LIVE : రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం - ప్రత్యక్షప్రసారం - భారత్ జోడో న్యాయ్ యాత్ర లైవ్
🎬 Watch Now: Feature Video
Published : Jan 14, 2024, 4:04 PM IST
|Updated : Jan 14, 2024, 4:20 PM IST
Rahul Bharat Jodo Nyay Yatra Live : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల వేళ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమైంది. అల్లర్లతో అట్టుడికిన మణిపుర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. 15 రాష్ట్రాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల గుండా ఈ యాత్ర సాగునుంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర బస్సుల్లోనే కాకుండా కాలినడకన కూడా 6713 కిలోమీటర్ల దూరం సాగనుంది. ఈ యాత్ర 67 రోజుల్లో 110 జిల్లాలు 100 లోక్‌సభ స్థానాలు, 337 శాసనసభ నియోజకవర్గాల్లో సాగుతుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మణిపుర్‌లో ప్రారంభమైన ఈ యాత్ర ముంబయిలో మార్చి 20 లేదా 21 తేదీల్లో ముగుస్తుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ వైఫల్యాలను చాటి చెప్పేందుకు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని హస్తం పార్టీ భావిస్తోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక న్యాయం సహా కేంద్ర ప్రభుత్వ విధానాల్లోని వైఫల్యాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.