ETV Bharat / opinion

పాక్​ దారిలో చైనా- భారత్​తో ఇక పరోక్ష యుద్ధం! - ఈశాన్య భారత్

భారత్​తో ప్రత్యక్షంగా తలపడలేమని తెలిసే... పాకిస్థాన్ ఉగ్రవాదులను తయారు చేస్తోంది. వీరిని ఉపయోగించుకొని భారత్​లో సంఘర్షణ వాతావరణం సృష్టిస్తోంది. ఇప్పుడు చైనా సైతం ఇదే దారిలో వెళ్తోందా? భారత్​తో ఉద్రిక్తతలు రాజేసి భంగపడిన డ్రాగన్ దేశం.. తిరుగుబాటుదారులను ఆశ్రయిస్తోందా? ఎప్పటినుంచో భారత్​లోని తిరుగుబాటు సంస్థలకు పరోక్షంగా సాయం చేస్తున్న చైనా ఇప్పుడు మరింత బరితెగిస్తోందా?

Amid India-China hostility, low intensity conflict possibility in NE
భారత్​తో చైనా యుద్ధం- ఇక నుంచి పరోక్షంగానే!
author img

By

Published : Jul 10, 2020, 4:51 PM IST

హింసాత్మక తిరుగుబాటు ఉద్యమాలతో ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు దశాబ్దాలుగా అట్టుడికిపోతున్నాయి. ప్రస్తుతం చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ తిరుగుబాటు ఉద్యమాలు మరింత విజృంభించే అవకాశం ఉంది.

ఇప్పటికే దేశ ఉత్తర సరిహద్దులో ఓవైపు పాకిస్థాన్, మరోవైపు చైనాను ఎదుర్కొంటోంది భారత్. భద్రతా పరంగా ఈ రెండు ప్రాంతాలపైనే సైన్యం దృష్టిసారించింది. అయితే భారతదేశ ఈశాన్య సరిహద్దులోనూ చైనా జోక్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈశాన్యంలో ఉన్న అనేక తిరుగుబాటు సంస్థలను ఉపయోగించుకొని ఉద్రిక్తతలకు ఆజ్యం పోసే ప్రమాదం ఉంది.

ఇరుదేశాలు పూర్తి స్థాయి యుద్ధం చేసే అవకాశాలు లేవు కాబట్టి.. ఎప్పటికప్పుడు సమస్యలు సృష్టించి భారత్​ను ఇబ్బంది పెట్టేందుకు చైనా ప్రయత్నించే అవకాశం ఉంది. మధ్యవర్తుల ద్వారా స్వల్ప స్థాయి సంఘర్షణలను చైనా సృష్టించవచ్చు.

తిరుగుబాటుదారులతో మమేకం!

అరుణాచల్​ ప్రదేశ్​ రాష్ట్రంతో చైనా 1,126కి.మీ పొడవైన సరిహద్దు కలిగి ఉంది. ఈశాన్యంలోని చాలా మంది తిరుగుబాటుదారులు ఈ రాష్ట్రం నుంచే మయన్మార్​లోకి ప్రవేశిస్తుంటారు. అక్కడి నుంచి చైనాలోని యున్నాన్ రాష్ట్రంలోకి వెళ్తూ ఉంటారు. గతంలో అసోం, మణిపుర్, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లోని తిరుగుబాటుదారులు చైనాతో సంబంధాలు నెరిపిన దాఖలాలూ ఉన్నాయి. ఆశ్రయం సహా సరకు రవాణా కోసం ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరిపారు.

వీరందరికీ చైనా ప్రభుత్వం ఇప్పటివరకు నేరుగా సహాయం చేయకపోయినా.. ప్రస్తుతం ఉన్న సైనిక ఉద్రిక్త పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. తిరుగుబాటుదారులు ప్రత్యక్షంగా చైనాకు మద్దతు పలుకుతుండటం వల్ల ఆ దేశానికి పని మరింత సులభమయ్యే అవకాశం ఉంది.

అసోం

సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో పరేశ్ బారువా నేతృత్వంలోని ఉల్ఫా-ఐ(యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం-ఇండిపెండెంట్) చైనాకు బహిరంగంగా మద్దతు ప్రకటించింది. ఈమేరకు గత వారం 17 నిమిషాల సుదీర్ఘ వీడియో ఒకటి విడుదల చేసింది. 1962 యుద్ధంలో అసోంలోని ఏ ఒక్కరికీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హాని తలపెట్టలేదని, బదులుగా స్థానిక రైతులకు వ్యవసాయ పనులలో సాయం చేసిందని ఉల్ఫా తిరుగుబాటుదారులు చెప్పుకొచ్చారు.

దశాబ్దాల నుంచి చైనాతో సంబంధాలు కలిగి ఉంది ఉల్ఫా. ఒకానొక సమయంలో సైనిక, లాజిస్టిక్ సహకారం అందించాలని యున్నాన్ రాష్ట్ర ప్రతినిధులను సంప్రదించింది.

ఉల్ఫా అధినేత బారువా చైనాలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు పట్టణమైన రులిలో తలదాచుకుంటున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు భారత్ మయన్మార్ సరిహద్దులోని అడవుల్లో ఏర్పాటు చేసుకున్న శిబిరాల్లో కొన్ని వందల సంఖ్యలో ఉల్ఫా సాయుధ దళాలు ఉన్నట్లు సమాచారం. చైనాకు దగ్గర్లోనే ఈ శిబిరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వానికి, ఉల్ఫాకు చెందిన ఓ వర్గానికి 15 ఏళ్లుగా జరుగుతున్న చర్చలు ఎటువంటి ఫలితం ఇవ్వలేకపోయాయి. భారత ప్రభుత్వంతో శాంతి చర్చలను ఉల్ఫా వ్యతిరేకిస్తోంది. స్వతంత్ర అసోం డిమాండ్​పై మొండిపట్టుపట్టింది.

నాగా

ప్రపంచంలోనే రెండో పురాతనమైన తిరుగుబాటు సంస్థగా నాగాకు పేరుంది. నాగాలతో 23 సంవత్సరాలుగా ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పటికీ సరైన పరిష్కారం మాత్రం లభించలేదు. సమీప భవిష్యత్తులో చర్చల్లో పురోగతి లభిస్తుందన్న ఆశ కూడా సన్నగిల్లడం వల్ల నాగాల్లో తీవ్ర నిరాశ నెలకొంది.

నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్​(ఎన్ఎస్​సీఎన్​-ఐఎం)కు చెందిన సాయుధ బలగాలు తమ ఆయుధ సామగ్రితో భారత్​ను విడిచి వెళ్లినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మయన్మార్​లో కొత్త శిబిరాలు ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

2015లో ప్రభుత్వానికి, ఎన్ఎస్​సీఎన్​కు మధ్య ఫ్రేమ్​వర్క్​ ఒప్పందం కుదిరినప్పుడు సమస్య పరిష్కారమవుతుందన్న ఆశలు చిగురించాయి. అయితే తర్వాత ఎలాంటి పురోగతి లేకపోవడం వల్ల భారత ప్రభుత్వంపై నాగాలకు విశ్వాసం సన్నగిల్లింది. మరోవైపు కరోనాతో ఇబ్బంది పడుతున్న చైనాకు సంఘీభావంగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న దాదాపు 2 వేల మంది నాగాలు మణిపుర్​లోని ఉఖ్రుల్​ ప్రాంతంలో సంగీత కచేరీ నిర్వహించారు. ఇది భారత్​కు హెచ్చరిక లాంటిది.

ఈశాన్యంలోని నాలుగు రాష్ట్రాల్లో నాగా తిరుగుబాటుదారులు విస్తరించి ఉన్నారు. ఈ ఉద్యమం ద్వారా లబ్ధి పొందినవారిలో చైనా ఒకటి. నాగా తొలి తరం తిరుగుబాటుదారుల్లో కొంత మంది చైనాలోనే ఆయుధ శిక్షణ పొందారు. సహాయం అందించాలని చైనాను సంప్రదించారు.

మిజో

గతేడాది మిజోరంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక నిరసనలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి 'హలో చైనా' అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. 60వ దశకంలో మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్​ఎఫ్) నాయకత్వం వహించిన హింసాత్మక తిరుగుబాటు ఉద్యమం గురించి తెలిసినవారందరికీ ఇది చాలా ప్రమాదకరమైన విషయమని అర్థమవుతుంది.

మణిపుర్

ఈశాన్య రాష్ట్రాల్లో మణిపుర్​లోనే అత్యధిక(సుమారు 50 వరకు) తిరుగుబాటు సంస్థలున్నాయి. సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల తిరుగుబాటు దళాల్లో చేరడమే ఇక్కడి యువతకు జీవన విధానంగా మారింది. మెయిటీ వంటి శక్తిమంతమైన తిరుగుబాటు సంస్థలు కమ్యూనిస్టు భావజాలాన్నే పాటిస్తున్న నేపథ్యంలో చైనాతో పొత్తుపెట్టుకోవడం సర్వసాధారణమే. ఈ సంస్థలకు చైనా నుంచి విస్తృత సహకారం లభించింది. ఈ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇది చైనా తన ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు.

వలస కార్మిక యువత

కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రస్తుతం లక్షలాది మంది యువత తమ జీవనోపాధి కోల్పోయి స్వస్థలాలకు పయనమయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వీరి సంఖ్య అధికంగా ఉంది. అలానే అక్కడి ప్రజలు వారి రూపం కారణంగా జాతివివక్ష ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఇలాంటి విషయాల్ని అడ్డంపెట్టుకుని తిరుగుబాటు సంస్థలు యువతకు ఎరవేసే ప్రమాదం ఉంది.

పౌరసత్వం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య ప్రజలు తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. జాతీయ పౌర పట్టిక విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. బలవంతంగా వీటిని అమలు చేస్తున్నారని విమర్శించారు. వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ప్రస్తుతం ఆందోళనలన్నీ సద్దుమణిగినప్పటికీ.. ప్రజల్లో ఈ భయాలు ఇంకా ఉన్నాయి. ఈశాన్య ప్రజల మనోభావాలను పూర్తిగా విస్మరించి ఈ చట్టం తీసుకొచ్చారని వారు భావిస్తున్నారు.

మనసులు గెలిస్తేనే

ఇవన్నీ ఈశాన్యంలో చైనా పట్ల అనుకూల వైఖరి పెరిగే అవకాశం ఉందని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. ఈశాన్య భారతదేశంలో సామాజిక రాజకీయ పరిస్థితులు చైనా జోక్యం చేసుకోవడానికి అత్యంత అనుకూలంగా మారుతున్నాయి. అందువల్ల ఈశాన్య రాష్ట్రాలపై శీతకన్నువేసే నిర్ణయాలను పూర్తిగా నిలిపివేయాలి. ప్రజల శ్రేయస్సు కోసం వివేకవంతమైన చర్యలు తీసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజల మనసులను గెలుచుకునే దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేయాలి.

(రచయిత-సంజీవ్ బారువా)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.