వాడటానికి పనికిరాని పాత దుస్తులను డోర్ మ్యాట్లు, యాప్రాన్లు, పరదాలకు వాడుకోవచ్చు. అంతే కాకుండా ఇంటిని అందంగా కూడా డెకరేట్ చేసుకోవచ్చు.
* డోర్ మ్యాట్...
పాత తువ్వాళ్లు, బెడ్‌షీట్స్‌ను డోర్ మ్యాట్‌లుగా మార్చుకోవచ్చు. వాటిని నచ్చిన ఆకారంలో కత్తిరించి రెండు మూడు పొరలుగా వేసి చివర్లన్నింటినీ కుడితే సరి. అలాగే మధ్యలో కూడా కుట్టాలి. వాటిని వాష్‌రూమ్‌లు, బెడ్‌రూమ్‌లో మంచం పక్కన చక్కగా వాడుకోవచ్చు.
* యాప్రాన్‌లా...
పాత కాటన్ చున్నీలు, చీరలను చక్కగా యాప్రాన్‌లా కుట్టేసి వాడేసుకోవచ్చు. దీంతో కొత్తది కొనాల్సిన ఖర్చు తప్పుతుంది.
* పరదాల్లా...
పాత సిల్కు, సన్నంచు పట్టు చీరలనూ పరదాల్లా వేస్తే గదులకు కొత్త కళ వస్తుంది.
* స్టీలు హ్యాంగర్లు తుప్పు పట్టకుండా ఉండేందుకు, అందంగా కనిపించేందుకు ఇలా చేసి చూడండి. మీరు వాడని రకరకాల రంగుల వస్త్రాలను సన్నగా కత్తిరించి హ్యాంగర్స్‌కు చుట్టేయండి. ఇవి అల్మారాలో వైవిధ్యంగా కనిపిస్తాయి.
* పాత జీన్స్ ప్యాంట్లు, షార్ట్‌లను చేతి సంచులు, వాల్ హ్యాంగింగ్, పరదాలు, దిండు గలేబులుగా మార్చి వాడుకోవచ్చు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో 'జంగిల్ బుక్' పార్క్.. ఎక్కడో తెలుసా..!