ETV Bharat / opinion

కుదుటపడుతున్న కశ్మీరం.. సవాళ్లను దాటి శాంతి దిశగా!

author img

By

Published : Aug 13, 2020, 7:30 AM IST

గతేడాది కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లోని అత్యంత ముఖ్యమైన వాటిల్లో జమ్ముకశ్మీర్​ ప్రత్యేకప్రతిపత్తి హోదా రద్దు ఒకటి. అప్పటి నుంచి సామాజిక, భద్రతపరమైన మార్పులు జరిగాయి. ఉగ్రదాడులు, నిరసనలతో హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతూ ఉండే కశ్మీరం శాంతి దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర హోదా రద్దై ఏడాది గడిచిన నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లో జరిగిన మార్పులపై ప్రత్యేక కథనం

A special story on Jammu-Kashmir  in view of one year as revocation Special status
కుదుటపడుతున్న కశ్మీమరం.. సవాళ్లను దాటి శాంతి దిశగా పయనం

జమ్ముకశ్మీర్‌లో 370, 35ఏ అధికరణలను కేంద్రప్రభుత్వం రద్దుచేసి ఆగస్టు అయిదునాటికి ఏడాది పూర్తయింది. ఈ సాహసోపేత నిర్ణయం ఫలితంగా ఆ రాష్ట్రం ప్రత్యేకప్రతిపత్తి హోదాను కోల్పోయింది. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. ఏడు దశాబ్దాలుగా పాకిస్థాన్‌ ఉగ్రవాద, వేర్పాటువాద దురాగతాలకు బలవుతూ వచ్చిన జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి తొలగించిన చారిత్రక పరిణామం ఫలితంగా- ఏడాదిలో వచ్చిన సామాజిక, భద్రతాపరమైన మార్పులు తెలుసుకోవాలి. ఇప్పుడక్కడ సైన్యానిదే పైచేయి. కశ్మీర్‌ లోయలో భద్రత మెరుగైంది. వేర్పాటువాద కార్యకలాపాల అణచివేతలో, ఉగ్రవాద కార్యకలాపాల నిరోధంలో సాయుధ దళాలు ముందడుగు వేశాయి. జనవరి-జులై మధ్యకాలంలో సాయుధ బలగాలు 136మంది తీవ్రవాదుల ఆట కట్టించాయి.

హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ ఆపరేషనల్‌ కమాండర్‌ రియాజ్‌ నాయికూ, లష్కరే తొయిబాకు చెందిన హైజర్‌, జైషే మహ్మద్‌కు చెందిన ఖారీ యాసీన్‌, అన్సర్‌ ఘజ్యతుల్‌ హింద్‌ (ఏజీయు హెచ్‌)కు చెందిన బుర్హాన్‌ ఖోకా వంటి కరడుగట్టిన అగ్రశ్రేణి తీవ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది. 40-45 కిలోల పేలుడు పదార్థాలతో ఉన్న ఓ కారును స్వాధీనం చేసుకుని పుల్వామా తరహా దాడిని నివారించింది. ఎల్‌ఓసీ వెంబడి నౌషేరా వద్ద ముగ్గురు ఉగ్రవాదులను హతం చేసి భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనపరచుకొని అక్కడి చొరబాటు యత్నాలను వమ్ముచేసింది.

నిరసనలు తగ్గుముఖం

తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణ చర్యలు చేపడుతున్నా ఈ క్రమంలో జవానులూ ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో తీవ్రవాద దాడుల్లో జవాన్లు అమరులయ్యేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఉగ్రవాదులను హతమార్చడానికి జరుపుతున్న దాడుల్లో జవాన్లు వీరమరణం పొందుతున్నారు. నిఘా వర్గాల నిర్దిష్ట సమాచారం మేరకు భద్రతాదళాలు దాడులు నిర్వహిస్తున్నాయి. గతంలో ఇలా ఉండేది కాదు. ఏవో కొన్ని ప్రాంతాలను చుట్టుముట్టి, సోదాలు జరిపే సమయాల్లో తీవ్రవాదులు విరుచుకుపడి జవాన్లను పొట్టనపెట్టుకునేవారు. అందువల్ల అప్పట్లో జవాన్ల మరణాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. భద్రతాదళాల దాడుల వల్ల వేర్పాటువాద కార్యకలాపాలు క్షీణించాయి. తీవ్రవాద ముఠాలు స్థానికంగా చేపట్టే సభ్యుల నియామకం 40శాతం మేర క్షీణించింది. వేర్పాటువాదుల కార్యకలాపాలు, బందులు నామమాత్రంగా ఉంటున్నాయి. నిరుడు జనవరి-జులై మధ్యకాలంలో 30సార్లు బంద్‌కు పిలుపిచ్చారు. ఈ ఏడాది వాటి సంఖ్య నాలుగుకు మించలేదు. కొన్ని ప్రమాదకర వేర్పాటువాద ముఠాలు నామరూపాలు కోల్పోతున్నాయి. ఏపీహెచ్‌స్‌(జి) సంస్థ చైర్మన్‌ ఎస్‌ఏఎస్‌ జిలానీ పదవి నుంచి వైదొలడంతో కశ్మీర్లో రాళ్లు రువ్వే సంఘటనలు క్షీణించాయి. దీర్ఘకాలంలో కశ్మీర్‌ లోయలో శాంతి నెలకొల్పే దిశగా ఇవన్నీ బలమైన సంకేతాలు ఇస్తున్నాయి.

జమ్ముకశ్మీర్‌ సంక్షుభిత ప్రాంతాల మీద కేంద్ర ప్రభుత్వం గట్టి అదుపు సంపాదించడం ప్రశంసనీయం. అక్కడింకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రముఖ న్యాయకోవిదులు, విద్యావేత్తలు, మాజీ సైనికాధికారులు సభ్యులుగా ఉన్న ‘ఫోరం ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇన్‌ జమ్ము అండ్‌ కశ్మీర్‌’ సంస్థ తాజా నివేదిక ప్రకారం, ఎల్‌ఓసీ వెంబడి పాక్‌ దళాల కాల్పులు, చొరబాట్లు 370 అధికరణ రద్దు తరవాత పెరిగాయి. సామాజిక మాధ్యమాల ద్వారా విషప్రచారం చేస్తూ, కశ్మీరీలను తీవ్రవాదులుగా మార్చడానికి పాకిస్థాన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండటం పట్ల ఈ నివేదిక ఆందోళన వ్యక్తీకరించింది. రానున్న రోజుల్లో భారత నిఘా సంస్థలు భద్రతా సంస్థలు ఎదుర్కోనున్న తొలి సవాలు ఇదే. జమ్ముకశ్మీర్‌లో హైస్పీడ్‌ అంతర్జాల సేవలను పునరుద్ధరించాలన్న ఒత్తిళ్లు వస్తున్న సమయంలో భద్రతా వ్యవస్థలకు ఇది మరింత కఠిన సవాలుగా మారుతుంది.

అందుకే చైనా అలా చేస్తోంది!

లద్దాఖ్‌లో చైనా ఉనికి పెరుగుతుండటం రెండో సవాలు. 370వ అధికరణ రద్దు తరవాత ఇది ఉద్ధృతమైంది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికి, పాకిస్థాన్‌ పట్ల సానుభూతి కూడగట్టడానికి, మొత్తం వ్యవహారాన్ని అంతర్జాతీయం చేయడానికి చైనా ప్రయత్నించింది. మే నెలలో తూర్పు లద్దాఖ్‌లో దురాక్రమణకు యత్నించడం భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక వ్యవహారాల్లో చైనా జోక్యం శ్రుతి మించుతోందనడానికి సంకేతం. గత, వర్తమాన కోణాలనుంచి పరిశీలించి భవిష్యత్‌ పర్యవసానాలను భారత భద్రతా, నిఘా వ్యవస్థలు అంచనా వేయాలి. సరిహద్దు వివాదాల పరిష్కారానికి 1963లో చైనా-పాకిస్థాన్లు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

కశ్మీర్‌ అంశంలో చైనా జోక్యం చేసుకోవడానికి ఆ ఒప్పందం ద్వారా పాక్‌ అవకాశం ఇచ్చింది. దీని ప్రకారం ఉభయదేశాలు భూభాగాలను మార్పిడి చేసుకున్నాయి. వివాదాస్పద ట్రాన్స్‌-కారకోరం ప్రాంతాన్ని చైనాకు పాక్‌ అప్పగించింది. నిజానికిది లద్దాఖ్‌లో ఓ భాగం. ముస్లిం అల్పసంఖ్యాక వర్గాలకు చైనా మద్దతు ఇస్తున్నట్లు పైకి కనిపిస్తుంది. లోగుట్టు భిన్నంగా ఉంది. షింజాంగ్‌ ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లోని వీగర్‌ అల్పసంఖ్యాక వర్గాలను వేధిస్తోందన్న విమర్శల నుంచి ప్రపంచం దృష్టి మళ్లించడానికి చైనా ప్రయత్నంగా తాజా పరిమాణాలను భావించవచ్ఛు లద్దాఖ్‌లో చైనా దురాక్రమణ యత్నాలకు, సైనిక చొరబాట్లకు భారత్‌ దీటైన జవాబిచ్చింది. ఇంతటితో సరిపోదు. చైనా ప్రభుత్వ వీగర్‌ అణచివేత ధోరణులు, తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేయడం, వెట్టిచాకిరీ విధానాలు, అల్పసంఖ్యాకుల మూకుమ్మడి నిర్బంధాన్ని- భారత్‌ ప్రపంచవ్యాప్తంగా వెల్లడించాలి. చైనా దుందుడుకు చర్యలకు కళ్లెం వేయడానికి ఇది ఉపకరిస్తుంది.

వ్యవస్థాగత సంస్కరణలు కీలకం

కశ్మీరు లోయలో సుస్థిర శాంతిసాధన యజ్ఞంలో కశ్మీరీలను భాగం చేయడం మూడో అంశం. పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉద్యోగాలు కల్పించడం వంటి చర్యలతో ఈ ప్రాంతాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దాలి. దీర్ఘకాలంలో ఉపఖండం యావత్తూ శాంతి వెల్లివిరిసేందుకు ఇది దోహదపడుతుంది. ఈ లక్ష్యసాధన దిశగా గడచిన ఏడాది కాలంలో రూ.13,600 కోట్ల పెట్టుబడుల కోసం 168 అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన ఆరువేల ఎకరాల భూమిని గుర్తించింది. అదనంగా జమ్ముకశ్మీర్‌లో కొత్తగా 50 డిగ్రీ కళాశాలలను ప్రారంభించింది. 70 ఏళ్లలో ఎన్నడూలేనంత పెద్దసంఖ్యలో 25 వేల కాలేజీ సీట్లను అదనంగా ఏడాదిలోనే సృష్టించింది. పరిశ్రమలు, పర్యాటకం, ఆర్థిక, పోలీసు విభాగాల బలోపేతానికి వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టింది. ఆయుష్మాన్‌ భారత్‌, పీఎమ్‌ ఆవాస్‌ యోజన, పీఎమ్‌ కిసాన్‌, స్వచ్ఛ భారత్‌ వంటి పథకాల ప్రయోజనాలను కశ్మీరీలకూ వర్తింపజేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. కశ్మీరీలను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చే దృష్టితో భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలప్రదమై వలస పాలకులు సృష్టించిన గందరగోళానికి తెరపడుతుందని ఆశించాలి. 370 అధికరణ రద్దు తదనంతర పరిణామాలను ఈ కోణం నుంచే చూడాలి!

రచయిత - డాక్టర్​ మహేంద్రబాబు కురువ, హెచ్​ఎన్​బీ గఢ్వాల్​ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్​ డీన్​

ఇదీ చూడండి: 'పారదర్శక పన్ను విధానం' వేదికను ప్రారంభించనున్న మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.