాంకులపైనే ప్రైవేటు రంగానికి ఆసక్తి ఉంటుందని, ఇలాంటి వాటిని అప్పనంగా ప్రైవేటుకు అప్పగిస్తే, భారీ ఎన్పీఏలను మూట గట్టుకునే బలహీన బ్యాంకులు ప్రభుత్వానికి గుదిబండలుగా మిగిలిపోతాయని కేంద్ర బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రైవేటీకరణ మౌలిక ధ్యేయానికే విరుద్ధమని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ బోర్డు సభ్యుడు సతీష్‌మరాఠె ప్రయివేటీకరణ ప్రక్రియను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం బ్యాంకుల్లో మెజారిటీ వాటాను భారతీయులకు- అంటే కార్పొరేటు సంస్థలకు, వాటి యాజమాన్యానికి, ఉద్యోగులకు, సాధారణ పౌరులకు విక్రయించి కేవలం 26 శాతాన్ని మాత్రమే తన వద్ద అట్టిపెట్టుకోవాలని ఆయన సూచిస్తున్నారు. సతీష్‌ ఉద్దేశం ప్రకారం... ఏ పీఎస్‌బీ ఉద్యోగీ బ్యాంకును తన సొంత సంస్థగా భావించడం లేదు. ఈ భావన మారాలంటే, ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరికీ వారు పనిచేసే బ్యాంకులో వాటాలను ఇవ్వాలి. అదేవిధంగా, పీఎస్‌బీలలో వాటాలు పొందేలా వాటి ఖాతాదారులకూ తగిన అవకాశాలు కల్పించాలి. దీనివల్ల వారిలో బ్యాంకుతో తమ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్న భావన సహజంగానే ఏర్పడుతుంది. అందుకనుగుణంగానే వారి స్పందన ఉంటుంది. అదే సమయంలో, ఏ ఒక్క వ్యక్తీ లేదా గ్రూపు పీఎస్‌బీలపై మితిమీరిన నియంత్రణ కలిగి ఉండకుండా గరిష్ఠ వాటాపై పరిమితి విధించాలి. ఇదీ సతీష్‌మరాఠె వాదన. ఈ విషయంలో ప్రభుత్వానికి ఆర్‌బీఐ ఇచ్చిన సలహా కూడా ఈ వాదనకు అనుగుణంగానే ఉంది.

ఆస్తుల నాణ్యతపై దృష్టి

ఎస్‌బీఐ, పీఎన్‌బీ, యూబీఐ, బీఓబీ, కెనరా బ్యాంక్‌, బీఓఐ వంటి ఆరు అగ్రశ్రేణి పీఎస్‌బీలలో ముందుగా ప్రభుత్వం తన వాటాను 51శాతానికి తగ్గించుకోవాలన్నది కేంద్ర బ్యాంకు సలహా. వచ్చే 12-18 నెలల్లో ఆ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను ఈ స్థాయికి పరిమితం చేసుకోవాలని సూచించింది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.43 వేల కోట్ల నిధులు సమకూరతాయి. ఆర్‌బీఐ సూచన బాగానే ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ దిశగా అప్పుడే చర్యలు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ముందుగా, ఎంపిక చేసిన ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆస్తుల (అంటే రుణాల) నాణ్యతను పెంచడాన్ని తక్షణ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆరు బ్యాంకులు భారీ రుణాలు ఇవ్వకుండా జాగ్రత్త వహిస్తుంది. బదులుగా, అవి తమ నిరర్థక ఆస్తులను 2021 మార్చి నాటికి కనీసం మూడోవంతుకు తగ్గించుకోవడంపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

అన్ని 'వ్యూహాత్మక రంగాల్లో' గరిష్ఠంగా నాలుగే ప్రభుత్వ సంస్థలు ఉండేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, బ్యాంకింగును సైతం వ్యూహాత్మక రంగంగానే పరిగణిస్తోందని’ పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల యాజమాన్య విభాగం కార్యదర్శి తుహిన్‌ కె పాండే ఇటీవల సూచనప్రాయంగా పేర్కొన్నారు. తుహిన్‌ వ్యాఖ్యలను బట్టి ప్రభుత్వ విధానమేమిటో విదితమవుతోంది. అంటే, ఇప్పుడున్న 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తన వాటాను 26శాతానికి తగ్గించుకోవాలనీ, తదుపరి, 8 చిన్నపాటి పీఎస్‌బీలను నాలుగు పెద్ద బ్యాంకులుగా విలీనం చేయాలనేది ప్రభుత్వ దీర్ఘకాలిక (5-10 ఏళ్ల) ప్రణాళికగా భావించవచ్చేమో!

నిరర్థక ఆస్తుల వివరాలివీ...

  • యూపీఏ-2 (2009-14) హయాంలో టెలికాం, బొగ్గు కుంభకోణాలు వెలుగు చూశాయి. 2008 జనవరిలో అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా జారీ చేసిన లైసెన్సులలో తీవ్ర ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించిన సుప్రీంకోర్టు 2013 ఫిబ్రవరిలో వాటన్నింటినీ (122 లైసెన్సులను) రద్దు చేసింది. ఈ 122 లైసెన్సులతో సంబంధం ఉన్న పెట్టుబడులు రూ.1.78 లక్షల కోట్లు.
  • 2014 సెప్టెంబరులో సుప్రీంకోర్టు బొగ్గురంగంలోని కంపెనీలకు ఇచ్చిన 214 బొగ్గు క్షేత్రాల లైసెన్సులను రద్దు చేసింది. వీటితో రూ.2.85 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధం ఉంది.
  • సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు ఉత్తర్వులతో బ్యాంకులు టెలికాం, విద్యుత్‌ కంపెనీలకు ఇచ్చిన భారీ రుణాలు రాత్రికిరాత్రి ఎన్‌పీఏలుగా మారిపోయాయి.
  • పాలక పార్టీలకు, కార్పొరేట్ల సంస్థల మధ్య నెలకొన్న అపవిత్ర బంధాలు కూడా భారీ ఎత్తున ఎన్‌పీఏలు పెరగడానికి కారణమయ్యాయి. విజయ్‌మల్య, రాణా కపూర్‌ తదితర పారిశ్రామికవేత్తల నుంచి నిధులు స్వీకరించి, వారి వ్యాపారాలకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాల్సిందిగా పీఎస్‌బీలపై రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారనే ఆరోపణలున్నాయి.
  • పీఎస్‌బీలను సుదృఢంగా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టిన మోదీ సర్కారు-1.0 బలహీన బ్యాంకులను బలమైన పెద్ద బ్యాంకులతో విలీనం చేసింది. 27 పీఎస్‌బీల స్థానంలో ఇప్పుడు 12 ఉన్నాయి. దివాలా కోడ్‌-2016 ద్వారా ఎగవేత కంపెనీలపై శిక్షాత్మక చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.
  • ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక స్వస్థత కోసం గత ఆరేళ్లలో కేంద్రం రూ.3.5 లక్షల కోట్లను సమకూర్చింది. అయితే, ఇలా పన్ను చెల్లింపుదారుల డబ్బులను నిరంతరంగా పీఎస్‌బీలకు ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదని ప్రభుత్వం గుర్తించింది.
  • 2016 నాటి నోట్లరద్దు నిర్ణయం కూడా ఎన్‌పీఏల వృద్ధికి దారితీసిందని స్వతంత్ర విశ్లేషకులు చెబుతున్నారు. నోట్ల రద్దు జరిగిన తరువాతి నెలల్లో నిధుల కొరత కారణంగా నిర్మాణ, వాహన ఉత్పత్తి, పర్యాటక, తయారీ తదితర రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా, ఆయా రంగాల కంపెనీలు రుణాలను తిరిగి చెల్లించలేక పోయినట్లు తెలుస్తోంది.

- రాజీవ్‌ రాజన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.