ETV Bharat / opinion

కొత్త చట్టంతో హాంకాంగ్‌పై చైనా పెత్తనం

హాంకాంగ్​ నిరసనలను అణచి వేసేందుకు.. చైనా వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని ముందుకు తెచ్చింది. స్వయంప్రతిపత్తిగల భూభాగంలో పౌరహక్కులు, రాజకీయ స్వేచ్ఛ అణచివేతకు గురవుతాయనే భయందోళనలు పెరిగాయి. చైనా తీసుకొచ్చిన తాజా చట్టాన్ని ప్రపంచదేశాలు ఖండించగా.. అదంతా తమ అంతర్గత వ్యవహారమని ఆ దేశం తోసిపుచ్చింది.

China dominates the Hongkong
హాంకాంగ్‌పై చైనా పెత్తనం
author img

By

Published : Jul 9, 2020, 7:10 AM IST

సంపూర్ణ ప్రజాస్వామ్యం కావాలంటూ హాంకాంగ్‌ వీధులలో కొద్ది నెలలుగా సాగుతున్న ఆందోళనలను అణచి వేసేందుకు... చైనా వివాదాస్పద జాతీయ భద్రత చట్టాన్ని ముందుకుతెచ్చింది. కొత్త భద్రతా చట్టాన్ని అమలు చేసే క్రమంలో పాక్షిక స్వయంప్రతిపత్తిగల భూభాగంలో పౌరహక్కులు, రాజకీయ స్వేచ్ఛ అణచివేతకు గురవుతాయనే భయాందోళనలు పెరిగాయి. బీజింగ్‌ ప్రభుత్వానికి ఇప్పటికే తైవాన్‌ నుంచి దక్షిణ, తూర్పు చైనా సముద్రం, భారత్‌లో వాస్తవాధీన రేఖ వరకు అతిక్రమణలకు, విస్తరణకు పాల్పడుతున్న నేపథ్యం ఉండటం వల్ల ఇలాంటి భయాందోళనలు రేకెత్తడం సహజమే. గత ఏడాది కాలంలోనే తొమ్మిది వేలకుపైగా ఉద్యమకారులు, నేతలను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

పునఃపరిశీలన దిశగా..

చైనా తీసుకొచ్చిన తాజా చట్టంపై అంతర్జాతీయంగా ఖండనలు వ్యక్తమయ్యాయి. అదంతా తమ అంతర్గత వ్యవహారమంటూ డ్రాగన్‌ తోసిపుచ్చింది. దీనికి తోడు బీజింగ్‌లో నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌కు చెందిన స్థాయీసంఘం ఏకగ్రీవంగా ఆమోదించిన యాంటీసెడిషన్‌ చట్టాన్ని హాంకాంగ్‌ ప్రాథమిక చట్టానికి జతచేర్చారు. ఈ పరిణామం సరికొత్త ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ట్రంప్‌ ప్రభుత్వం తమ సంబంధాలను పునఃపరిశీలన జరపాలని భావిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఐక్యరాజ్యసమితిలో నమోదైన చైనా-బ్రిటిష్‌ ఉమ్మడి డిక్లరేషన్‌కు స్వయంగా అంగీకారం తెలిపిన డ్రాగన్‌ దేశం వాటినిప్పుడు ఉల్లంఘిస్తోందని అమెరికా అంటోంది. హాంకాంగ్‌ వాసులు, అంతర్జాతీయ సమాజం విశ్వాసాన్ని తిరిగి చూరగొనాలని చైనా కోరుకుంటే... హాంకాంగ్‌ ప్రజలకు, 1984 చైనా బ్రిటిష్‌ ఉమ్మడి డిక్లరేషన్‌లో బ్రిటన్‌వాసులకు ఇచ్చిన హామీలను గౌరవించాల్సి ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఇటీవల స్పష్టం చేశారు. చైనా తన చట్టం అమలులో భాగంగా అణచివేతకు పాల్పడితే, ఉద్యమకారులకు ప్రజాస్వామ్య ఆందోళనకారులకు శరణార్థులుగా అవకాశం కల్పిస్తామని, లేదా నివాస సౌకర్యం ఉంటుందని గతంలో బ్రిటన్‌, తైవాన్‌ ప్రకటించాయి.

చైనా విమర్శలు..

హాంకాంగ్‌పై చైనా పెత్తనం ఖైదీల మార్పిడి బిల్లును తొలుత గత ఏడాది జూన్‌ నెలలో ప్రవేశపెట్టినప్పుడు నిరసనలు చెలరేగాయి. దాదాపు పది లక్షల మంది వీధుల్లోకి వచ్చి పరారీలో ఉన్న వారిని చైనాకు తరలించే అవకాశాన్ని కోరుతూ రూపొందించిన ప్రతిపాదిత చట్టాన్ని వ్యతిరేకించారు. ఒక దేశం రెండు వ్యవస్థల విధానంలో నడుస్తున్న హాంకాంగ్‌ న్యాయస్వాతంత్య్రానికి ఇది ప్రత్యక్ష విఘాతంగా భావించారు. సెప్టెంబర్‌లో బిల్లును ఉపసంహరించుకున్నా సామాజిక అశాంతి మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రత్యేకించి నాయకులంటూ లేకుండా తలెత్తిన ఈ ఉద్యమం ప్రజాస్వామ్య అనుకూల నేతలకు ఒక ఆయుధంలా మారింది. 2019 జూన్‌లో చెలరేగిన ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనలు, ఈ ఏడాది మే నెలలో ప్రవేశపెట్టిన జాతీయ భద్రతా చట్టం ముసాయిదాతో మరింతగా ఎగసిపడ్డాయి. వీటిపై చైనా తీవ్ర విమర్శలు గుప్పించింది. వేర్పాటువాద ఉద్దేశాలు కలిగిన కొన్ని శక్తులకు తోడుగా, హింసాత్మక ఆందోళనలను రెచ్చగొట్టేలా విదేశీ శక్తులు సైతం ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపణలు గుప్పించింది.

ఆందోళనలు రేకెత్తినా..

తమ హక్కులను చైనా కాలరాస్తోందంటూ హాంకాంగ్‌ ప్రజలు మునుపెన్నడూ లేని రీతిలో ఆందోళనలు చేపట్టారు. జాతీయ భద్రత చట్టాన్ని ససేమిరా అంగీకరించేది లేదన్నారు. ప్రజలంతా తామే సొంతంగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ను ఎన్నుకునేలా సంపూర్ణ ప్రజాస్వామిక హక్కులు కల్పించాల్సిందేనని కోరారు. పౌరుల శాంతియుత ప్రదర్శనలను అణచివేసేందుకు పోలీసులు చేపట్టిన హింసాత్మక చర్యలపై స్వతంత్ర దర్యాప్తు నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆందోళనకారులు డిమాండు చేశారు. కొత్త భద్రతా చట్టానికి సంబంధించిన వివరాల కోసం అంతా వేచిచూస్తున్నారు. హాంకాంగ్‌ పాఠశాలల్లో విద్య, జాతీయ భద్రతలపై పర్యవేక్షణ వంటి అధికారాలు చైనాకే దక్కనున్నట్లు వార్తాకథనాలు వినిపిస్తున్నాయి. చట్టం అమలును హాంకాంగ్‌ ప్రభుత్వమే చేపట్టినా జిన్‌పింగ్‌ ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో హాంకాంగ్‌ అధికారులను తోసిపుచ్చడమూ జరుగుతోంది.

అమెరికా హెచ్చరించినా..

అంతర్జాతీయ నగరంగా ప్రసిద్ధి పొందిన హాంకాంగ్‌కు భారత్‌, అమెరికా సహా పలు దేశాలతో పెట్టుబడుల పరంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హాంకాంగ్‌ విధానం చట్టం కింద అమెరికా 1992లో ప్రత్యేక హోదాను మంజూరు చేసింది. ఒక దేశం, రెండు వ్యవస్థల విధానాల కింద హాంకాంగ్‌కు దఖలు పడిన హక్కులన్నీ కొనసాగినంత కాలమే ఈ ప్రత్యేక హోదా దక్కుతుందని ఆ చట్టం స్పష్టం చేస్తోంది. కొత్త చట్టాన్ని చైనా తోసిరాజనడంతో ట్రంప్‌ ప్రభుత్వం గట్టిగా స్పందించింది. రక్షణ ఉపకరణాల ఎగుమతుల్ని ఆపేసింది. ద్వంద్వ వినియోగ సాంకేతిక పరిజ్ఞానాన్ని నిలిపి వేస్తామని హెచ్చరించింది. అమెరికా పౌరులకు వీసాలు ఇవ్వబోమంటూ చైనా చేసిన బెదిరింపు ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలకు మరింతగా ఆజ్యం పోసింది. ఈ వివాదాలన్నింటి మధ్య- తమ చర్యలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నవే తప్పించి, చైనా ప్రజలను కాదని అమెరికా చెబుతుండటం కొసమెరుపు!

- స్మితా శర్మ, రచయిత్రి - ప్రముఖ పాత్రికేయురాలు

ఇదీ చదవండి: జపాన్​లో వరదల బీభత్సం.. 58 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.