ETV Bharat / opinion

ఎన్నికల అస్త్రంగా 'రామ మందిరం'- బీజేపీ 15రోజుల ప్లాన్ రెడీ- RSSతో కలిసి కార్యక్రమాలు! - బీజేపీ అయోధ్య రాజకీయం

Ayodhya Ram Mandir BJP Campaign : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ అంశాన్ని సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మలచుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. రామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని 15 రోజుల పాటు వేడుకగా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ప్రతి ఇంటా రామ జ్యోతులు వెలిగించడం, దేశవ్యాప్తంగా ఆలయాలను శుభ్రపర్చడం, భక్తులు అయోధ్య వెళ్లేందుకు సహకరించడం వంటి కార్యక్రమాలను చేపట్టనుంది.

ayodhya-ram-mandir-bjp-campaign
ayodhya-ram-mandir-bjp-campaign
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 2:00 PM IST

Ayodhya Ram Mandir BJP Campaign : 2019 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 303 సీట్లు, 37.36 శాతం ఓట్లను ఈసారి ఎలాగైనా అధిగమించాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లాలని భావిస్తోంది. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈ నెల 22న జరగనుండగా దీన్ని 15 రోజుల పాటు ఓ వేడుకగా చేసుకోవాలని బీజేపీ ప్రణాళిక రచించింది. ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు ఇందుకోసం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా దేవాలయాలను శుభ్రం చేయడం ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది. జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవం నాడు ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగించేలా బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయనున్నారు. దీపావళి తరహాలో 22వ తేదీ సాయంత్రం ప్రతి ఇంట్లో రామ జ్యోతులను వెలిగించాలని బీజేపీ కోరుతోంది. ఇదే విషయమై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

  • #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi says, "This historical moment has very fortunately come into the lives of all of us. We have to take a new resolution for the country and fill ourselves with new energy. For this, all the 140 crore countrymen should light Ram… pic.twitter.com/Dc52swEI8R

    — ANI (@ANI) December 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జనవరి 25 నుంచి మార్చి 25 వరకు దేశవ్యాప్తంగా భక్తులు రామమందిరాన్ని సందర్శించేలా కార్యకర్తలు సహాయం చేయాలని, అందుకు తగ్గ కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ అగ్రనాయకత్వం కోరింది. ఆలయ ప్రారంభోత్సవం తర్వాత రోజూ 50 వేల మంది భక్తులు రామున్ని దర్శించుకుంటారని బీజేపీ అంచనా వేస్తోంది. ప్రయాణ, వసతి సౌకర్యాలు, ఇతర అంశాల్లో బీజేపీ కార్యకర్తలు భక్తులకు సాయం చేయనున్నారు. ఇందుకోసం RSS కార్యకర్తలతో బీజేపీ శ్రేణులు భుజం భుజం కలిసి నడుస్తాయని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీ జెండాలను కార్యకర్తలు ఉపయోగించరాదని బీజేపీ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది.

'మూడోసారి ప్రధానిగా మోదీ ఖాయం! రామమందిర అంశమే ప్రధాన ఎన్నికల టాపిక్'

మోదీ కేంద్రంగా ప్రచారం!
హిందుత్వ, అభివృద్ధి, ప్రపంచంలో పెరుగుతున్న భారత్‌ ఖ్యాతికి మోదీని చిహ్నంగా చూపేలా బీజేపీ ఎన్నికల ప్రచార కార్యక్రమం సాగనుంది. మంగళవారం సాయంత్రం బీజేపీ సీనియర్‌ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం అయ్యారు. ఇతర పార్టీల నుంచి నేతలు, ప్రభావితం చేసే వ్యక్తులను సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేర్చుకోవడంపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సీనియర్‌ నేతలతో కమిటీని వేయాలని బీజేపీ నిర్ణయించింది.

  • Pictures taken this morning at Shri Ram Janmabhoomi Mandir site.

    श्री राम जन्मभूमि मंदिर परिसर में आज प्रातः काल लिए गए चित्र pic.twitter.com/MOaDIiS91Y

    — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఆత్మనిర్భరతతో అయోధ్య రామమందిరం- ఆలయానికి సొంత వ్యవస్థలు- పచ్చదనానికి పెద్దపీట'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.