ETV Bharat / opinion

కేరళలో కొవిడ్‌ కల్లోలం- మళ్లీ వైరస్​ విజృంభణ - కరోనా పాజిటివిటీ రేటు

కరోనా మళ్లీ తిరగబడుతుందా? అంటే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు అందుకు సంకేతంగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటే- కేరళలో మరింత ఆందోళనకరంగా ఉంది. ఆ రాష్ట్రంలో కేసులు రెండు వారాలుగా ఉద్ధృతమయ్యాయి. ఈ పరిస్థితుల్లో కేరళ సరిహద్దుల్లో కర్ణాటక ఆంక్షలు విధించింది. తమిళనాడు సైతం కేరళ నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష, కొవిడ్‌ టీకా ధ్రువపత్రాలను తప్పనిసరి చేసింది.

Corona outbreak in Kerala
కేరళలో కరోనా
author img

By

Published : Aug 2, 2021, 6:46 AM IST

గడచిన నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు 80శాతం మేర పెరిగాయి. భారత్‌లో 46జిల్లాల్లో పది శాతానికి పైగా, 53జిల్లాల్లో అయిదు నుంచి పది శాతం వరకు పాజిటివిటీ రేటుతో కేసులు నమోదవుతున్నాయి. ఆయా జిల్లాల్లో కఠిన ఆంక్షలను అమలు చేయాలంటూ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. మరోవైపు టీకాల కొరతతో వాటి పంపిణీ మందకొడిగా సాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటే- కేరళలో మరింత ఆందోళనకరంగా ఉంది. ఆ రాష్ట్రంలో కేసులు రెండు వారాలుగా ఉద్ధృతమయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 22 వేలు దాటింది. పాజిటివిటీ రేటు 11 నుంచి 14.5శాతం వరకు ఉంటోంది. ఈ పరిస్థితుల్లో కేరళ సరిహద్దుల్లో కర్ణాటక ఆంక్షలు విధించింది. తమిళనాడు సైతం కేరళ నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష, కొవిడ్‌ టీకా ధ్రువపత్రాలను తప్పనిసరి చేసింది.

కేసుల పెరుగుదలకు ఆ ఉత్సవమే కారణమా?

దేశం మొత్తమ్మీద ఒక్కరోజులో నమోదయ్యే కేసుల్లో సగానికిపైగా కేరళలోనే ఉంటున్నాయి. అయినా అక్కడ వారాంతపు లాక్‌డౌన్‌ మాత్రమే విధించారు. ప్రధానంగా పాలక్కాడ్‌, కొట్టాయం జిల్లాల్లో నెల రోజుల్లో కేసులు రెట్టింపయ్యాయి. కోజికోడ్‌, మళప్పురం, కన్నూరు, ఎర్నాకుళం, త్రిసూరు, కొల్లాం, తిరువనంతపురం లాంటి జిల్లాల్లోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. రాష్ట్రంలో జులై ఒకటో తేదీ నాటికి 1.02 లక్షల క్రియాశీల కేసులే ఉండగా- 30 నాటికి ఏకంగా 1.55 లక్షలకు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇవి దేశం మొత్తమ్మీద ఉన్న (4.05 లక్షల) క్రియాశీల కేసుల్లో దాదాపు 38శాతం. అసలు కేరళలో కేసులు ఉన్నట్లుండి ఇంత ఎక్కువసంఖ్యలో పెరగడానికి కారణం.. ఇటీవల ఓ మతపరమైన ఉత్సవం సందర్భంగా కొవిడ్‌ ఆంక్షలను సడలించడమేనన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.

రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతూ- సగటున రోజుకు 3,200 మందికి పైగా కొవిడ్‌ తీవ్రతతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 12.93శాతం పాజిటివిటీ రేటు ఉంటోంది. కొవిడ్‌ పునరుత్పత్తి రేటు రోజురోజుకూ పెరగడాన్ని చూస్తే అక్కడ మూడోదశ కూడా మొదలవుతోందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్‌ 14 నుంచి జులై 6 వరకు భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కేరళలో సీరోసర్వే నిర్వహించింది. దేశం మొత్తమ్మీద ఈ రాష్ట్రంలోనే అతి తక్కువగా 44.4శాతం ప్రజల్లో కొవిడ్‌ ప్రతిరక్షకాలు (యాంటీ బాడీలు) ఉన్నట్లు అందులో తేలింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నింటిలో దాదాపు మూడింట రెండు వంతుల ప్రజలకు ప్రతిరక్షకాలు ఉన్నాయి. కేరళలో ఇప్పటికే సగానికి పైగా జనాభాకు కనీసం ఒక్క డోసైనా టీకా అందినా- ఈ పరిస్థితి దాపురించడం ఆందోళన కలిగిస్తోంది.

మహారాష్ట్రను మించి..

రోజువారీ కేసుల పెరుగుదలలో కేరళ- మహారాష్ట్రను మించిపోయింది. ఇతర రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా... కేరళలో మాత్రం స్థిరంగా ఉండటం లేదా పెరగడం ఆందోళనకరమే. మే మొదటి వారంలో దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కర్ణాటకలో రోజుకు సగటున 46,045, కేరళలో 36,239 కేసులు చొప్పున వచ్చాయి. జూన్‌ 30 నుంచి జులై 6 వరకు చూస్తే కర్ణాటకలో రోజుకు 2,646 కేసులు రాగా- కేరళలో మాత్రం 12,226 కేసులు వచ్చాయి. కొవిడ్‌ పునరుత్పత్తి లేదా వ్యాప్తి విలువ కేరళలో 1.11గా ఉంది. అంటే ప్రతి వందమంది రోగుల నుంచి మరో 111 మందికి అది వ్యాపిస్తోంది. దేశం మొత్తమ్మీద సగటున ఇది 0.95గానే ఉండటం గమనార్హం.

ఇది ఒకటి కంటే ఎంత తక్కువ ఉంటే అంత తక్కువగా వ్యాధి వ్యాప్తి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే కేరళలో మరికొన్నాళ్లు కేసుల తీవ్రత ఇదే స్థాయిలో ఉండబోతోందని అర్థమవుతుంది. తొలిదశ వైరస్‌ వ్యాప్తి సమయంలో పరిస్థితి కొంతవరకు అదుపులోనే ఉన్నా, ఈసారి మరణాల రేటు ఎక్కువగా కనిపిస్తోంది. కేరళలో రోజూ సగటున వంద మందికి పైగా మృతి చెందుతున్నారు. ఒక్క జులై నెలలోనే 3,226 కొవిడ్‌ మరణాలు ఆ రాష్ట్రంలో సంభవించాయి. ఎక్కువ మంది స్వల్ప లక్షణాలున్నా పరీక్షలకు వస్తుండటం వల్లే కేసుల సంఖ్య ఎక్కువగా ఉండి ఉండొచ్చని కేరళ వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. తొలిదశలోనూ ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడే ఆలస్యంగా కేసులు వచ్చాయని గుర్తుచేస్తున్నారు. కేరళలో వైద్యఆరోగ్య వ్యవస్థ బలంగా ఉండటం వల్ల కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్నవి కూడా రీఇన్ఫెక్షన్లు కావని, కొత్తగా వస్తున్న కేసులేనని విశ్లేషిస్తున్నారు. కేసుల సంఖ్య తగ్గాలంటే కఠినమైన లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు.

రచయిత- రఘురామ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.