ETV Bharat / opinion

బాల్యానికి కరోనా గ్రహణం- భవిత ప్రశ్నార్థకం! - పిల్లలపై కరోనా ప్రభావం

కొవిడ్‌ సంక్షోభంతో ఏడాదిన్నర కాలంగా విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. బాల్యాన్ని, చదువుల్ని, కొంతమంది కుటుంబ భద్రతను కోల్పోతున్నారు. బడులు తెరవకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది బాలలు, యువత కరోనా కారణంగా విద్యను కోల్పోయారు. చిన్నారుల భవితవ్యం ప్రశ్నార్థకం మారింది.

Coronavirus effect on Children future
చిన్నారుల భవిష్యత్​
author img

By

Published : Jul 9, 2021, 7:13 AM IST

కరోనా గడ్డు కాలంలో పిల్లల భద్రతకు భరోసా ఉందా... వారి ఆరోగ్యం, రక్షణ, చదువు, భవిష్యత్తు మాటేమిటి? ఇటువంటి ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వేధిస్తున్నాయి. కొవిడ్‌ సంక్షోభంతో ఏడాదిన్నర కాలంగా విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. బాల్యాన్ని, చదువుల్ని, కొంతమంది కుటుంబ భద్రతను కోల్పోతున్నారు. కరోనా కాలంలో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. బడులు తెరవకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 37 కోట్ల మంది బాలలు పౌష్టికాహారానికి దూరమయ్యారు. యునెస్కో 2020 నివేదిక ప్రకారం 138 దేశాల్లో 130 కోట్ల మంది బాలలు, యువత కరోనా కారణంగా విద్యను కోల్పోయారు. ‘లాన్సెట్‌’ పత్రిక ఏడు దేశాల్లో చేపట్టిన సర్వేలో- ప్రతి పది లక్షల మంది చిన్నారుల్లో ఇద్దరు కొవిడ్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారని వెల్లడైంది. కరోనా మూడో దశ విజృంభణలో పిల్లలకు ప్రమాదం ఎక్కువగా ఉంటుందనే అంచనాలను పలువురు నిపుణులు వెలువరించారు. మరోవైపు ఆ అంచనాలను విశ్వసించాల్సిన అవసరం లేదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కాస్త ఊరట కలిగించే అంశం.

అనాథలకు ఆపన్న హస్తం

ఈ తరుణంలో ముందస్తు వ్యూహాలతో బాలలను కంటికి రెప్పలా కాచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతగానో ఉంది. వారికి ఆరోగ్యపరంగా కావాల్సిన వసతులు, రక్షణ ఇవ్వగలమా, వైద్య సదుపాయాలు అందించగలమా అనేది సందేహమే. కరోనా కాలంలో బాలల హక్కుల ఉల్లంఘనలూ పెచ్చరిల్లాయి. బాల్య వివాహాలు పెరిగిపోయాయి. భారత్‌లో బాల కార్మికుల సంఖ్య రెట్టింపయిందని గణాంకాలు తెలుపుతున్నాయి. లైంగిక వేధింపులు, అక్రమ రవాణా వంటివి పెచ్చుమీరుతున్నాయి. పేదరికంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ బాలలు వీధిన పడుతున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఎందరో చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారు. జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం ఇటీవల సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదిక ప్రకారం- భారత్‌లో 2020 మార్చి నుంచి ఇప్పటివరకు దాదాపు 1,700 మంది పిల్లలు అనాథలయ్యారు. 7,400 మంది చిన్నారులు- తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయారు. మొత్తం 9,346 మంది బాలలు కొవిడ్‌ బాధితులయ్యారు. ఇలా అనాథలుగా మారిన పిల్లలకు ‘పీఎం కేర్స్‌ ఫండ్‌’ నుంచి ప్రత్యేకమైన ప్యాకేజీని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ముదావహం. వారికి 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల కార్పస్‌ నిధి, తరవాత అయిదేళ్లు, అంటే 23 ఏళ్లు వచ్చేవరకు ప్రతి నెలా స్టయిపెండ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆయుష్మాన్‌ భారత్‌ లేదా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అనాథ బాలలకు అయిదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్నీ వర్తింపజేయనున్నట్లు తెలిపింది. అయితే, కార్పస్‌ నిధి ద్వారా ఎప్పుడో 18 ఏళ్లకు వచ్చే డబ్బు కంటే ప్రస్తుతం అందించాల్సిన సహాయం చాలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది కొంతమేర వాస్తవమే.

కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ కొవిడ్‌ బాధిత బలల సంరక్షణకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ నెలరోజుల క్రితం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్లు, పోలీసులు, స్థానిక సంస్థల విధులను వివరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్‌ బాధిత బాలల్ని సర్వేల ద్వారా గుర్తించి, ప్రతి ఒక్కరి సమాచారాన్ని ‘ట్రాక్‌ చైల్డ్‌ పోర్టల్‌’లో అప్‌లోడ్‌ చేయాలని కోరింది. కొవిడ్‌ బాధిత బాలల మానసిక ఆరోగ్య అవసరాలకు ప్రత్యేకమైన హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. బాధిత బాలలకు జిల్లా కలెక్టర్‌ సంరక్షకులుగా వ్యవహరించాలని తెలిపింది. వారి పునరావాసానికి బాలల న్యాయ చట్టం-2015లో తెలిపిన విధంగా చర్యలు చేపట్టాలని తెలిపింది. జిల్లా స్థాయిలో ఒక కార్యదళాన్ని ఏర్పాటు చేసి ఈ బాలలకు అన్ని రకాల సేవలూ అందించాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని తెలిపింది. ప్రభుత్వం అత్యంత సమగ్ర రీతిలో మార్గదర్శకాలు విడుదల చేయడం బాగానే ఉన్నా- ఇవన్నీ పూర్తిగా అమలైతేనే కొవిడ్‌ బాధిత బాలలకు న్యాయం జరుగుతుంది.

తక్షణ సాయం కీలకం

ప్రస్తుతం బాలల ఆకలి తీర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. పాఠశాలలు మూతపడటంతో సరైన పౌష్టికాహారం, ఆటపాటలు లేక బాలలెదరో సతమతమవుతున్నారు. అందువల్ల చిన్నారులంతా కరోనా బాధితులే. అనాథలుగా మారిన వారి గురించి మాత్రమే ఆలోచిస్తే సరిపోదు. బాలలు అందరికీ పౌష్టికాహారం, విద్య, భద్రత తప్పనిసరి. అందరికీ ఆన్‌లైన్‌ విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. బడులు మూసివేయడం వల్ల మధ్యాహ్న భోజన పథకం మూలన పడింది. దేశంలోని ప్రతి చిన్నారికీ పౌష్టికాహారం అందించే బాధ్యత ప్రభుత్వానిదే. ఇండియాలో ప్రతి రాష్ట్రంలో ఉన్న బాలల సంరక్షణ సమితులు, జిల్లా బాలల సమగ్ర రక్షణ అధికారులు, పంచాయతీ లేదా మున్సిపాలిటీ సిబ్బంది, క్షేత్ర స్థాయిలో పనిచేసే అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, జిల్లా కలెక్టర్లు, బాలల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు... అందరూ కలిసి పనిచేస్తేనే బాలలను కరోనా నుంచి రక్షించుకోగలం. బడి ఈడు విద్యార్థుల బాధ్యత ప్రతి ఒక్కరిదీ. ప్రభుత్వాలు వారికోసం బడ్జెట్‌ కేటాయింపుల్ని గణనీయంగా పెంచాలి. అధికారులంతా చిత్తశుద్ధితో పని చేస్తున్నారా లేదా అనేదీ పర్యవేక్షించాలి. ప్రపంచంలో 220 కోట్ల మంది బాలలు ఉంటారని అంచనా; ఇందులో మూడో వంతు భారత్‌లోనే ఉన్నారు. వీరిని సంరక్షించి, సరైన రీతిలో పెంచి పోషిస్తేనే దేశానికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుంది.

ప్రత్యేక పథకాలతో నష్ట నివారణ

కరోనా సంక్షోభ కాలంలో పలు దేశాలు చిన్నారుల విద్యాభ్యాసం విషయంలో వైవిధ్యభరితంగా వ్యవహరిస్తున్నాయి. అర్జెంటీనాలో బాలలకు పుస్తకాలు, ట్యాబ్‌లతో కూడిన ప్రత్యేకమైన కిట్లు ఇస్తున్నారు. టీవీ, రేడియోల్లో పాఠాలు ప్రసారం చేస్తున్నారు. బాలల విద్య కోసం అంతర్జాల సదుపాయాన్ని ఉచితంగా అందిస్తున్నారు. కెన్యాలోని గ్రామాల్లో 4జీ సేవలు అందజేస్తున్నారు. చైనాలో తల్లిదండ్రులే ఇంట్లో పిల్లలకు బోధించే విధంగా ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారు. భారత్‌లోనూ ఈ తరహా ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం దీక్ష పోర్టల్‌, ఇ-పాఠశాల (ఎన్‌సీఈఆర్‌టీ), స్వయం, స్వయంప్రభ ఓటీహెచ్‌ ఛానెల్‌... ఇలాంటివెన్నో బాలల చదువు కోసం ప్రవేశపెట్టింది. ప్రైవేటు బడులూ ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాయి. అంతర్జాల సదుపాయం లేకపోవడం, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లూ అందుబాటులో లేకపోవడంవల్ల గ్రామీణ నిరుపేద బాలలు చదువుకు పూర్తిగా దూరమయ్యారు. వీరిందరినీ మళ్ళీ గాడిలో పెట్టాలంటే ప్రత్యేక పథకాలు అత్యావశ్యకం.

రచయిత - డాక్టర్‌ మమతా రఘువీర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.