ETV Bharat / opinion

కాలుష్యం కాటుకు నీరే గరళం! - రసాయన జలాలు పారిశ్రామిక వ్యర్థాలు నీటి కాలుష్యం

గాలి తరవాత అత్యంత వేగంగా కలుషితమవుతోన్న ప్రకృతి వనరు నీరే అనేది కాదనలేని సత్యం. భూమిపై ఉన్న నదులు, కాలువలు, సరస్సులు, చెరువులు, ఏరులతోపాటు భూగర్భ జలాలూ వేగంగా కలుషితమవుతున్నాయి. 2050 నాటికి భూమిపైన నీరంతా కలుషితమవుతుందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.

EDITORIAL
'వేగంగా కలుషితమవుతోన్న జలవనరులు'
author img

By

Published : Dec 24, 2020, 9:26 AM IST

ప్రకృతి వనరుల్లో గాలి తరవాత నీరే వేగంగా కలుషితమవుతోంది. భూమిపై ఉన్న నదులు, కాలువలు, సరస్సులు, చెరువులు, ఏరులతోపాటు భూగర్భ జలాలూ కాలుష్యం బారిన పడుతున్నాయి. ఇప్పటికే 60 శాతం నీటి వనరులు కలుషితమయ్యాయి. ఈ పరిస్థితిని నియంత్రించకపోతే ఈ పరిస్థితిని నియంత్రించకపోతే 2050 నాటికి భూమ్మీద నీరంతా గరళమవుతుందని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే 60 శాతం నీటి వనరులు కలుషితమయ్యాయి. నీరు తన సహజ స్వభావాన్ని కోల్పోయి రసాయనిక, భౌతిక మార్పులు చెందడమే కాలుష్యం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో చోటుచేసుకున్న అంతుచిక్కని వ్యాధి ఉదంతానికి నీటి కాలుష్యమే కారణమని నిపుణులు తేల్చారు. నీటిలో మోతాదుకు మించి రసాయనాలు, లోహ అవశేషాలు ఉండటాన్ని గుర్తించారు. బొద్దింకలు, దోమలు ఇతర కీటకాలను చంపే రసాయనాల్లో వినియోగించే విషప్రభావం ఉండే రసాయన అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవేకాకుండా సీసం, నికెల్‌ వంటి లోహాలూ ఆందోళనకర స్థాయిలో ఉండటం గమనార్హం.

జల సంరక్షణలో మనమెక్కడ..

'ఓషన్‌ ఇండెక్స్‌ హెల్త్‌' బృందం 2013లో 171 దేశాల్లో చేపట్టిన ఓ సర్వే ప్రకారం.. జల సంరక్షణలో రష్యా ప్రథమ స్థానంలో నిలవగా భారత్‌ 162వ స్థానానికి పరిమితమైంది. దేశంలో నీటి కాలుష్యానికి చాలా కారణాలనేకం. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వ్యవసాయ రసాయనాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు ప్రధాన కారకాలు. ఒకప్పుడు కాలువల ద్వారా వచ్చే నీటితో పంట చేలల్లో చేపలు ఎగసిపడేవి. అధిక మోతాదులో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంతో నీరు విషతుల్యమై చేలల్లో మచ్చుకైనా చేపలు కానరావడం లేదు. నీటిలో ఉండే నత్తలు, జలగలు, ఏలిక పాములు వంటి ఎన్నో జీవులు ఈ గరళం ధాటికి కనుమరుగై పోతున్నాయి. చేలల్లో రసాయన జలాలు నదుల్లోకి, నదుల్లో కలుషితమైన నీరు పొలాల్లోకి చేరి నీటి విషగాఢతను పెంచుతున్నాయి. ఈ నీటిని వినియోగించిన జీవులు, మొక్కల్లో చేరి అవి అందించే ఆహార పదార్థాల్లో విషాలుగా మారి దుష్ప్రభావాలను కలగజేస్తున్నాయి. చాలాచోట్ల తోళ్లు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, ప్లాస్టిక్‌, ఇంధనాలు, బ్యాటరీ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా యథేచ్ఛగా నదుల్లో వదులుతున్నారు. నగరాలే కాదు... గ్రామాల్లో సైతం మురుగు నీటిని మురికి కాలువల ద్వారా నదీజలాల్లో కలిపేస్తున్నారు. పారిశుద్ధ్య వ్యర్థాలు నీటి వనరుల గట్ల మీదే తాండవిస్తూ నిరంతరాయంగా నీటిలో కలిసి పోతున్నాయి.

ఇదీ చదవండి: వినియోగదారులకు పరిహారం అందితేనే న్యాయం

భూమి సహజ వడపోత యంత్రం..

ఎంతటి వ్యర్థ జలాలనైనా వడకట్టి, శుద్ధ జలాలను భూమిలో ఇంకించి వ్యర్థాలను తనలో కలుపుకొని కొన్నాళ్లకు మట్టిగా మార్చే గుణం భూమికు ఉంది. నిజానికి భూమి ఓ భారీ వడపోత యంత్రంలాంటిది. మట్టితో కూడిన పిల్ల కాలువలు, మురికి కాలువలు కనుమరుగై పోతున్న తరుణంలో మనుషులు వినియోగించిన నీరు, వ్యర్థ జలాలు- సిమెంటు కాలువలు, ప్లాస్టిక్‌ గొట్టాల ద్వారా భూమిలో ఇంకే పరిస్థితి లేకుండా నేరుగా జలాశయాల్లో కలుస్తున్నాయి. భారత్‌లో ప్రతి మనిషి రోజుకు సగటున 135 నుంచి 150 లీటర్ల నీటిని వాడుతున్నట్లు అంచనా. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం దేశంలో రోజూ 26,000 టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తులను వినియోగిస్తుండగా- 7,800 టన్నులు మాత్రమే పునశ్శుద్ధి అవుతోంది. మిగతా 18,200 టన్నుల ప్లాస్టిక్‌ భూమిలో, నీటి వనరుల్లో, సముద్రాల్లో వ్యర్థాలుగా కలుస్తోంది. 450 ఏళ్ల వరకు కరగని ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూగర్భ జలాలను నాశనం చేసేస్తున్నాయి. భూమిలోకి నీరు ఇంకకుండా అడ్డుపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్ర జలాల్ని కలుషితం చేస్తున్నాయి.

చట్టాలెన్నో..

మనదేశంలో నీటి వనరులను సంరక్షించుకునేందుకు 1974 నుంచి జలకాలుష్య నియంత్రణ నివారణ చట్టం అమలులో ఉంది. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986, ప్రమాదకర వృథా పదార్థాల (నిర్వహణ) నియమాలు-1989, ప్రమాదకర రసాయనాల తయారీ, నిల్వల దిగుమతి నిరోధక నియమాలు-1989, అటవీ సంరక్షణ చట్టం-1970, వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972, జాతీయ జీవవైవిధ్య చట్టం-2002... ఇవన్నీ నదుల పరిరక్షణ, జలకాలుష్య నియంత్రణ గురించి స్పష్టంగా చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నేటికీ కోట్లమంది కలుషితమైన నీటినే వాడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నీటితో నీళ్ల విరేచనాలు, కలరా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులతో ఏటా లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వీరిలో అయిదేళ్ల లోపు చిన్నారులు అధికంగా ఉండటం బాధాకరం. ఇలాంటి పరిస్థితులున్న క్రమంలో చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయడంతోపాటు, జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించేలా విస్తృత జనచేతన కార్యక్రమాలు చేపట్టాలి.

ఇదీ చదవండి: దిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలపై సుప్రీం అసంతృప్తి

ఇదీ చదవండి: వాయుకాలుష్యంతో దేశానికి లక్షల కోట్లు నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.