ETV Bharat / opinion

తన స్వార్థమే తన శత్రువు.. ఇకనైనా మనిషి మారేనా?

author img

By

Published : Jul 30, 2020, 11:31 AM IST

తమ స్వార్థం కోసం సామాజిక బాధ్యతను విస్మరిస్తున్న మానవ జాతికి కరోనా సంక్షోభం ఓ చక్కటి గుణపాఠం నేర్పుతోంది. వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత పాటించకపోతే.. ఏర్పడే కష్ట, నష్టాలను కళ్లకు కట్టినట్లు చెబుతోంది.

Corona teaching lesson -  His selfishness is his enemy
తన స్వార్థమే తన శత్రువు!

'ఇచ్చట ఉమ్మి వేయరాదు', 'ఇచ్చట మూత్రవిసర్జన చేయరాదు', 'ఇచ్చట చెత్త వేయరాదు'- మనకివి సుపరిచితమైన మాటలు. ఇంటిని చూసుకుంటున్నట్లుగా వీధిని, ఊరిని చూసుకొమ్మని చెప్పకనే చెప్పే కఠోర సత్యాలు. నిత్యావసరంగా తిరిగే ఆర్టీసీ బస్సులోనూ 'ఈ బస్సు మనందరిది, పరిశుభ్రంగా ఉంచుదాం' అని వేడుకోలు మాటలు మనకు ఉపయోగపడేవే అయినా సమాజ ఆస్తికి పూచికపుల్ల విలువ ఇవ్వం. అందువల్లే అలాంటి అభ్యర్థనలు.

కరోనా సృష్టించిన మహోత్పాతంతో వ్యక్తిగత శుభ్రతతోపాటు, పరిసరాల పరిశుభ్రత అత్యంత ముఖ్యమైన అంశమని ప్రభుత్వాలు ప్రజల చెవుల్లో ఇల్లు కట్టుకొని చెబుతున్నాయి. అందుకే పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది నిర్వరామంగా కరోనాను నియంత్రించే మహోన్నత ఘట్టంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి వారికి పాదపూజ చేసి, వారి విలువను లోకానికి విశదీకరించారు.

సామాజిక బాధ్యత ఏదీ?

'మన ఇల్లు శుభ్రంగా ఉంటే మేలు... మన చెత్త వీధిలో వేస్తే చాలు' అనే స్వయంప్రేరక సూక్తుల్ని వల్లె వేసుకుంటూ నడిచిన జనానికి, బెత్తం పట్టుకుని తరగతులన్నీ చుట్టేస్తున్న పెద్ద మాస్టారిలా కరోనా ప్రతివీధిలోకి తొంగిచూస్తుంటే, ప్రజలందరూ భయం గూడులో బిత్తరచూపులు చూస్తున్నారు. ప్రాణాల మీదకు వస్తేగాని ప్రాణవాయువు విలువ తెలియదని, ఇప్పుడు బయటకు వెళ్తే ముఖ కవచం బిగించి వస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది ప్రవర్తన ఎలా ఉందంటే- పది తలలకు సరిపడా రోగనిరోధక శక్తి ఉంది గనక తనకు పడిశం, గిడిశం పట్టవని, ముఖ కవచాలూ సరిపడవంటూ ఏమీ వేసుకోకుండానే వచ్చేస్తున్నారు. అంటే తనకు ఏమీ కాదు, మిగతా మనుషులకు ఏమైనా తనకేమీ సంబంధం లేదనే ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇలాంటి దురంధరుల కోసమే మాస్క్‌ తప్పనిసరి చేసి, అవి లేకుండా బయటకు వస్తే జరిమానా విధిస్తామనే ప్రకటన వచ్చింది.

ఓ మనిషీ మారవా?

మనిషి ప్రకృతిలో భాగం. మిగతా జీవరాసులతో పాటు మనిషీ ఈ భూమ్మీదకు వచ్చి జీవనం సాగించి వెళ్లిపోవలసినవాడే. అయితే మిగతా జీవరాసులకన్నా బుడ్డి జీవి కావడంవలల నుంచున్న భూమినే తన స్వార్థపు జిత్తులతో తవ్వేస్తున్నాడు. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న చందాన ఇప్పుడు మానవ మనుగడకే ప్రమాదమని పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు చెబుతున్నా- మనిషి మాత్రం తన విలాసం కోసం ప్రకృతి విలపించే పనులు చేసుకుంటూ పోతున్నాడు. కంటికి కనిపించని కరోనా మాత్రం కనులు తెరిపించే కఠోర వాస్తవాల్ని చూపించింది.

1986లో ప్రారంభించిన గంగానది పరిశుభ్ర కార్యక్రమం మూడు దశాబ్దాల్లో సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా ఆశించిన ఫలితాలు రాలేదని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ వెలలడిస్తే, కరోనా కారణంగా పరీవాహక ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు మూతపడిన నెల రోజుల్లోనే గంగానది శుభ్రపడిందంటే మనుషులు చేస్తున్న కాలుష్య కిరాతకం అంతా ఇంతా కాదు. ప్రమాద స్థాయి దాటిపోయిన దిల్లీ వాయు కాలుష్యం లాక్‌డౌన్‌ అయిన తొలినాళ్ళకే 79శాతం తగ్గిందంటే మనిషి బయటతిరగడం కన్నా, ఇంట్లో ఉంటేనే ప్రకృతి పచ్చగా ఉంటుందని అనిపించక మానదు.

సర్వం స్వాహా చేసి...

తన స్వార్ధంకోసం అడవుల్ని, నదుల్ని, సముద్రాల్ని, భూమిని యథేచ్ఛగా పాడుచేస్తున్న మనుషులు- తిరిగి తిరిగి తమ జీవితానికే ప్రమాదం ఎదురైనప్పుడు మాత్రం మాత్రం లబోదిబోమని పరుగులు తీస్తుంటారు. కరోనా కట్టడి విషయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఎంత చెప్పినా వినకుండా, చిన్న చిన్న కారణాలకు రోడ్లమీదకు వస్తున్న ప్రజలు మరింతగా ఆత్మావలోకనం చేసుకోవలసిన అవసరం ఉంది. మన ఇల్లు లాగే, మన వీధి, మన ఊరు శుచిగా ఉండాల్సిన అవసరం, ఉంచుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్కరి మీదా ఉంది. పట్టణాలు, నగరాలు దగ్గర నుంచి పల్లెల వరకు కరోనా వ్యాప్తితో లాక్‌డౌన్‌ అయిపోతున్న ఈ తరుణంలో బయటకు వచ్చే మనుషులతా సమాజానికి ప్రమాదాన్ని పెంచి, ఆపై తమకు, తమ కుటుంబానికి వ్యాప్తి చేసినవారవుతున్నారు. మన ఆరోగ్యం ఎలా ఉందో, దాన్నిబట్టి మన సమాజ ఆరోగ్యమూ ఉంటుంది, మన సమాజ ఆరోగ్యం ఎలా ఉందో, మన ఆరోగ్యమూ అలాగే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మనిషి తన వ్యక్తిగత ఆపేక్ష ను వదులుకోకపోవడం వలల, తన కోపమే తన శత్రువు అన్న సామెత ఇప్పుడు- తన స్వార్థమే తన శత్రువులా స్ఫురిస్తోందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు!

(రచయిత - బసు పోతన)

ఇదీ చూడండి: విద్యా విధానంలో చేసిన నూతన సవరణలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.