బుజ్జాయిలకు స్నానం చేయించడం అంత తేలికైన విషయం కాదు. ఒకే సారి చెంబుతో నీళ్లు కుమ్మరిస్తే నెలల బుజ్జాయిలు గుక్క చెప్పుకోలేరు. కొద్దికొద్దిగా చిలకరించినట్టుగా పోస్తే వాళ్లకీ సౌకర్యంగా ఉంటుంది ఇందుకోసం ఈ చిన్ని షవర్ బాత్ కప్‌ను ఉపయోగించి చూడండి. పట్టుకునేందుకు వీలుగా ఉండే ఈ షవర్ కప్తో చిన్నారికి లాలపోసేయడం తేలిక.
నీలం, గులాబీ వంటి ప్రకాశమంతమైన రంగుల్లో ఉండే వీటిని చూస్తూ చిన్నారి మరింత ఆనందంగా స్నానం చేయడం ఖాయం. దీనిని తేలికగా శుభ్రం చేయొచ్చు. అలాగే ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు.