ETV Bharat / lifestyle

వంటింట్లో ప్రమాదాలు జరగకుండా.. ఇవి పాటించాల్సిందే! - kitchen tips

సాధారణంగా వంటింట్లో జరిగే ప్రమాదాలు చాలావరకు ముందుగానే నివారించగలిగినవే. చిన్నపాటి నిర్లక్ష్యం.. ఏమవుతుందిలే అనే భావన.. కొన్నిసార్లు గృహిణుల ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కిచెన్‌లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం..

ways to prevent accidents in kitchen in telugu
వంటింట్లో ప్రమాదాలు జరగకుండా.. ఇవి పాటించాల్సిందే!
author img

By

Published : Mar 2, 2021, 1:56 PM IST

మరచిపోవద్దు..

కొందరు మహిళలు వంట చేసే సమయంలో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల సందడిలో పొయ్యి మీద పాత్రలు ఉన్నాయన్న సంగతి కూడా మరచిపోతారు. లేదంటే టీవీ చూస్తూ ఉండిపోతారు. దీనివల్ల వంటపాత్రలు మాడిపోతాయి. ఆ సమయంలో వాటి నుంచి విషవాయువులు వెలువడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వంట చేసేటప్పుడు ఫోన్‌లో మాట్లాడద్దు. ఒకవేళ కచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడితే ఒకటి, రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడండి. అప్పుడు కూడా గ్యాస్ స్టవ్‌ని సిమ్‌లో పెట్టి.. పొయ్యిమీద పెట్టినవి ఎంతసేపటిలో ఉడుకుతాయో ఓ అంచనా వేసుకోండి. మీకు కిచెన్ విషయం గుర్తుండదన్న అనుమానం ఉంటే ఆ సమయానికి అలారం పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల అలారం మోగగానే పొయ్యిమీద ఉన్న వంటపాత్ర విషయం గుర్తొస్తుంది.

పిల్లలతో జాగ్రత్త..

పిల్లలకు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ. అందుకే తల్లిదండ్రులు ఏ పనులు చేస్తుంటే వారు కూడా అవే చేయాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు గ్యాస్ స్టవ్ నాబ్స్ తిప్పి పెట్టేసి వస్తుంటారు. మనం దాన్ని వెంటనే గమనించకుంటే పెద్ద ప్రమాదానికి దారి తీయచ్చు. అలాగని వారిని వంటగదిలోకి రాకుండా ఆపలేం. అందుకే వారికి కొన్ని నియమనిబంధనలు విధించాలి. అలాగే దేనివల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయో కూడా చెబుతూ ఉండాలి. అలాగే వంట చేస్తున్నప్పుడు కుక్కర్, ప్యాన్ లాంటి వంట సామగ్రి హ్యాండిల్స్‌ వీలున్నంత వరకు పిల్లలకు అందకుండా పక్కకు తిప్పి పెట్టాలి. లేదంటే వారు దాన్ని పట్టుకొని లాగడం వల్ల వేడి పదార్థాలు వారి ఒంటి మీద పడే ప్రమాదం ఉంది.

ఎలక్ట్రానిక్ వస్తువులు..

కిచెన్‌లో స్విచ్‌బోర్డ్, సాకెట్ కనెక్షన్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల షార్ట్‌సర్క్యూట్ అవకుండా చూసుకోవచ్చు. మిక్సీ, గ్రైండర్, మైక్రోవేవ్ ఒవెన్ లాంటి వస్తువులను ఉపయోగించేటప్పుడు కూడా ఆదమరిచిపోకూడదు. ఏదో ఆలోచిస్తూ స్విచ్ ఆఫ్ చేయకముందే చేశామనుకొని ఒవెన్‌లో చెయ్యి పెడితే తీవ్రమైన గాయాలవుతాయి. గ్రైండర్ తిరుగుతున్నప్పుడు కూడా దానిలో చెయ్యి పెట్టకూడదు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇండక్షన్ స్టవ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఈ స్టవ్ వారికి అందే ఎత్తులో ఉంటే స్విచ్ఆన్ చేసి ఉన్నప్పుడు పొరపాటున దానిపై చెయ్యి పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే దాన్ని వారికి అందనంత ఎత్తులో ఉంచాలి.

నూనె కింద పడకుండా..

వంటింట్లో జరిగే ప్రమాదాల్లో ఎక్కువ శాతం నూనె లేదా జిడ్డుగా ఉండే పదార్థాల వల్లనే జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో నూనె కిందపడటం. అది గమనించకుండా కాలు పెట్టడం వల్ల జారిపడే అవకాశాలు ఉంటాయి. అందుకే వీలైనంత వరకు నూనె కింద పడకుండా చూసుకోవాలి. అలాగే ఫ్లోర్ టైల్స్ కూడా మరీ నున్నగా ఉండకుండా జాగ్రత్తపడాలి.

సిలిండర్‌తో జాగ్రత్త..

వంట పూర్తయిన వెంటనే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్‌ని ఆపడం మరచిపోవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు సిలిండర్‌ మూతి పై భాగం, పైప్ ఇలా ఏ భాగం నుంచైనా గ్యాస్ లీకయ్యే ప్రమాదం ఉంటుంది. వంట పూర్తి కాగానే రెగ్యులేటర్‌ని ఆపడం వల్ల ఈ ప్రమాదాలను నివారించవచ్చు. ఒకవేళ గ్యాస్ లీకవుతున్నట్టుగా అనిపిస్తే వెంటనే సిలిండర్ ఇంటి బయట ఖాళీ ప్రదేశంలో ఉంచి సంబంధిత కంపెనీ వారికి ఫోన్ చేయాలి.

చూశారుగా కిచెన్‌లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి, మీరు కూడా వీటిని పాటిస్తారు కదూ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.