ETV Bharat / opinion

పొంచి ఉన్న జీవాయుధ ముప్పు!

author img

By

Published : Jun 20, 2021, 9:08 AM IST

మూడో ప్రపంచ యుద్ధమే వస్తే జీవాయుధాలు మనుషుల ప్రాణాలు తీయడమే కాదు, మానవ నాగరికతనూ తుడిచి పెడతాయన్న భయాలు ముప్పిరిగొంటున్నాయి. ప్రమాదకరమైన వైరస్‌లు కొద్ది మోతాదుల్లో ధూర్త దేశాలకుకాని, ఉగ్రవాదుల చేతికికాని చిక్కితే చాలు- వారు సృష్టించగల విధ్వంసం అంతాఇంతా కాదు. శత్రుదేశాలు, ఉగ్రవాదులు జీవాయుధాలతో దాడికి పాల్పడితే భారత్‌ సమర్థంగా స్పందించగలదా అన్నది కీలక ప్రశ్న. ఈ రంగంలో లోటుపాట్లను తక్షణం సరిదిద్దుకొని, ఎటువంటి అవాంతరాలనైనా ఎదుర్కోవడానికి సదా సన్నద్ధంగా ఉండాలని కొవిడ్‌ మహమ్మారి హెచ్చరిస్తోంది.

bio weapon,  bio war, virus weapons
జీవాయుధం, బయో వెపన్​, బయో వార్​

మొదటి ప్రపంచ యుద్ధంలో మస్టర్డ్‌ గ్యాస్‌, ఫ్లాస్జీన్‌ వంటి రసాయన ఆయుధాల వల్ల 90 వేల మంది సైనికులు మరణించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అణు బాంబులు దాదాపు రెండు లక్షల మందికిపైగా పౌరుల ప్రాణాలు తీశాయి. మూడో ప్రపంచ యుద్ధమే వస్తే జీవాయుధాలు మనుషుల ప్రాణాలు తీయడమే కాదు, మానవ నాగరికతనూ తుడిచి పెడతాయన్న భయాలు ముప్పిరిగొంటున్నాయి. కరోనా మహమ్మారి దెబ్బకు దేశదేశాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర సంక్షోభంలోకి జారిపోవడం- ఈ భయాలు నిరాధారం కావని హెచ్చరిస్తోంది. ప్రమాదకరమైన వైరస్‌లు కొద్ది మోతాదుల్లో ధూర్త దేశాలకుకాని, ఉగ్రవాదుల చేతికికాని చిక్కితే చాలు- వారు సృష్టించగల విధ్వంసం అంతాఇంతా కాదు.

ఒప్పందాన్నీ ఖాతరు చేయని వైనం

మునుపటి యుద్ధాల్లో ప్రత్యర్థులు తమపై జీవాయుధాలు ప్రయోగించారని గుర్తుచేస్తూ- చైనీయులు వైరస్‌, బ్యాక్టీరియాపై పరిశోధనలు జరుపుతున్నారు. కొరియా యుద్ధంలో అమెరికా తమపై జీవాయుధాలను ప్రయోగించిందని చైనా ప్రజావిమోచన సైన్యం (పీఎల్‌ఏ) నమ్ముతున్నా, దానికి బలమైన ఆధారాలు లేవు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనీయులపై జపాన్‌ జీవాయుధ దాడులు చేసిన మాట వాస్తవమని, అప్పట్లో ప్లేగును వ్యాపింపజేసే కీటకాలను చైనీయులపై ప్రయోగించారనే ఆరోపణలున్నాయి. ఆత్మరక్షణ పేరుతో చైనా చేస్తున్న గుప్త ప్రయోగాలు వికటించి వుహాన్‌ ల్యాబ్‌ నుంచి కరోనా మహమ్మారి లీకైందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ విషయంలో నిజానిజాలను 90 రోజుల్లో నిగ్గు తేల్చాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తమ గూఢచారి సంస్థలను ఆదేశించారు. జీ-7 దేశాల శిఖరాగ్ర సభ సైతం చైనాలో కరోనా వైరస్‌ ఎలా పుట్టుకొచ్చిందో క్షుణ్నంగా శోధించాలని బీజింగ్‌ను, ప్రపంచ ఆరోగ్య సంస్థను డిమాండ్‌ చేసింది. జీవాయుధాలు ఘోర కలిని సృష్టిస్తాయని గ్రహించి ప్రపంచ దేశాలు జీవాయుధ నిరోధ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 1975 నుంచి అమలులోకి వచ్చిన ఈ ఒప్పందం జీవాయుధ పరిశోధనలు, ఉత్పత్తి, బదిలీ, నిల్వలను నిషేధిస్తోంది. 1984లో ఈ ఒప్పందంపై సంతకం చేసిన చైనా తాను జీవాయుధాలను ఉత్పత్తి చేయడమే లేదని చెప్పుకొంటున్నా, దాన్ని సవాలు చేసేవారికి కొదవ లేదు. షింజియాంగ్‌ రాష్ట్రంలో చైనా అణ్వస్త్ర ప్రయోగ స్థలమైన లాప్‌నోర్‌కు సమీపంలోని ఒక ప్రయోగశాల నుంచి లీకైన వైరస్‌ వల్ల రక్తస్రావజనక జ్వరాలు రెండుసార్లు విరుచుకుపడ్డాయని 1980లలో సోవియట్‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

చాలాకాలంగా పరిశోధనలు

మేడిన్‌ చైనా 2025 పథకంలోనూ, ప్రస్తుతం అమలులో ఉన్న పంచవర్ష ప్రణాళికలోనూ చైనా ప్రభుత్వం బయోటెక్నాలజీకి ప్రాధాన్యం ఇచ్చి, సూక్ష్మజీవులపై ప్రయోగాలకు ఊపుతెస్తోంది. చైనా జాతీయ జన్యు సమాచార నిధి ప్రపంచంలోనే అత్యంత బృహత్తరమైనదని అమెరికా పేర్కొంది. ఈ సమాచారంతో సునిశిత వ్యాధి చికిత్సలు కనిపెట్టవచ్చు, జీవాయుధ తయారీకి ఉపక్రమించవచ్చు. చైనాలో పౌర పరిశోధనలు సైనిక వినియోగానికి సైతం అందుబాటులో ఉంటాయని మరచిపోకూడదు. చైనా శాస్త్రజ్ఞులు ఆంథ్రాక్స్‌, టులరేమియా, బొటులినం వంటి తీవ్ర వ్యాధికారక క్రిములపై చాలాకాలంగా పరిశోధనలు జరుపుతున్నారు. అవసరమైనప్పుడు వీటిని పెద్దయెత్తున తయారు చేసే సామర్థ్యాన్నీ సాధించారు. వుహాన్‌ ల్యాబ్‌లో సార్స్‌, డెంగీ, జపనీస్‌ ఎన్‌కెఫలైలిటిస్‌ కారక వైరస్‌లపై ప్రయోగాలు జరుగుతాయి. పీల్చే గాలి ద్వారా పాకే ఘన, ద్రవరూప తుంపరల (ఏరోసాల్స్‌) ద్వారా సూక్ష్మజీవుల వ్యాప్తిపైనా చైనాలో పరిశోధనలు జరిగాయి. 2015నాటికి చైనాలో 12 రక్షణ రంగ సంస్థలు, 30 చైనా సైన్య అనుబంధ సంస్థల్లో జీవాయుధ ప్రయోగాలు, ఉత్పత్తి, నిల్వ కార్యక్రమాలు జరుగుతున్నట్లు నిఘా నివేదికలు తెలిపాయి. వుహాన్‌ ల్యాబ్‌కు చైనా సైన్యంతో అవినాభావ సంబంధం ఉంది. తమ పరిశోధనలన్నీ వ్యాధి చికిత్సకు, ఆత్మరక్షణకేనని చైనా ప్రభుత్వం చెప్పుకొంటున్నా, కరోనా మహమ్మారికి వుహాన్‌ జన్మస్థలి కావడం చైనా చిత్తశుద్ధిపై అనుమాన మేఘాలను కమ్మేలా చేస్తోంది.

యంత్రాంగంలో బలహీనతలు
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల లోటుపాట్లు బట్టబయలయ్యాయి. మన ఆరోగ్య సంరక్షణ యంత్రాంగంలోని బలహీనతలను, సన్నద్ధత లోపాన్ని కొవిడ్‌ బయటపెట్టిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవాయుధ ఉగ్ర దాడులకు మనమే అవకాశం ఇచ్చినట్లవుతుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ ఇటీవల హెచ్చరించారు. భారత్‌ ఆయన మాటలను పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోవాలి. శాశ్వత ప్రాతిపదికపై సర్వసన్నద్ధంగా ఉంటూ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు తక్షణ కార్యాచరణకు దిగే కేంద్రీకృత యంత్రాంగమేదీ భారత్‌కు లేదు. ముప్పు ముంచుకొచ్చినప్పుడు తాత్కాలిక కమిటీలు వేసి హడావుడిగా కార్యాచరణకు ఉపక్రమించడం, ప్రమాద తీవ్రత తగ్గగానే పనులను వాయిదా వేయడం అధికార వ్యవస్థలకు అలవాయింది. ఏదైనా కొత్త తరహా వైరస్‌ లేదా బ్యాక్టీరియా వచ్చిపడిన వెంటనే వాటిని పసిగట్టే నిఘా వ్యవస్థ ఇక్కడ కొరవడింది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. నిధులు లేక ఆరోగ్య రంగంలో నవీన పరిశోధనలు, అభివృద్ధి పడకేశాయి. శత్రుదేశాలు, ఉగ్రవాదులు జీవాయుధాలతో దాడికి పాల్పడితే భారత్‌ సమర్థంగా స్పందించగలదా అన్నది కీలక ప్రశ్న. ఈ రంగంలో లోటుపాట్లను తక్షణం సరిదిద్దుకొని, ఎటువంటి అవాంతరాలనైనా ఎదుర్కోవడానికి సదా సన్నద్ధంగా ఉండాలని కొవిడ్‌ మహమ్మారి హెచ్చరిస్తోంది.

జోరుగా ప్రయోగాలు

నేడు జీవాయుధాలపై పరిశోధన చేస్తున్న 17 దేశాల్లో అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, ఇజ్రాయెల్‌ వంటి ప్రధాన దేశాలతోపాటు- ఎవరినీ ఖాతరు చేయని ఉత్తర కొరియా, ఇరాన్‌, నిత్య సంక్షుభిత ఇరాక్‌, లిబియా, సిరియా కూడా ఉన్నాయి. పాకిస్థాన్‌ సైన్యంతో కలిసి పాక్‌ భూభాగంలో చైనా 2015 నుంచి జీవాయుధాలపై పరిశోధన నిర్వహిస్తున్నట్లు పాశ్చాత్య గూఢచార సంస్థలు కనిపెట్టాయి. దాదాపు అయిదు రకాల వ్యాధికారక సూక్ష్మజీవులతో ప్రయోగాలు జరుపుతున్నారని, కరోనా వైరస్‌ జన్మస్థలిగా అనుమానిస్తున్న వుహాన్‌ వైరాలజీ పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రజ్ఞులు సైతం ఈ పరిశోధనల్లో పాలుపంచుకొంటున్నారని వెల్లడించాయి. నాలుగైదు వేల ఒంటెలు, ఇతర జంతువులు, ఏడెనిమిది వేలమంది మానవుల నుంచి సేకరించిన సీరమ్‌లతో ప్రయోగాలు జరుపుతున్నారు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకంలో అంతర్భాగమైన చైనా-పాక్‌ ఆర్థిక నడవా (సిపెక్‌) ప్రాజెక్టు ఛత్రం కింద జరుగుతున్న ఈ ప్రయోగాల్లో పాక్‌ ప్రజలను బలిపశువులుగా ఉపయోగిస్తున్నారు. ఈ తరహా పరిశోధనల నిర్వహణకు కావలసిన బయోసేఫ్టీ లెవెల్‌-4 ప్రయోగశాలలు పాకిస్థాన్‌కు లేకపోయినా, ఆ దేశ భూభాగంలో ఇంతటి ప్రమాదకర పరిశోధనలు జరగడం ఆందోళనకరం. వైరస్‌, బ్యాక్టీరియాతో కలిగే వ్యాధులను నివారించడానికి తాము ప్రయోగాలు జరుపుతున్నామని చైనా చెప్పుకొంటున్నా, సూక్ష్మజీవులను జీవాయుధాలుగా మార్చడానికి సైతం ఈ పరిశోధనలు తోడ్పడతాయి.

-కైజర్‌ అడపా

ఇదీ చూడండి: Wuhan lab: ల్యాబ్‌లో గబ్బిలాల పెంపకం..!

ఇదీ చూడండి: 'కరోనా మూలాలపై పారదర్శక దర్యాప్తు జరగాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.