ETV Bharat / opinion

చిల్లర వర్తకానికి చేయూత! - rai

కరోనా కారణంగా చిల్లర వర్తక రంగం కోలుకోలేని విధంగా నష్టపోయిందన్నది కాదనలేని సత్యం. ఈ రంగంపై ఆధారపడి ఏదోవిధంగా బతుకీడుస్తున్న కోట్ల మంది ప్రభావితమయ్యారు. అనేక రంగాలకు సహకారమందించిన మాదిరే ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తే దేశ ఆర్థికవ్యవస్థకు జవసత్వాలు తీసుకొచ్చే సత్తా ఈ రంగం సొంతం అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. దేశ ప్రగతి రథంతో పాటు సామాన్యుడి జీవన చక్రం సాఫీగా సాగేందుకు వచ్చే బడ్జెట్లో ఈ రంగానికి కేటాయింపులు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

center-should-help-retail-industry
చిల్లర వర్తకానికి చేయూత!
author img

By

Published : Jan 18, 2021, 10:01 AM IST

కొవిడ్‌ కారణంగా- మహాభారతంలో కర్ణుడి రథ చక్రంలా కుంగిన పలు కీలక రంగాల్లో చిల్లర వర్తకం ఒకటి. అభివృద్ధికి ఆకాశమే హద్దు అని పలు అధ్యయనాలు నిరుడు చాటిన నేపథ్యంలో, ఉరుములేని పిడుగులా మహమ్మారి విరుచుకుపడి, కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌లు జతపడి దేశవ్యాప్తంగా చిల్లర వర్తక రంగం అక్షరాలా చితికిపోయింది. లాక్‌డౌన్‌ మొదలైన తొలి వంద రోజుల్లోనే ఏకంగా 15.5 లక్షల కోట్ల రూపాయల నష్టం సంభవించిందని 40 వేల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల భారత వర్తకుల సమాఖ్య నిరుడు జులై నెలలో వాపోయింది. లాక్‌డౌన్‌కు మినహాయింపులతో క్రమేణా దుకాణాలు తెరచుకొన్నా మునుపటి స్థాయిలో వ్యాపారాలు సాగక పలు విధాల రుగ్మతలతో అవి కిందుమీదులవుతూనే ఉన్నాయి.

రాయ్‌.. ప్రతిపాదనలు..

ఎకాయెకి అయిదు కోట్ల మందికి జీవనాధారమైన చిల్లర వర్తక రంగం ప్రస్తుతం పడుతూ లేస్తున్న అవస్థల్ని అధిగమించి ధీమాగా పురోగమించాలంటే- కేంద్ర ప్రభుత్వపరంగా వచ్చే బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనల దన్ను తప్పనిసరిగా దక్కాలని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (రాయ్‌) గట్టిగా కోరుతోంది. వినియోగమే దేశార్థికానికి చోదకశక్తి అని, చిల్లర వర్తక రంగమే దానికి ముఖద్వారమన్న సూత్రీకరణ నూరుపాళ్లు నిజం. విధానపరమైన ప్రతిబంధకాల సంకెళ్లను తెగతెంచి, అభివృద్ధి సాధనకు అవసరమైన నిధుల లభ్యతను పెంచితేనే- చిల్లర వర్తకానికి కొత్త ఊపిరి అందుతుందన్నది 'రాయ్‌' విజ్ఞాపన సారాంశం. జాతీయ చిల్లర వర్తక విధానాన్ని సత్వరం రూపొందించి అమలు చేయాలని, ఎంఎస్‌ఎంఈల పరిధిలోకి ఈ రంగాన్నీ తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, కిరాణా దుకాణాలు 'డిజిటలైజేషన్' దిశగా మళ్ళేందుకు ముద్ర యోజన కింద ఆర్థిక తోడ్పాటు అందించాలనీ 'రాయ్‌' కోరుతోంది. సమగ్ర జాతీయ విధానం పట్టాలకెక్కితే 2024కల్లా అదనంగా 30 లక్షల ఉద్యోగాలు రానున్నాయన్న అధ్యయనాల దృష్ట్యా పటిష్ఠ కార్యాచరణకు కేంద్రం సమకట్టాలి!

భారత్ వెనకబాటు..

దశాబ్దకాలంగా పెరుగుట పెరుగుట కొరకే అన్నట్లుగా పురోగమిస్తున్న దేశీయ చిల్లర వర్తక రంగం పరిమాణం 2017నాటి 79,500 కోట్ల డాలర్ల నుంచి 2026నాటికి లక్షా 75వేల కోట్ల డాలర్ల స్థాయికి ఎదగనుందని నివేదికలు ఎలుగెత్తుతున్నాయి. ప్రపంచ చిల్లర వర్తక అభివృద్ధి సూచీలో 2019లో ఇండియా రెండో స్థానంలో ఉండగా, స్థూల దేశీయోత్పత్తిలో 10శాతం ఆ రంగం చలవే. దేశవ్యాప్త ఉపాధిలో ఎనిమిది శాతానికి గొడుగుపడుతున్న చిల్లర వర్తకంలో 88శాతం అసంఘటిత రంగానిదే. మలేసియా, థాయ్‌లాండ్‌లతో పోలిస్తే జీడీపీకి సమధిక విలువ సమకూర్చడంలో ఇండియా వెనకబాటుకూ కారణమిదే! లాక్‌డౌన్‌ కాలంలో చేతిలో డబ్బులు ఆడక ఏడు లక్షల దాకా చిల్లర దుకాణాలు మూతపడటం- గిరాకీ, సరఫరా గొలుసు విచ్ఛిన్నాన్ని మించిన సమస్య మూలాల్ని పట్టించేదే! సులభతర వాణిజ్యం, నిబంధనల సరళీకరణ, చిల్లర వర్తకంలోని శ్రామిక శక్తిని వృత్తి నైపుణ్యాలతో తీర్చిదిద్దడం, అంతర్జాల అవకాశాల్ని అందిపుచ్చుకొనేలా చూడటం వంటి లక్ష్యాలతో జాతీయ విధానానికి మెరుగులద్దుతున్నామని కేంద్రం చెబుతోంది.

సరళతరమే మంత్రం..

చిల్లర దుకాణం ఏర్పాటుకు 16-25 దాకా లైసెన్సులు పొందాల్సి రావడం, వాటిలోనూ రాష్ట్రాలవారీ వ్యత్యాసాలు చీకాకు పెడుతున్నాయన్న వర్తక సంఘాలు- 'సింగిల్‌ విండో' అనుమతులకు, వాటినీ అంతర్జాలంలో పొందేందుకు వీలు కల్పించాలంటున్నాయి. వ్యాపార నిర్వహణ పెట్టుబడి అవసరాలు తీర్చే ప్రత్యేక చొరవ కనబరచాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకూ దోహదపడాలని కోరుతున్నాయి. గిడ్డంగులు, శీతల నిల్వ సదుపాయాలు, రవాణా సేవల్లో వెనకబాటుతనం- ఉత్పత్తుల ధరవరల్లో ఎనిమిది శాతం దాకా పెరుగుదలకు కారణమవుతోంది. ఇలాంటి మౌలిక సమస్యల్నీ పరిష్కరించేలా జాతీయ విధానం సమగ్రమైతేనే చిల్లర వర్తక రంగం మరింత జేగీయమానమవుతుంది!

ఇదీ చదవండి: ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్రపై మ్యూజియం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.