ఎన్జీవోలు తమ వెబ్‌సైట్ డెవలెప్‌మెంట్, అనువాదం, ఆడిటింగ్.. ఇలా అన్ని రకాల సేవల పొందేందుకు ఆన్‌లైన్ వాలంటీర్ల (Online Volunteers) కోసం ఎదురుచూస్తుంటాయి. క్వారంటైన్ సమయంలో తమ నైపుణ్యానికి పదును పెట్టుకోవడంతో పాటు కాలక్షేపం, సమాజ సేవ చేసే అవకాశం దీని ద్వారా పొందొచ్ఛు చెజుబా అనే ఆన్‌లైన్ మధ్యవర్తిత్వ సంస్థ ఆన్‌లైన్ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలను కలుపుతోంది. సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న వారు తమ వృత్తి నైపుణ్యం వివరాలతో చెజుబా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఇందుకు స్వచ్ఛంద సంస్థలు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవు. ఎవరూ ఏమీ ఆశించరు.. మరిన్ని వివరాలకు డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.చెజుబా.నెట్‌ను సందర్శించాలి. మొత్తం లక్ష మందికి పైగా వాలంటీర్లు పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 73 దేశాల నుంచి 5,400 ఎన్జీవోలు ఇందులో పని చేస్తున్నాయి. సోషల్ మీడియా నిర్వహించేవారు, ఆన్‌లైన్ టీచింగ్.. ఇలా రకరకాల పనులను చేయొచ్ఛు గత లాక్‌డౌన్‌లో సుమారు 1000 మంది నమోదు చేసుకోగా ఈ లాక్‌డౌన్‌లో 1500 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు సంస్థ నిర్వాహకులు సుఖేందర్ తెలిపారు.
దివ్యాంగులకు తోడ్పాటు..
కళ్లు లేని విద్యార్థులు చదువుకునేలా సబ్జెక్ట్ పుస్తకాల అంశాలను ఆడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తోంది నగరానికి చెందిన వాలంటరీ ఆర్గనైజేషన్ బృందం. ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) పుస్తకాలను అంశాల వారీగా వాయిస్ రికార్డు రూపంలో దివ్యాంగ విద్యార్థులకు అందిస్తోంది. 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పుస్తకాలకు వాయిస్ రికార్డులు అందించే కార్యక్రమం తలపెట్టింది. ఇందులో వాలంటీరింగ్ చేయాలని ఉత్సాహం చూపేవారు సంస్థ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. 97002 05150, 91777 05498, 70324 44517 ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.
ఇదీ చూడండి: వైరల్: పోలీస్‌ను చితకబాదిన గ్రామస్థులు