Diya Kumari vs Vasundhara Raje : రాజస్థాన్‌లో రాచరిక వ్యవస్థ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. రాజకుటుంబ నేపథ్యంతో వసుంధరా రాజే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అయితే ఆమెకు అధిష్ఠానం, ఆరెస్సెస్‌తో విబేధాలున్నాయి. అందుకే ఆమెను కొన్నేళ్లుగా బీజేపీ అధినాయకత్వం పక్కన పెట్టింది. ఆమెకు ప్రత్యామ్నాయంగానే ప్రముఖ రాజ కుటుంబానికి చెందిన దియాకుమారిని తెరమీదకు తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్‌సమంద్ లోక్‌సభ ఎంపీగా ఉన్న దియా కుమారిని ఆగమేఘాల మీద అసెంబ్లీ ఎన్నికల బరిలోకి బీజేపీ దింపింది. ప్రతిష్ఠాత్మక విద్యాధర్‌నగర్ నుంచి పోటీకి నిలిపింది. రాష్ట్రంలో పార్టీని దశాబ్దాలుగా బలోపేతం చేసిన భైరాన్ సింగ్ షెకావత్ వారసత్వమైన నర్పత్ సింగ్‌ను కాదని ఆ స్థానాన్ని దియాకు కట్టబెట్టింది.
Rajasthan Assembly Election 2023 : వసుంధరా రాజే 2003లో సీఎం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ఆర్ఎస్ఎస్తో విభేదాలు ఉన్నాయి. రాజేకు ప్రత్యామ్నాయంగా వేరొకరిని సిద్ధం చేయాలని ఆర్ఎస్ఎస్ యోచిస్తోంది. అదే సమయంలో బీజేపీలో అత్యున్నత నిర్ణయాధికారం కలిగిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతోనూ రాజేకు సంబంధాలు నామమాత్రమే. ఇదే సమయంలో దియా కుమారి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉన్నా.. బీజేపీ కార్యాలయ నిర్మాణానికి ఆమె సొంత స్థలాన్ని ఇచ్చారు. ఇటీవల ప్రధాని మోదీ జైపుర్‌లో నిర్వహించిన పరివర్తన్ యాత్రను ఆమె ముందుండి నడిపించారు. ఈ క్రమంలో ఆమెనే రాజేకు ప్రత్యామ్నాయంగా ఉంచాలని అధిష్ఠానం యోచిస్తోంది.
-
विद्याधर नगर विधानसभा क्षेत्र में जनसंपर्क के क्रम में सेक्टर-08 के मेरे व्यापारी भाइयों के साथ सार्थक बैठक हुई।
— Diya Kumari (@KumariDiya) October 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
बैठक में पार्षद पूर्व जिलाध्यक्ष श्री जितेंद्र जी शर्मा, श्री नरेश जी गुप्ता, श्री एस. सी. गुप्ता जी, श्री बी.एल. मालाकार जी, श्री नरेन्द्र सिंह जी राजावत, श्रीमती… pic.twitter.com/m0Hlgg4vEF
">विद्याधर नगर विधानसभा क्षेत्र में जनसंपर्क के क्रम में सेक्टर-08 के मेरे व्यापारी भाइयों के साथ सार्थक बैठक हुई।
— Diya Kumari (@KumariDiya) October 21, 2023
बैठक में पार्षद पूर्व जिलाध्यक्ष श्री जितेंद्र जी शर्मा, श्री नरेश जी गुप्ता, श्री एस. सी. गुप्ता जी, श्री बी.एल. मालाकार जी, श्री नरेन्द्र सिंह जी राजावत, श्रीमती… pic.twitter.com/m0Hlgg4vEFविद्याधर नगर विधानसभा क्षेत्र में जनसंपर्क के क्रम में सेक्टर-08 के मेरे व्यापारी भाइयों के साथ सार्थक बैठक हुई।
— Diya Kumari (@KumariDiya) October 21, 2023
बैठक में पार्षद पूर्व जिलाध्यक्ष श्री जितेंद्र जी शर्मा, श्री नरेश जी गुप्ता, श्री एस. सी. गुप्ता जी, श्री बी.एल. मालाकार जी, श्री नरेन्द्र सिंह जी राजावत, श्रीमती… pic.twitter.com/m0Hlgg4vEF
Diya Kumari News : వసుంధరా రాజే, దియా కుమారి ఇద్దరూ ప్రముఖ రాజకుటుంబాల నుంచి వచ్చిన వారే. అయితే రాజేకు ఉన్న రాజకీయ అనుభవం దియా కుమారికి లేదు. ఆమె రాజకీయ మూలాలు కాంగ్రెస్లో ప్రారంభమయ్యాయి. దియా ఇప్పటి వరకు కేవలం 2 సార్లే అంటే.. 2013 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేశారు. దియా వ్యక్తిగత జీవితం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. దియా అనుచిత వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంటారు. దియా 1990లో ప్రేమవివాహం చేసుకున్నారు. దీనిపై కుటుంబం నుంచే కాక రాజ్‌పుత్ సంస్థల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాదాపు 10 ఏళ్లు వైవాహిక జీవితం గడిపిన ఆమె 2019లో విడాకులు తీసుకున్నారు.
దియా కుమారిని బీజేపీలోకి తీసుకొచ్చింది వసుంధరా రాజేనే. 2013 ఎన్నికల సమయంలో మోదీ నిర్వహించిన ర్యాలీలో దియా కుమారిని ఆయనకు పరిచయం చేసి.. రాజే టికెట్ ఇప్పించారు. పలు అనూహ్య పరిస్థితుల వల్ల క్రమంగా వారిద్దరి మధ్య వైరం పెరిగిపోయింది.
Rajasthan Elections 2023 : రాజస్థాన్‌లో సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేక కాంగ్రెస్‌కే జై కొడతారా?