ETV Bharat / opinion

సమస్యల పథంలోనే సాంకేతిక రథం

ఈ ఏడాది రెండో త్రైమాసికంలో..భారత్​లో 5జీ స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించాలని ట్రాయ్‌ భావించినప్పటికీ కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. అంత ఖర్చుతో కూడిన 5జీ నెట్‌వర్క్‌- భారత్‌కు ఇప్పుడు అవసరం లేదని వాదిస్తున్నారు మరికొందరు.

5G_INDIA
సమ్యసల పథంలో '5జీ' టెక్నాలజీ ఏర్పాట్లు
author img

By

Published : Oct 31, 2020, 11:21 AM IST

Updated : Oct 31, 2020, 2:01 PM IST

కొత్త తరం మొబైల్‌ సాంకేతికతగా పేరొందిన 5జీ టెక్నాలజీని ఇప్పటికే ప్రపంచంలో దాదాపు 40 దేశాలు వినియోగిస్తున్నాయి. పొరుగునున్న చైనా 5జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ను విస్తృతంగా వినియోగిస్తోంది. 6జీ ప్రయోగాలనూ ప్రారంభించింది. అంతేకాదు- 5జీకి అవసరమైన సాధన సంపత్తిని ప్రపంచానికి అందించడంలోనూ హువావే వంటి చైనా కంపెనీలే ముందున్నాయి. మన దేశంలో 5జీ ప్రయాణం ఇంకా మొదలే కాలేదు. ఈ సాంకేతికతను పొందాలంటే భారత్‌ కనీసం మరో రెండేళ్లపాటు వేచి చూడాల్సి ఉంటుందన్నది నిపుణుల మాట.

జియో, ఎయిర్‌టెల్‌ వంటి మొబైల్‌ నెట్‌వర్క్‌ ప్రొవైడర్లు 5జీ సాంకేతికతపై ఉత్సుకతగా ఉన్నా ప్రభుత్వం ఇంకా అందుకు అవసరమైన స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించలేదు. 5జీ సాంకేతికతకు అవసరమైన సాధనసంపత్తిని సమకూర్చుకునే విషయంలోనూ కేంద్ర నిర్ణయాలు ఈ విషయంలో వెనకబాటుకు కారణమవుతున్నాయని టెలికాం వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

4జీ కంటే వంద రెట్ల వేగంతో..

టెలికాం కంపెనీల అసంతృప్తిమొబైల్‌ నెట్‌వర్క్‌లో 5జీ ఓ పెను సంచలనం. అత్యధిక వేగం, తక్కువ లేటెన్సీ, ఎక్కువ కనెక్టివిటీ ఈ సాంకేతికతలో ప్రధాన అంశాలు. ఇప్పుడు మనం వినియోగిస్తున్న 4జీ కంటే 5జీ 100 రెట్ల వేగంతో పని చేస్తుంది. సెకనుకు 15 నుంచి 20 గిగాబైట్ల (జీబీ) డేటాను ట్రాన్స్‌మిట్‌ చేయగల వేగం దీనిలో ఉంది.

ఒక సెల్‌ఫోన్‌ లేదా ఉపకరణంలో ఏదైనా పని చేయడానికి మనం మీట నొక్కినప్పటి నుంచి ఆ పని పూర్తవడానికి పట్టే సమయాన్ని లేటెన్సీ అంటారు. 4జీ కంటే 10రెట్లు తక్కువ సమయంలోనే పని పూర్తి చేసేంత తక్కువ లేటెన్సీ 5జీ సొంతం. ఉపకరణాలకు అనుసంధానత విషయంలోనూ ఈ కొత్త సాంకేతికత చాలా ముందుంది. 5జీతో ఒక చదరపు కిలోమీటరు పరిధిలో 10లక్షల ఉపకరణాలను అనుసంధానించవచ్చు.

సిద్ధమవుతోన్న అగ్రశ్రేణి నెట్​వర్క్​లు

దేశంలో 5జీ నెట్‌వర్క్‌ సేవలకు తాము సిద్ధంగానే ఉన్నామని- నెట్‌వర్క్‌ ప్రొవైడర్లు, 5జీ వ్యవస్థలతో పనిచేసే ఉపకరణాల తయారీదార్లు సిద్ధం కావడమే తరువాయి అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ప్రకటించింది. వాస్తవానికి 5జీ నెట్‌వర్క్‌ కోసం దేశంలో అగ్రశ్రేణి మొబైల్‌ నెట్‌వర్క్‌ కంపెనీలు రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. వొడాఫోన్‌ ఐడియా కూడా 5జీ పోటీలో ఉన్నామని ప్రకటించింది. ఈ నెట్‌వర్క్‌కు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకోవడంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే వాటికి అవరోధంగా మారుతున్నాయి. దీని ఏర్పాటుకు అవసరమైన స్పెక్ట్రమ్‌ వేలం విషయంలో ప్రభుత్వ ధోరణిపై టెలికాం కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. స్పెక్ట్రమ్‌ ధర విదేశాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందంటున్నాయి.

విక్రయాలపై కన్నేసిన ట్రాయ్

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) 5జీ స్పెక్ట్రమ్‌ను ఇండియాలో 3400-3800 మెగా హెర్ట్జ్‌ బాండ్‌లో విక్రయిస్తామని చెబుతోంది. ఈ బాండ్‌లో ఒక మెగా హెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ ధరను ఏడు కోట్ల అమెరికా డాలర్లు (దాదాపు రూ.513 కోట్లు) మూలధరగా నిర్ణయించింది. అయితే ఇది దక్షిణ కొరియాలో 132 కోట్ల రూపాయలు, యూకేలో రూ.73 కోట్లు, ఆస్ట్రేలియాలో దాదాపు రూ.37 కోట్లుగా ఉందని టెలికాం నెట్‌వర్క్‌ కంపెనీలు చెబుతున్నాయి. అందువల్ల స్పెక్ట్రమ్‌ ధర తగ్గించాలని కోరుతున్నాయి.

వాస్తవానికి ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 5జీ స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించాలని ట్రాయ్‌ భావించినప్పటికీ కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో అది సాధ్యం కాలేదు.ఆలస్యం చేస్తే వెనకబాటేదేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఓ అంచనా. అంత ఖర్చుతో కూడిన 5జీ నెట్‌వర్క్‌- భారత్‌కు ఇప్పుడు అవసరం లేదని ఓ వర్గం వాదిస్తోంది.

వాదనలూ చాలానే..

5జీ సాంకేతికత ప్రధానంగా మొబైల్‌ డేటా వేగాన్ని పెంచడానికి, డ్రైవర్‌ లేకుండానే నడిచే కార్ల వాడకానికి అవసరమవుతుందని, అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇంకా చోదకరహిత కార్లు నడవడం లేదన్న వాదన ఉంది. మరోవైపు 4జీ కంటే 5జీ మొబైల్‌ డేటా 100 రెట్లు వేగంగా పని చేస్తుంది. దానికి తగ్గట్లే టారిఫ్‌ ధర సైతం పెరుగుతుంది. 95 శాతానికి పైగా ప్రీపెయిడ్‌ వాడేవారే ఉన్న మనదేశంలో 5జీ టారిఫ్‌ను భరించడానికి వినియోగదారులు సిద్ధంగా లేరన్న మాటా వినిపిస్తోంది.

పెరగనున్న ఖర్చులు!

దేశంలో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై సగటున వెచ్చించేది 12వేల రూపాయలేనని- కానీ 5జీ సాంకేతికతతో నడిచే ఫోన్లు కావాలంటే కనీసం రూ.30 వేలు ఖర్చు చేయాలన్న వాదన ఉంది. కొత్త సాంకేతికత వచ్చినప్పుడు దాన్ని సాధ్యమైనంత త్వరగా వినియోగించుకోవడం మంచిదని, లేనిపక్షంలో రేసులో వెనకబడతామని సాంకేతిక రంగ నిపుణులు చెబుతున్నారు.

4జీ వచ్చేవరకు భారత్‌లో ఇ-కామర్స్‌, యాప్‌ ఆధారిత సేవలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వంటివన్నీ నామమాత్రంగా నడిచేవి. 4జీతో అంతర్జాల వేగం పెరగడం, ఆ సాంకేతికత ఉన్న ఉపకరణాల ధర అందుబాటులోకి రావడంతో- నేడు దేశంలో అంతర్జాల సేవలు విస్తృత ప్రయోజనాలు ఇస్తున్నాయి.

ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌తో 4జీ రంగం రూపురేఖలే మారిపోయాయి. చిప్‌సెట్‌ తయారీలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన క్వాల్కమ్‌ దక్షిణాసియా దేశాల ప్రెసిడెంట్‌ రాజెన్‌ వగాడియా 5జీ సాంకేతికతను భారత్‌ సముపార్జించుకోకపోతే దేశంలోని తొమ్మిది వేలకు పైగా ఉన్న సాంకేతిక అంకుర సంస్థలు దాని ప్రయోజనాలకు దూరమవుతాయంటున్నారు. ఈ పరిస్థితుల్లో సవాళ్లను అధిగమించి సాధ్యమైనంత వేగంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం చారిత్రక అవసరం.

స్వదేశీ పరిజ్ఞానంతో..

సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న ప్రస్తుత తరుణంలో భారత్‌- చైనా కంపెనీల 5జీ సాంకేతికతను వాడుకొనే విషయంలో ఒకటికి రెండుమార్లు ఆలోచిస్తోంది. మరోవైపు రిలయన్స్‌ జియో 'ఓపెన్‌ సోర్సెస్‌' ద్వారా సొంతంగా 5జీ టెక్నాలజీని సమకూర్చుకోవడానికి సన్నాహాలు ప్రారంభించింది. అంతేకాదు సాధ్యమైనంతమంది వినియోగదారులను 5జీ వైపు ఆకర్షించేలా అయిదువేల రూపాయల లోపే 5జీ ఫోన్‌ తయారుచేయాలని ఆ కంపెనీ యోచిస్తోంది.

మరోవైపు భారత్‌కే ప్రత్యేకమైన 5జీ నెట్‌వర్క్‌ వ్యవస్థను తయారుచేసుకోవడానికి దేశీయ కంపెనీలను అనుమతించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై మొబైల్‌ నెట్‌వర్క్‌ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నాలవల్ల 5జీ ఏర్పాటు వ్యయం 30 నుంచి 40 శాతం అదనంగా పెరుగుతుందని అవి చెబుతున్నాయి. ఇలా దేశానికే ప్రత్యేకమైన 5జీ నెట్‌వర్క్‌ వ్యవస్థలను ఉపయోగిస్తే బయటి దేశాలవారు భారత్‌కు వచ్చినప్పుడు లేదా ఇక్కడివారు విదేశాలకు వెళ్లినప్పుడు ఈ 5జీ పని చేయకుండా పోతుందని హెచ్చరిస్తున్నాయి. అందుకే 'ఇంటర్నేషనల్‌ టెలికాం యూనియన్‌' ఆమోదించిన ప్రపంచస్థాయి 5జీ నెట్‌వర్క్‌నే భారత్‌లోనూ నెలకొల్పాలని కేంద్రాన్ని కోరాలని వివిధ కంపెనీలు భావిస్తున్నాయి.

రచయిత- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి.

ఇదీ చదవండి:'పాక్‌ ప్రకటనతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి'

Last Updated : Oct 31, 2020, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.