ETV Bharat / opinion

తరగతి గదిని అన్ని విధాలగా అభివృద్ధి చేయాలి - infrastructure in Schools

విద్యార్థుల గ్రహణశక్తిని, అభ్యసన ఆసక్తిని పెంచుతూ, వారిలో అంతర్నిహిత సామర్థ్యాలను ఒడుపుగా గ్రహించి సానపట్టే మేలిమి వాతావరణం మచ్చుకైనా లేని స్కూళ్లు... బట్టీయం కార్ఖానాలుగా మారిపోయి ఎన్నో తరాల్ని ఇప్పటికే నిర్వీర్యం చేశాయి. సాంకేతిక అద్భుతాల ఆవిష్కరణలతో ప్రపంచం శరవేగంగా దూసుకుపోతుంటే... మన దేశ విద్యార్థులు, విద్యా విధానం ఏ దశలో ఉన్నాయి? దీని నుంచి బయటపడాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి.

A special story on infrastructure in Schools and  Education system
తరగతి గదిని అన్ని విధాలగా అభివృద్ధి చేయాలి!
author img

By

Published : Sep 21, 2020, 9:50 AM IST

ఐరోపా ఆఫ్రికా ఖండాల్లోని ఏ దేశ జనాభాతో సరిపోల్చినా ఇండియాలో పాఠశాల విద్యార్థుల సంఖ్యే ఎక్కువ. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లోని 15 లక్షల 50 వేలకుపైగా పాఠశాలల్లో 24కోట్ల 75 లక్షలమంది చదువరులున్నారని, ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత సెకండరీ దాకా 94 లక్షల 16 వేల మంది పైచిలుకు టీచర్లు భావితరాన్ని తీర్చిదిద్దుతున్నారని గణాంకాలు చాటుతున్నాయి. చూపులకు ఇంత ఏపుగా ఉన్న పాఠశాల విద్యారంగం- ఎంచబోతే మంచమంతా కంతలే అన్నట్లుగా తిరోగమన పథంలో ఉండటమే బెంగటిల్లజేస్తోంది. దేశీయంగా దాదాపు పది లక్షల 84వేల ప్రభుత్వ పాఠశాలలకు ఎకాయెకి 61 లక్షల 84వేల ఉపాధ్యాయ పోస్టులు మంజూరైనా అందులో 17.14 శాతం, అంటే పది లక్షల 60వేల పైచిలుకు ఖాళీగా ఉన్నాయని కేంద్రం తాజాగా ప్రకటించింది. సిక్కిమ్‌లో ఖాళీగా ఉన్న గురుపీఠాలు 57.5 శాతం కాగా ఝార్ఖండ్‌, బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ వంటివి దాని వెన్నంటి ఉన్నాయి. ఏపీలో దాదాపు 35వేలు (14.1 శాతం), తెలంగాణలో 18 వేల (12.7 శాతం) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పార్లమెంటుకు తెలిపిన కేంద్ర సచివులు- గురుపీఠాల భర్తీ నిరంతర ప్రక్రియ అని విశ్లేషించారు.

కొత్తరూపునివ్వాలి

ప్రపంచ విజ్ఞాన అమేయశక్తిగా ఇండియాను తీర్చిదిద్దడానికి నూతన జాతీయ విద్యావిధానాన్ని రూపొందించిన కేంద్రం- ఉపాధ్యాయ పోస్టుల భర్తీనే కాదు, వారి బోధన సామర్థ్యాన్నీ మరేమాత్రం విస్మరించే వీల్లేదు. వచ్చే ఏడాదికల్లా ఉపాధ్యాయ విద్యకోసం సమగ్ర జాతీయ పాఠ్యప్రణాళిక ముసాయిదా తయారుచేసి దరిమిలా 5-10 ఏళ్లకోసారి దాన్ని సవరిస్తామని కేంద్రం చెబుతోంది. సాంకేతిక అద్భుతాల ఆవిష్కరణలతో ప్రపంచం శరవేగంగా దూసుకుపోతుంటే, ఎప్పటికప్పుడు వాటిని ఆకళింపు చేసుకొంటూ విద్యార్థుల ప్రగతికి నిచ్చెన మెట్లుగా టీచర్లు నిర్వర్తించాల్సిన బాధ్యత గురుతరమైనది. దేశ భవిష్యత్‌ నిర్మాతలుగా ఉపాధ్యాయులను సరైన శిక్షణతో నిష్ఠగా సానపట్టి.. విద్యార్థుల శారీరక మానసిక వికాస కేంద్రాలుగా పాఠశాలలకు కొత్తరూపునివ్వాలి!

ఊకదంపుడు ప్రకటనలే..!

'గతంలో మనం నేర్చుకొన్నట్లుగా ఇవాళ మనం పిల్లలకు బోధిస్తే వాళ్ల భవిష్యత్తును దోచుకొన్నవాళ్లం అవుతాము' అని అమెరికన్‌ తత్వవేత్త జాన్‌డ్యూయి చేసిన వ్యాఖ్య సార్వకాలికమైనది. విద్యార్థుల గ్రహణశక్తిని, అభ్యసన ఆసక్తిని పెంచుతూ, వారిలో అంతర్నిహిత సామర్థ్యాలను ఒడుపుగా గ్రహించి సానపట్టే మేలిమి వాతావరణం మచ్చుకైనా లేని స్కూళ్లు బట్టీయం కార్ఖానాలుగా మారిపోయి ఎన్నో తరాల్ని ఇప్పటికే నిర్వీర్యం చేశాయి. వెతికి పట్టుకోవాలేగాని ప్రతి తరగతి గదిలో ఓ సీవీ రామన్‌, జగదీశ్‌ చంద్రబోస్‌, హర్‌గోవింద్‌ ఖొరానా దొరుకుతారన్న ఊకదంపుడు ప్రకటనలేగాని, కొత్త సహస్రాబ్ది అవకాశాల్ని అందిపుచ్చుకొనేలా నేటి తరాన్ని తీర్చిదిద్దే విద్యా వ్యవస్థ నిర్మాణం ఇప్పటికే ఎంతో ఆలస్యం అయింది. ఉపాధ్యాయ శిక్షణలో ఫిన్లాండ్‌ ప్రపంచానికే ఆదర్శం అవుతుంటే, సాంకేతిక దిగ్గజాల దన్నుతో కంప్యూటర్‌ కోడింగ్‌ను పాఠశాల స్థాయికి చేర్చిన అమెరికా ధీమాగా ముందడుగేస్తోంది. రేపటితరం శారీరక మానసిక మేధావికాసానికి పాఠశాలే గర్భగుడి.

విద్యార్హతలతో పాటు బోధనాసక్తి, కొత్త విషయాలు గ్రహించి పిల్లలకు చెప్పే అనురక్తి దండిగా గలవారినే గురుపీఠాలకు ఎంపిక చేయడంతోపాటు, స్కూళ్లలో మౌలిక సదుపాయాల పరికల్పన పైనా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. డిజిటల్‌ బోధనకు అవసరమైన సాధన సంపత్తి సమకూర్చడం ఎంత అవసరమో, నిరుపేద పిల్లలకు పౌష్టికాహారం అందించి నాణ్యమైన విద్య బోధించడాన్నీ అంతే బాధ్యతగా నిర్వర్తించాలి. టాయిలెట్ల సౌకర్యం ఆడపిల్లల పైచదువులకు దోహదపడుతోందని, ఆట స్థలాలు విద్యార్థి మనోవికాసంలో చురుకైన పాత్ర పోషిస్తాయన్న వాస్తవాల్ని గుర్తించి- పాఠశాలల రూపురేఖల్ని గుణాత్మకంగా మార్చాలి. దేశ భవిష్యత్తును నిర్మించే తరగతి గదిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడాన్ని మించిన పవిత్ర కర్తవ్యం ఏముంది?

ఇదీ చూడండి: లాభసాటి సేద్యం- ఎలా సాధ్యం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.