ETV Bharat / opinion

ఆస్పత్రుల్లోనూ అంటురోగాలు.. ఇంకేం చేయాలి? - Diseases spread due to Hospitals

అనారోగ్యం వస్తే ఆస్పత్రికి పరుగులు తీస్తాం. అయితే రోగాన్ని నయం చేయాల్సిన ఆస్పత్రిలోనే కొత్తవి అంటుకుంటే, మందులకు లొంగని మొండిరోగాలైతే ఎక్కడికి పోవాలి. ఏం చేయాలి? ఆస్పత్రుల్లో వ్యాపించే ఇన్‌ఫెక్షన్‌ (హెచ్‌ఏఐ) సమస్య ప్రపంచ ఆరోగ్య రంగానికి తలనొప్పిగా పరిణమిస్తోంది. భారత్‌లోనూ సమస్య తీవ్రత అధికంగానే ఉంది.

contagious-diseases
ఆస్పత్రుల్లోనూ అంటురోగాలు
author img

By

Published : Jul 25, 2020, 8:20 AM IST

ఏదైనా అనారోగ్యం వస్తే చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తాం. రోగాన్ని కుదర్చాల్సిన ఆస్పత్రే కొత్తవి అంటగడితే? అక్కడ కొత్తరకం జబ్బులు మనకు అంటుకుంటే, అది కూడా మందులకు లొంగని మహా మొండి సూక్ష్మజీవులు ఒంట్లోకి చేరితే ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే సూక్ష్మజీవులపై పోరాడేందుకు యాంటీబయాటిక్స్‌ ఔషధాల్ని ఉపయోగించడం మామూలే. వాటిని అడ్డూఅదుపూ లేకుండా వాడటంతో సూక్ష్మజీవులు నిరోధకతను సంతరించుకుంటుండటం వల్ల కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. 'ఆస్పత్రుల్లో వ్యాపించే ఇన్‌ఫెక్షన్‌ (హెచ్‌ఏఐ)' సమస్య ప్రపంచ ఆరోగ్య రంగానికి తలనొప్పిగా పరిణమిస్తోంది. భారత్‌లోనూ సమస్య తీవ్రత అధికంగానే ఉంది.

భారత్​లోనే సమస్య తీవ్రం..

యాంటీ బయాటిక్స్‌ ఔషధాల్ని ఎడాఎడా వాడితే, మహా మొండిజీవుల కారణంగా 2050నాటికి కోటి వరకు మరణాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో చాలామంది చిన్నపాటి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు చేరినప్పుడు ఇలాంటి మొండి సూక్ష్మజీవుల బారిన పడటంతో చికిత్సల కోసం పెద్దమొత్తంలో సమర్పించుకోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ధనిక దేశాలకన్నా భారత్‌లోనే సమస్య తీవ్రత అధికంగా ఉన్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 'ఇంటర్నేషనల్‌ నాసోకోమియల్‌ ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ కన్సార్షియం' చేపట్టిన అధ్యయనం ప్రకారం 2004-13 మధ్యకాలంలో మనదేశంలోని 20 నగరాల్లోని 40 ఆస్పత్రుల్లో పరిశీలన చేపట్టగా న్యూమోనియా కేసుల తీవ్రత అమెరికా ఆస్పత్రులతో పోలిస్తే మనవద్దే 11 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. కొన్ని సూక్ష్మజీవులు ఔషధ నిరోధకతను సంతరించుకుని విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు భారత వైద్య పరిశోధక మండలి(ఐసీఎమ్‌ఆర్‌) ఆధ్వర్యంలోని ఓ నెట్‌వర్క్‌ అధ్యయనంలో గుర్తించారు. మొండిజీవుల బారిన పడిన రోగులపై సాధారణ మందులేవీ పనిచేయడం లేదు. ఆఖరి అస్త్రంగా ఖరీదైన, దుష్ఫలితాలకు కారణమయ్యే యాంటీబయాటిక్‌ ఔషధాల్ని ఉపయోగించాల్సి వస్తోంది. వాటి గరిష్ఠ మోతాదుకు రోజుకు రూ.26 వేలదాకా వ్యయం కావడంతోపాటు మూత్రపిండాలు దెబ్బతినడం వంటి కొత్త సమస్యలు తలెత్తడం రోగులపై పిడుగుపాటు అవుతోంది. మన దేశంలోని పలు ఆస్పత్రుల్లో సూక్ష్మజీవుల వ్యాప్తిని నిరోధించే విషయంలో కనీస జాగ్రత్తలూ కొరవడుతున్నాయి. దేశంలో సర్కారీ ఆస్పత్రుల్లో ఒక మంచానికి ఇద్దరు రోగులు ఉండటం అత్యంత సాధారణ అంశం. ఇలాంటి రద్దీయే ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తికి రాచమార్గమవుతోంది. ఈ కారణంగానే ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణ విధానాల్ని అమలు చేయడం సర్కారీ వైద్యులకు అలవికాని పనిగా పరిణమిస్తోంది.

అనునిత్యం కృషి చేయాలి..

కొంతమంది వైద్యులు బాధ్యతారహితంగా మందుల్ని సూచించడం, చాలామంది. దుకాణాల నుంచి నేరుగా తెచ్చుకుని వాడటం వంటివి ఔషధ నిరోధకత సమస్యకు ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యను నివారించేందుకు ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్ల నిరోధక కమిటీల్ని ఏర్పాటు చేయాలి. యాంటీబయాటిక్‌ ఔషధాల వాడకాన్ని నియంత్రణకు, ప్రిస్క్రిప్షన్‌లో సూచించేందుకు ఓ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వైద్య సిబ్బంది తరచూ చేతులు కడుక్కోవడంతోపాటు, వెంటిలేటర్లు, కెథేటర్లు వంటి ఉపకరణాల్ని అమర్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకునేలా ఆస్పత్రులు అనునిత్యం కృషి చేయాలి. ఆస్పత్రుల్లో స్టెరిలైజేషన్‌, సబ్బులు, చేతులు కడుక్కునే రసాయనాల ఏర్పాటు, సరిపడినంతమంది నర్సుల నియామకం వంటి సౌకర్యాల కల్పనపై ఖర్చు పెట్టేందుకు సిద్ధపడాలి. రోగులు అరుదైన ఔషధ నిరోధక మొండి సూక్ష్మజీవుల బారిన పడినప్పుడు వారిని ఇతరుల నుంచి వేరుచేసి ఉంచే గదుల సౌకర్యాల్నీ కల్పించాల్సి ఉంటుంది.

యాంటీబయాటిక్స్​ మాత్రమే కాదు..

భారత్‌ సహా అల్ప, మధ్యాదాయ దేశాల్లో ఔషధ నిరోధకతకు దారితీస్తున్న అంశాల్లో కేవలం యాంటీబయాటిక్స్‌ను అడ్డగోలుగా వాడటం మాత్రమే కాదు- పారిశుద్ధ్య లోపం, అపరిశుభ్రమైన నీరు, అవినీతి, ప్రజారోగ్యంపై అవసరమైనంతమేర వ్యయం చేయకపోవడం, ఉష్ణవాతావరణం వంటి అంశాలూ ప్రధాన కారకాలుగా నిలుస్తున్నాయి. అందువల్ల పరిశుభ్రత, శుద్ధజలం, సుపరిపాలన, ప్రజారోగ్య రంగానికి కేటాయింపులు పెంచడం, ప్రైవేటు ఆరోగ్యరంగాన్ని సరైన దిశగా నియంత్రించడం వంటి చర్యలన్నీ అవసరమని అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మన దేశంలో యాంటీబయాటిక్స్‌ను విరేచనాలు, జలుబు వంటి సమస్యలకూ అలవోకగా వాడేస్తుంటారని... పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయడం, వ్యక్తిగత శుభ్రత అలవాట్లు పాటించడం, అవసరమైన టీకాల్ని సకాలంలో తీసుకోవడం వంటి చర్యల ద్వారా ఇలాంటి అనారోగ్య సమస్యల తాకిడిని తగ్గించవచ్చని ఐసీఎమ్‌ఆర్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త రకం రోగనిర్ధారణ ఉపకరణాల్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలి. ఈ దిశగా అంకుర పరిశ్రమల్నీ ప్రోత్సహించాలి. యాంటీబయాటిక్‌ ఔషధ వ్యర్థ పదార్థాలు- భూగర్భ జలాలు, ఆహార పదార్థాల్లో కలిసే ముప్పు ఉండటంవల్ల జనవనరుల్లో పడేయకుండా కఠిన చట్టాల్ని తీసుకురావాలి. వాటిని కట్టుదిట్టంగా అమలు పరచాలి. ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారికి భారీగా జరిమానాల్ని విధించి నిక్కచ్చిగా వసూలు చేసేలా యంత్రాంగాన్ని పరిపుష్టీకరించాలి!

- శ్రీనివాస్‌ దరెగోని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.