ETV Bharat / lifestyle

మామిడికాయ కూర... వండేద్దామా నోరూరా... ! - sunday magazine stories

మామిడికాయల సీజన్‌ వచ్చేసింది. ఈ కాలంలో వీటిని వీలైనంత ఎక్కువగా వాడితే సి-విటమిన్‌తోపాటు వడదెబ్బ తగలకుండానూ ఉంటుంది. కానీ వాటితో ఏం చేయాలో తోచక మళ్లీ అదే పచ్చడీ పప్పూ పులిహోరలతో సరిపెట్టేస్తాం. కానీ పచ్చి కాయలతోనూ చాలానే వెరైటీలు చేసుకోవచ్చు.

tasty dishes with mango
tasty dishes with mango
author img

By

Published : Mar 28, 2021, 3:00 PM IST

మామిడికాయ రసం

మామిడికాయ రసం

కావలసినవి: పచ్చిమామిడికాయ ముక్కలు: కప్పు, టొమాటో ముక్కలు: అరకప్పు, కందిపప్పు: టేబుల్‌స్పూను, ఉప్పు: సరిపడా, కరివేపాకు: 2 రెబ్బలు, ఎండుమిర్చి: మూడు, మిరియాలు: టీస్పూను, దనియాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, అల్లం తురుము: అరటీస్పూను, వెల్లుల్లి తురుము: అరటీస్పూను, ఆవాలు: టీస్పూను, పసుపు: టీస్పూను, నూనె: టీస్పూను
తయారుచేసే విధానం: బాణలిలో కందిపప్పు, మిరియాలు, దనియాలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేయాలి. ఓ గిన్నెలో పచ్చి మామిడికాయ ముక్కలు, టొమాటోలు వేసి అవి మునిగే వరకూ నీళ్లు పోసి ఉడికించి చల్లారాక గుజ్జులా చేయాలి. ఆ తరవాత అందులో సరిపడా నీళ్లు పోసి, పసుపు, అల్లం, వెల్లుల్లి తురుము వేసి కలపాలి. కందిపప్పు, మిరియాల పొడిని వేసి కూడా మరిగించాలి. తరవాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకులతో తాలింపు పెడితే సరిపోతుంది.

చట్నీ

చట్నీ

కావలసినవి: మామిడికాయ: ఒకటి(చిన్నది), కొత్తిమీర తురుము: 3 కప్పులు, పుదీనా తురుము: కప్పు, పచ్చిమిర్చి: ఆరు, అల్లం తురుము: టీస్పూను, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, ఉప్పు: రుచికి సరిపడా, ఇంగువ: కొద్దిగా, జీలకర్ర: రెండు టీస్పూన్లు.
తయారుచేసే విధానం: మామిడికాయను చిన్న ముక్కలుగా కోయాలి. కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కడిగి తరగాలి. ఇప్పుడు చిన్న బాణలిలో వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. మిక్సీ జార్‌లో మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, సగం జీలకర్ర, అల్లం, వేయించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి సరిపడా వేసి మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి ఆవాలు, ఉప్పు, జీలకర్ర, ఇంగువ వేసి వేగాక కరివేపాకు వేసి వేయించి ఈ తాలింపును పచ్చడిలో కలపాలి.

రైతా...

రైతా...

కావలసినవి: మామిడికాయ: ఒకటి, పెరుగు: రెండు కప్పులు, ఉప్పు: రుచికి సరిపడా, కారం: అరటీస్పూను, జీలకర్ర పొడి: అరటీస్పూను, ఆవపొడి: అరటీస్పూను, కరివేపాకు: రెండు రెబ్బలు, ఇంగువ: చిటికెడు, ఆవాలు: అరటీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, నూనె: టీస్పూను
తయారుచేసే విధానం: మామిడికాయ కడిగి తొక్కు తీసి సన్నగా తురమాలి. ఓ గిన్నెలో పెరుగు వేసి బాగా గిలకొట్టి, మామిడికాయ తురుము, ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసి కలపాలి. ఇప్పుడు చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక కరివేపాకు కూడా వేసి రైతాలో కలపాలి.

మామిడికాయ కూర...

మామిడికాయ కూర...

కావలసినవి: మామిడికాయలు: నాలుగు, నూనె: టేబుల్‌స్పూను, ఆవాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, యాలకులు: రెండు, దాల్చినచెక్క: అంగుళంముక్క, ఉల్లిపాయ: ఒకటి, పసుపు: టీస్పూను, కారం: టీస్పూను, కూర కారం: టీస్పూను, అల్లం-వెల్లుల్లి ముద్ద: టీస్పూను, తాజా కొబ్బరి: అరకప్పు, దనియాలు: టేబుల్‌స్పూను, ఎండుమిర్చి: రెండు, పంచదార: టీస్పూను, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం: మామిడికాయల చెక్కు తీసి ముక్కలుగా కోయాలి. కొబ్బరి, దనియాలు, ఎండుమిర్చి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. కరివేపాకు, యాలకులు, దాల్చినచెక్క, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. తరవాత పసుపు, కారం, కూర కారం వేసి కలపాలి. అల్లంవెల్లుల్లి కూడా వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించాక, మామిడికాయ ముక్కలు వేసి కలిపి కప్పు నీళ్లు పోసి సిమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు కొబ్బరి మిశ్రమం, పంచదార, ఉప్పు వేసి కలిపి సిమ్‌లో దగ్గరకు అయ్యేవరకూ ఉడికించి దించితే సరి.

గ్రీన్‌ మ్యాంగో చాట్‌...

గ్రీన్‌ మ్యాంగో చాట్‌...

కావలసినవి: మామిడికాయలు: రెండు(చిన్నవి), ఉల్లిపాయ ముక్కలు: కప్పు, కొత్తిమీర: కప్పు, వేయించిన పల్లీలు: కప్పు, ఎండుద్రాక్ష: అరకప్పు, కార్న్‌ఫ్లేక్స్‌: ఒకటిన్నర కప్పు, గరంమసాలా: టీస్పూను, ఉప్పు: తగినంత, కరివేపాకు పొడి: పావుటీస్పూను, చిదిమిన ఎండుమిర్చి పొడి: అరటీస్పూను, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి: ఒకటి, నిమ్మరసం: 2 టీస్పూన్లు
తయారుచేసే విధానం: మామిడికాయని చెక్కు తీసి చిన్న ముక్కల్లా కోసి వెడల్పాటి బౌల్‌లో వేయాలి. అందులోనే ఉల్లిముక్కలు, కొత్తిమీర తురుము, వేయించిన పల్లీలు, ఎండుద్రాక్ష వేసి కలపాలి. వీటిమీద నిమ్మరసం, నూనె, ఎండుమిర్చి పొడి, చిదిమిన వెల్లుల్లి, గరంమసాలా, కరివేపాకు పొడి వేసి కలపాలి. ఈ బౌల్‌ని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి వడ్డించే ముందు కార్న్‌ఫ్లేక్స్‌ పైన చల్లాలి.

ఇదీ చూడండి: మల్లన్న జాతరకు... యాభైవేల బోనాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.