ETV Bharat / lifestyle

ఇక నుంచి ఫ్రిజ్‌... మీ వంటింటి గట్టు కిందనే!

మన ఉరుకులు పరుగుల జీవితంలో చీటికిమాటికి బయట తిరగకుండా.. కూరగాయలు పండ్లూ వారానికి సరిపడా ఒకేసారి కొని తెచ్చుకుని ఫ్రిజ్​లో పెట్టుకుంటాం. ఫ్రిజ్ కిచెన్​లో లేకపోతే వంట చేసేటప్పుడూ మాటిమాటికీ అటూ ఇటూ తిరగాలి. ఈ సమస్యకు పరిష్కారంగా అండర్ కౌంటర్ రిఫ్రిజిరేటర్ డ్రాయర్స్ మార్కెట్​లో దర్శనమిస్తున్నారు.

you can keep your refrigerator under the kitchen platform
మీ వంటింటి గట్టు కిందనే ఫ్రిజ్
author img

By

Published : Sep 13, 2020, 5:49 PM IST

ఈరోజుల్లో ఎవరికి వారివి హడావుడి జీవితాలే. దాంతో కూరగాయలూ పండ్లూ... ఇలా అన్నిటినీ ఒకేసారి ఎక్కువెక్కువ తెచ్చుకుని పెట్టేసుకుంటాం. మామూలుగానూ ఫ్రిజ్‌లో పెట్టే సామగ్రి ఎక్కువగానే ఉంటుంది. అలా అని పెద్ద ఫ్రిజ్‌ని కొంటే కిచెన్‌లో పట్టకపోవచ్చు. దూరంగా పెడితే వంట చేసేటపుడు మాటిమాటికీ అటూ ఇటూ తిరగాలి. అందుకే, మామూలు ఫ్రిజ్‌కి తోడుగా ఇపుడు కిచెన్‌ గట్టు కింద మిగిలిన అరలతో కలిసిపోయేలా చిన్నసైజు ‘అండర్‌ కౌంటర్‌ రిఫ్రిజిరేటర్‌ డ్రాయర్స్‌’ వస్తున్నాయి.

24 అంగుళాలూ అంతకన్నా ఎక్కువ సైజుల్లోనూ రెండు మూడు సొరుగులతోనూ వస్తున్న ఈ ఫ్రిజ్‌ని కిచెన్‌ గట్టుకింద అమర్చుకుని కూరగాయలూ పండ్లూ ఇంకా వంటకు అవసరమైన వాటి వరకూ దీన్లో పెట్టేసుకుంటే దగ్గర్లో అందుబాటులో ఉంటాయి. పైగా సొరుగుల్లా ఉండడంతో ఇందులో ఉన్నవాటిని తీసుకోవడం పెట్టుకోవడం కూడా సులభం. ఈ ఫ్రిజ్‌ సొరుగులకు వేరు వేరు ఉష్ణోగ్రతలూ అమర్చుకోవచ్చు. కాబట్టి, బాగా చల్లదనం కావల్సినవాటినీ కొంచెం కూలింగ్‌ సరిపోయే వాటినీ విడివిడిగా సర్దుకోవచ్చు. బాగుంది కదూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.