LIVE : తెలంగాణ భవన్‌లో పారిశుద్ద్య కార్మికులతో కలిసి కేటీఆర్ భోజనం - కేటీఆర్ లైవ్
🎬 Watch Now: Feature Video
Published : Jan 1, 2024, 1:35 PM IST
|Updated : Jan 1, 2024, 1:52 PM IST
తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు 2023కు ఘనంగా వీడ్కోలు పలికి అంతకుమించి గ్రాండ్‌గా 2024 కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఈ ఏడాదంతా ఎంతో ఉత్సాహంగా ఉండాలని ఆశిస్తూ ఉత్సాహంగా న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పారు. ఇక కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ప్రజలకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యూ ఇయర్ సందేశాన్ని ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌కు వచ్చిన వారంతా కేటీఆర్‌ను కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.