ETV Bharat / opinion

గంజాయిపై నిషేధంతో భారత్​కు వేల కోట్లు నష్టం! - Indian textile sector

గంజాయి... ఈ పేరు వినగానే ఎప్పుడూ అక్రమ వ్యాపారం, రవాణా గురించే వార్తలు వింటుంటాం. కానీ ఇదే జాతి మొక్క గంజాయి జనపనారకు భారత వస్త్ర వ్యాణిజ్యాన్ని అగ్రగామిగా నిలబెట్టగలిగే సత్తా ఉందని ఎవరైనా చెప్పారా? ఆ మొక్కల్లోని సద్గుణాలు ఆహారం, వైద్య రంగంలో ఓ పెద్ద మార్పులనే తేగలవని ఎక్కడైనా విన్నారా? మిగతా దేశాల్లో కాసుల వర్షం కురిపిస్తున్న ఈ పంట.. భారత్​లోనే ఎందుకు నిషిద్ధం?

Can India ride the Cannabis dollar wave?
గంజాయిపై నిషేధంతో వేల కోట్లు నష్టపోతున్న భారత్​...?
author img

By

Published : Aug 23, 2020, 5:55 PM IST

అక్రమ రవాణా వ్యాపారంలో తరచుగా వినే పేరు గంజాయి. గ్రాముల్లో గంజాయి వేల కొద్దీ రేటు పలుకుతుందని వింటుంటాం. మరి అంత లాభాలు తెచ్చే పంటను భారత ప్రభుత్వం ఎందుకు అధికారికం చేయట్లేదు? మన పూర్వీకుల నుంచి 1985 వరకు వాటి అమ్మకాలు, రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. మరి ఈ పాతిక సంవత్సరాల కాలంలో ఇది ఎందుకు నిషేధిత మొక్కగా మారింది?

గంజాయి ప్రతి భాగాన్ని ఎన్నో పరిశ్రమల్లో ఉపయోగించుకోవచ్చు. 'కింగ్ కాటన్' అంటూ ఇటీవల కాలంలో పేరు తెచ్చుకున్న వస్త్రాలు.. ఇదే జాతిలోని జనపనార(గంజాయి సాటివా ఎల్) నుంచి తయారైనవే. తక్కువ నీటితోనూ పండటం దీని ప్రత్యేకత. అంతేకాదు వీటితో చౌకగా, నాణ్యమైన దుస్తులను తయారు చేయవచ్చు. 1985 వరకు గంజాయి అధికారికంగా, చట్టబద్ధంగా భారత్​లో అమ్మేవారు. ఇందుకోసం ప్రత్యేకమైన షాప్​లు, భాంగ్​లు ఉండేవి. ఫైబర్​, మెడిసిన్​ రంగంలో కీలకంగా ఉపయోగపడే ఈ మొక్కల వనరులను మాత్రం భారత్ నిర్లక్ష్యం చేసుకుంటోంది.

అగ్రరాజ్యానికి దండిగా ఆదాయం..

అమెరికా ఒత్తిడి వల్ల ఔషధ, ఆహార, వైద్య రంగంలో ఎన్నో ఉపయోగాలున్న ఈ మొక్కలను భారత్​ నిషేధించింది. ఈ నిర్ణయంతో గంజాయి మొక్కల పరిరక్షణపై గట్టి దెబ్బ పడింది. అదే అగ్రరాజ్యం ఇప్పుడు గంజాయి సాగుతో వేల కోట్లు సంపాదిస్తోంది. వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతేకాదు ఈ సాగును అధికారికం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గంజాయి, జనపనార ప్లాంట్​ జెనెటిక్​ రిసోర్స్​(పీజీఆర్)​ఫై పేటెంట్​ పొందేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.

మారిజువానా(గంజాయి) మార్కెట్​ ద్వారా 2020 చివరి నాటికి 15 బిలియన్ల డాలర్ల ఆదాయం అగ్రరాజ్యం ఖాతాలో చేరుతుందని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అయితే భారత్​లోని విత్తన రంగం మాత్రం ఇలాంటి బంగారు అవకాశాన్ని వృథా చేసుకుంటోంది. స్థానిక గంజాయి, జనపనార మొక్కల వనరులను నిర్లక్ష్యం చేస్తూ ఖజానాకు చిల్లులు పెట్టుకుంటోంది.

భారత్​ రకం చాలా నాణ్యం...

గంజాయిలోని ఇండికా రకం పండేందుకు భారత్​ అనువైన స్థలం. ఎన్నో శతాబ్దాలుగా ఇది మన ప్రకృతిలో మమేకమై ఉంది. ఇది ఉపఖండంలోని మన సామాజిక, ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేస్తోంది. వీటిని ఉత్తేజం కోసం వాడతారనే అందరికీ తెలుసు. కానీ కొన్ని నొప్పులు, వ్యాధులకు మందుల తయారీకి ఉపయోగించుకోవచ్చు. వస్త్ర రంగం నుంచి నిర్మాణ రంగం వరకు దీన్ని వాడుకోవచ్చు.

గంజాయి భారత్​లోని అనేక ప్రాంతాల్లో సహజంగానే పెరుగుతుంది. అయితే మాదకద్రవ్యాల వ్యాపారంలో దీన్ని చట్టవిరుద్ధంగా కొందరు పెంచుతున్నారు. అక్రమ వాణిజ్యం వల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది. హిమాచల్ ప్రదేశ్ వంటి పర్యావరణ సున్నితమైన ప్రాంతంలో విదేశీ విత్తనాలతో జన్యుమార్పిడి (జీఎం) వల్ల నాణ్యమైన మన స్వదేశీ రకం కలుషితం అవుతోంది. అందుకే కొన్ని రాష్ట్రాలు జనపనారను వాణిజ్య సాగుగా పరిగణిస్తున్నాయి. అయితే జనపనార ఆధారిత ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వాలు పెద్దగా కృషి చేయకపోవడం గమనార్హం.

ఇదీ చేయాల్సింది..

రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్&డీ) ప్రయోజనాల కోసం ప్రభుత్వం జనపనార, గంజాయి విత్తనాలను నియంత్రించాల్సిన, కాపాడాల్సిన అవసరం ఉంది. భారతీయ విత్తన కంపెనీలు, రైతులు కలిసి స్థానిక రకాలపై అధ్యయనం చేయడానికి మినహాయింపులు ఇవ్వాలి. పరిశోధనా కేంద్రాలను నిర్మించడానికి అనుమతించాలి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, ఈశాన్య ప్రాంతాలు ఈ పంటలకు కేంద్రాలుగా మారతాయి. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంచడమే కాకుండా అక్రమ వాణిజ్యాన్ని అరికడుతుంది.

ఈ మొక్కల ఉపయోగాల దృష్ట్యా.. స్థానిక పీజీఆర్ సమగ్ర సర్వేను ఐసీఏఆర్, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నిర్వహించాలి. ఎన్​బీపీజీఆర్ జీవవైవిధ్య వనరులను పరిరక్షించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పరిశోధనలకు ప్రైవేట్ రంగం, బ్యాంకులు ముందుకు రావాలి. అంతర్జాతీయ అవసరాలను తీర్చేందుకు భారతీయ విత్తనాలు, పీజీఆర్​ కీలకంగా మారనున్నాయి. ప్రగతిపథంలో విత్తన ఎగుమతి విధానాన్ని పెంచేందుకు విదేశీ జనపనార, గంజాయి కంపెనీలను.. భారతదేశంలో తయారీ, పరిశోధనల్లో భాగమయ్యేలా ప్రోత్సహించవచ్చు. భారతీయుల భాగస్వామ్యంతో సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనుమతించాలి.

ఎగుమతిలో కింగ్​ అవ్వొచ్చు..

ఇజ్రాయెల్, జర్మనీ ఇప్పటికే గంజాయి పువ్వులను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. నిషేధం తొలగించి సడలింపులు ఇస్తే భారత్​ అగ్ర ఎగుమతిదారుగా మారవచ్చు. ఇది రైతులు, పరిశ్రమలకు ఆదాయాన్ని పెంచుతుంది. గంజాయి, జనపనార ఎగుమతికి కస్టమ్​ నుంచి అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో సంస్థలను పెట్టడమే కాకుండా వాటికి అనుబంధ, ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును సులభతరం చేయాలి. నల్లమందు మాదిరిగానే గంజాయి సాగు, ప్రాసెసింగ్‌ను అనుమతించడం, ఎక్సైజ్ చట్టంలో మార్పులకు అనుమతించాలి. అయితే వీటి సాగు, పరిశోధనలను పూర్తిగా నియంత్రించాలి. రాష్ట్ర ప్రభుత్వాలకే చట్టబద్ధమైన అధికారం అప్పగించాలి.

పత్తితో పాట్లు...

పత్తి అనేది చాలా ఖర్చుతో సాగుచేసే పంట. దీనికి టన్నుల కొద్దీ ఎరువులు, పురుగుల మందులు సహా నీరు అవసరం. ఇలాంటి సమయంలో జనపనారతో వస్తాలను తయారు చేస్తే ఖర్చు తక్కువ. భారత టెక్స్​టైల్​ రంగం సరికొత్తగా మారడమే కాకుండా జనపనార వస్త్రాల తయారీకి హబ్​గా మారుతుంది. భారత వాతావరణం, నేల జనపనార పెరగడానికి బాగా సరిపోతాయి. దీని ద్వారా రైతులు బాగా ప్రయోజనం పొందవచ్చు. ఇది భారతదేశం అంతటా వికేంద్రీకృతంగా వస్త్ర కేంద్రాలను ఏర్పాటు చేయడానికి దోహదపడుతుంది. పత్తికి జనపనార స్థిరమైన, పర్యావరణహిత ప్రత్యామ్నాయం. నేలలో సారం తగ్గిపోవడం, నీటి కొరత వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకోనవసరం లేదు. జనపనారతో వస్త్రాల తయారీని పెంచడంపై జౌళి​ మంత్రిత్వ శాఖ మరింత దృష్టి సారించాలి. ప్రపంచంలో భారత్​ జనపనార వస్త్రాలతో అగ్రగామిగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి.

స్థానిక జీవవైవిధ్యం ఇచ్చిన జనపనార, గంజాయి వనరులతో మనం అభివృద్ధి సాధించవచ్చు. అయితే ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ ఫలాలను పొందేందుకు ప్రభుత్వం గతంలో విధించిన.. ఆంక్షలు, సడలింపులపై దృష్టి పెట్టాల్సి ఉంది.

-- ఇంద్ర శేఖర్​ సింగ్​ (నేషనల్​ సీడ్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియాలో పాలసీ అండ్​ ఔట్​రీచ్ డైరెక్టర్)​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.