ETV Bharat / opinion

కరోనా వ్యాక్సిన్​ సముచిత పంపిణీతోనే రక్షణ

కరోనా వ్యాక్సిన్​ తయారీలో ప్రపంచ శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. కొన్ని దేశాలు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు పూర్తి కావడానికి ముందుగానే పెద్దయెత్తున డోసులు కొనుగోలు చేసేస్తున్నాయి. వ్యాక్సిన్‌ పంపిణీలో అందరూ పరస్పర సహకార ధోరణితో వ్యవహరించాల్సిన అవసరాన్ని తాజా అధ్యయన నివేదికలు సూచిస్తున్నాయి. లేని పక్షంలో మహమ్మారి పిడికిట్లో మరి కొంతకాలం చిక్కుకోవాల్సి రావచ్ఛు. అందువల్లే టీకాల పంపిణీలో రెండు రకాల పరిస్థితులను అధ్యయనం చేయాలని నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీలోని మాబ్స్‌ ల్యాబ్‌ను మా ఫౌండేషన్‌ కోరింది.

author img

By

Published : Sep 18, 2020, 7:30 AM IST

COVID-19 vaccine distribution  COVID-19 vaccine distribution would take 4-5 years
కరోనా వ్యాక్సిన్​ సముచిత పంపిణీతోనే రక్షణ

ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో రెండు అంశాలపై అందరికీ స్పష్టత ఉంది. ఒకటి- కొవిడ్‌ మహమ్మారిని సాధ్యమైనంత త్వరగా రూపుమాపడం; రెండు- సాధ్యమైనన్ని జీవితాలను కాపాడుకోవడం! అందుకోసమే టీకా తయారీకి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరుగులు తీస్తున్నారు. కొన్ని దేశాలు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు పూర్తి కావడానికి ముందుగానే పెద్దయెత్తున డోసులు కొనుగోలు చేసేస్తున్నాయి. వ్యాక్సిన్‌ పంపిణీలో అందరూ పరస్పర సహకార ధోరణితో వ్యవహరించాల్సిన అవసరాన్ని తాజా అధ్యయన నివేదికలు సూచిస్తున్నాయి. లేని పక్షంలో మహమ్మారి పిడికిట్లో మరి కొంతకాలం చిక్కుకోవాల్సి రావచ్ఛు అందువల్లే టీకాల పంపిణీలో రెండు రకాల పరిస్థితులను అధ్యయనం చేయాలని నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీలోని మాబ్స్‌ ల్యాబ్‌ను మా ఫౌండేషన్‌ కోరింది. అత్యధిక ఆదాయంగల సుమారు 50 దేశాలు తొలి 200 కోట్ల టీకాల మోతాదుపై గుత్తాధిపత్యం చలాయిస్తే పరిస్థితి ఏమిటనేది మొదటిది. సంపద ఆధారంగా కాకుండా జనాభా ప్రాతిపదికన టీకాలను పంపిణీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది రెండో ప్రాతిపదిక.

మాబ్స్‌ ల్యాబ్‌ బృందం అనేక సంవత్సరాలుగా ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తిపై నమూనాలను రూపొందిస్తోంది. కొవిడ్‌ను అంచనా వేయడానికి మాబ్స్‌ ల్యాబ్‌కు తగినంత సామర్థ్యం ఉంది. ముందుకు వెళ్లేకొద్దీ కొవిడ్‌ ఎలాంటి ఉపద్రవాలు తెచ్చిపెడుతుందో తెలియకపోవడం మానవాళికి పెద్ద సవాలు. ఒకవేళ మార్చి మధ్యనాటికే టీకా అందుబాటులోకి వచ్చిఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ప్రాతిపదికగా చేసుకుని పరిశోధన బృందం అధ్యయనం చేసింది. టీకా అందుబాటులోకే రాకపోవడంతో వారు కొన్ని అంచనాలను ప్రాతిపదికగా తీసుకోవాల్సి వచ్చింది. సింగిల్‌ డోస్‌ టీకా వేసిన రెండు వారాల తరవాత సుమారు 80 శాతం సమర్థంగా పనిచేస్తుండవచ్చని, వారానికి 12.5 కోట్ల డోసులను వేయొచ్చనే అంచనాలతో ఈ అధ్యయనం చేశారు. ఇందులో సింహభాగం ఇప్పటిదాకా చోటుచేసుకున్న పరిణామాల డేటా అధ్యయనంపై ఆధారపడినదే.

అక్రమ నిల్వలు అనర్థదాయకం

సముచితంగా టీకా పంపిణీ జరిగిన పక్షంలో సెప్టెంబర్‌ ఒకటినాటికి సుమారు 61 శాతం మరణాలను నివారించి ఉండవచ్ఛు సంపన్న దేశాలు టీకాలను అక్రమంగా నిల్వ చేసి ఉంటే రెట్టింపు సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడేవారు. ప్రపంచవ్యాప్తంగా మూడొంతుల దేశాల్లో నాలుగు నెలల పాటు అడ్డూఅదుపూ లేకుండా వ్యాధి వ్యాపిస్తూనే ఉండేది. ఒకవేళ మార్చి మధ్య నాటికి టీకా అందుబాటులోకి వచ్చి ఉంటే దాన్ని ముందుగా అత్యధిక ఆదాయ దేశాల ప్రాతిపదికన కాకుండా జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసి ఉంటే అనేకమంది ప్రాణాలు కాపాడగలిగి ఉండేవాళ్లం. దురదృష్టవశాత్తు, అనేక సంపన్న దేశాల ధోరణులు చూస్తుంటే, అక్రమంగా నిల్వ చేసుకునే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీకాను రిజర్వ్‌ చేసుకునేందుకు ఔషధాల తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలనే తాపత్రయం అర్థం చేసుకోదగినదే. తమ ప్రజల ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. అయితే, ఏ కొద్ది ద్వైపాక్షిక లావాదేవీలతోనో సమర్థ.మైన వ్యూహం రూపొందించుకోవచ్చని భావించిన పక్షంలో అది పెద్ద తప్పిదమే కాగలదు.

మహమ్మారి, ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. వీటికి దేశాల స్థాయిలో పరిష్కార మార్గాలు సరిపోవు. వైరస్‌లకు సరిహద్దులనేవి అర్థరహితమైనవి. సమయం గడిచే కొద్దీ ఆర్థిక వ్యవస్థలకు ఇది తెలిసివస్తోంది. న్యూజిలాండ్‌నే ఉదాహరణగా తీసుకుందాం. వ్యాధిని చక్కగా నియంత్రించి, రగ్బీ స్టేడియాలు జనాలతో కిక్కిరిసిపోయేంత స్థాయికి ఆ దేశం చేరింది. కానీ, వైరస్‌ తిరగబెట్టింది. దాంతో అక్కడ మళ్ళీ లాక్‌డౌన్‌ అనివార్యమైంది.

అందరికీ ప్రయోజనమే పరమావధి

మేమిద్దరమూ ఆరోగ్యం విషయంలో సమానత్వం ఉండాలని కోరుకుంటాం. లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీసే వ్యాధులతో మా ఫౌండేషన్‌ పోరాడుతోంది. సంపన్న దేశాలకు ఇవి పట్టవు. పేద దేశాలను వెనక్కి నెట్టివేసే అవకాశం ఉంది. టీకాలను సముచితంగా పంపిణీ చేస్తే మహమ్మారి చాలా వేగంగా అంతమవుతుంది. అందరికీ ప్రయోజనం చేకూరుతుంది. తద్వారా ప్రతి నెలా ప్రపంచ దేశాలు దాదాపు 50 వేలకోట్ల డాలర్లు ఆదా చేయగలవన్నది ఐఎమ్‌ఎఫ్‌ అంచనా. ఇతర దేశాల్లో మహమ్మారి విస్తరిస్తుంటే ఏ కొన్ని దేశాలో పురోగమన బాటలో ఉండే పరిస్థితులు ప్రస్తుతం లేవు. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినడమే ఇందుకు కారణం.

వైద్య పరీక్షల నిర్వహణ, చికిత్స; టీకాల పరిశోధన, అభివృద్ధి, తయారీ, పంపిణీలో అపార అనుభవంగల అంతర్జాతీయ వైద్య సంస్థలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చే కార్యక్రమానికి మా ఫౌండేషన్‌ మద్దతు ఇస్తోంది. కోవాక్స్‌ అనే సమష్టి ప్రయత్నానికి మద్దతునిచ్చే దేశాలన్నీ కోవాక్స్‌ పోర్ట్‌ఫోలియోలోని టీకాలను రిస్కులున్న జనాభా నిష్పత్తి ప్రకారం పొందవచ్ఛు ఐరోపా సమాఖ్య, దక్షిణ కొరియా, జపాన్‌, అనేక మధ్య ప్రాచ్య దేశాలు కోవాక్స్‌ ప్రయత్నానికి సహకరిస్తుండటం సానుకూలాంశం. కోవాక్స్‌లో చేరడానికి ఇష్టపడని దేశాలు ఇతర మార్గాల్లో సహకారం అందించవచ్ఛు తమకు కేటాయించిన టీకా డోసులలో కొంత అల్పాదాయ దేశాలకు కేటాయించవచ్ఛు హెచ్‌1ఎన్‌1 మహమ్మారి తలెత్తినప్పుడు కొన్ని దేశాలు అనుసరించిన విధానమది. అల్పాదాయ దేశాల్లో టీకా పంపిణీలో రెండు దశాబ్దాలకుపైగా అనుభవంగల ‘గవి’కి వితరణగా ఇవ్వవచ్ఛు ఈ సంక్షోభ సమయంలో ఫార్మా సంస్థలూ తమ ఉత్పత్తులు అందరికీ అందుబాటు ధరల్లో లభించేలా చూడటం ముఖ్యం. అందరూ కలిసికట్టుగా పనిచేయడం ద్వారా ముందుకు సాగగలమని మేం విశ్వసిస్తున్నాం. భవిష్యత్తు అనేది విజేత, పరాజితులను నిర్ధారించే పోటీకాదనే అంశాన్ని వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. అంతా పరస్పరం సహకరించుకోవాలి. అప్పుడే మనమంతా కలిసికట్టుగా పురోగతి సాధించగలం!

- బిల్‌ గేట్స్‌, మెలిండా గేట్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.