ETV Bharat / lifestyle

పుట్టగొడుగులతో నోరూరించే వంటలు - పుట్టగొడుగులతో వంటల రకాలు

శాకాహారులకు మాంసకృత్తులు అందించే పదార్థాల్లో పుట్టగొడుగులు కూడా ఒకటని తెలిసినా వాటిని ఎలా వండుకోవాలో తెలియక కొందరు కొనడం మానేస్తుంటారు. వాటితో ఇలాంటి వంటల్ని వండుకుంటే... పోషకాలకు పోషకాలు అందడంతోపాటూ కాస్త వెరైటీ రుచుల్ని ప్రయత్నించినట్లు ఉంటుంది. 

Telangana news
curry special
author img

By

Published : Jun 22, 2021, 12:46 PM IST

షెజ్వాన్‌ మష్రూమ్స్‌

కావలసినవి
పుట్టగొడుగు ముక్కలు: రెండు కప్పులు, ఉల్లిపాయ: ఒకటి, క్యాప్సికం: ఒకటి, క్యారెట్‌ తరుగు: పావుకప్పు, క్యాబేజీ తరుగు: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, మొక్కజొన్నపిండి: చెంచా (నీళ్లతో పల్చగా కలుపుకోవాలి), టొమాటోసాస్‌: రెండు చెంచాలు, షెజ్వాన్‌ సాస్‌: రెండు టేబుల్‌స్పూన్లు(బజార్లో దొరుకుతుంది), వినెగర్‌: అరచెంచా, సోయాసాస్‌: పావుచెంచా, ఉప్పు: తగినంత, నూనె: మూడు చెంచాలు, కారం: రెండు చెంచాలు, గరంమసాలా: అరచెంచా.
తయారీ విధానం
స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద, పుట్టగొడుగు ముక్కలు, క్యాబేజీ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం, క్యారెట్‌ ముక్కలు వేసి బాగా వేయించాలి. పుట్ట గొడుగు ముక్కలు మెత్తగా అయ్యాక టొమాటోసాస్‌, మొక్కజొన్నపిండి మిశ్రమం, తగినంత ఉప్పు, సోయాసాస్‌, వినెగర్‌, షెజ్వాన్‌ సాస్‌, కారం, గరంమసాలా వేసి బాగా కలిపి అయిదు
నిమిషాలయ్యాక దింపేయాలి.

మసాలా కర్రీ

కావలసినవి
పుట్టగొడుగులు: అరకేజీ, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి పెద్దది, అల్లంవెల్లుల్లి ముద్ద: మూడు చెంచాలు, టొమాటో గుజ్జు: పావుకప్పు, పసుపు: అరచెంచా, కారం: రెండు చెంచాలు, గరంమసాలా: చెంచా, ఉప్పు: తగినంత,
జీడిపప్పు పలుకులు: పావుకప్పు (పది నిమిషాలు నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి), కసూరీమేథీ: టేబుల్‌స్పూను, కొత్తిమీర: కట్ట.
తయారీ విధానం
స్టౌమీద కుక్కర్‌ని పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో గుజ్జు, పసుపు, కారం, గరంమసాలా, తగినంత ఉప్పు, పుట్టగొడుగు ముక్కలు వేసి బాగా కలిపి పావుకప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఒక కూత వచ్చాక దింపేయాలి. ఆ తరువాత ఈ కూరను మళ్లీ స్టౌమీద పెట్టి కసూరీమేథీ, జీడిపప్పు ముద్ద, కొత్తిమీర తరుగు వేసి కలిపి కాసేపయ్యాక దింపేయాలి.

గార్లిక్‌ ఫ్రై

కావలసినవి
పుట్టగొడుగు ముక్కలు: ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయముక్కలు: అరకప్పు, జీలకర్ర: చెంచా, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు: పది, ఎండుమిర్చి: అయిదు, నిమ్మరసం: ముప్పావుచెంచా, ఉప్పు: తగినంత, కారం: పావుచెంచా,
చక్కెర: పావుచెంచా.
తయారీ విధానం
ముందుగా వెల్లుల్లి, ఎండుమిర్చి, నిమ్మరసం, చక్కెర, ఉప్పు, కారం మిక్సీలో వేసుకుని నీళ్లు చల్లుతూ మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక జీలకర్ర వేయించి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగాక ముందుగా చేసిపెట్టుకున్న మసాలా వేసి కలిపి పుట్టగొడుగు ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. అవి మెత్తబడ్డాక మూత తీసి కలిపి కూర పొడిపొడిగా అయ్యాక దింపేయాలి. ఇది అన్నంలోకే కాదు, రోటీల్లోకీ బాగుంటుంది.

మష్రూమ్‌ 65

కావలసినవి

పెరుగు: అరకప్పు, బటన్‌ మష్రూమ్స్‌:ఒకటిన్నర కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, కారం: రెండు చెంచాలు, జీలకర్రపొడి: చెంచా, దనియాలపొడి: రెండు చెంచాలు, గరంమసాలా: చెంచా, మొక్కజొన్నపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, మైదా: నాలుగు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి: రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం
ఓ గిన్నెలో పెరుగు వేసి బాగా గిలకొట్టుకుని అల్లంవెల్లుల్లి ముద్ద, జీలకర్రపొడి, గరంమసాలా, కారం, దనియాలపొడి, ఉప్పు, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, మైదా వేసి అన్నింటినీ కలుపుకోవాలి. తరువాత అందులో నిమ్మరసం కూడా కలిపి కడిగి, తుడిచిన మష్రూమ్స్‌ని వేసి వాటికి పెరుగు మిశ్రమం పట్టేలా కలిపి అరగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత ఇవతలకు తీసి రెండు మూడు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

ఇదీ చూడండి: CM KCR:వరంగల్‌ గ్రామీణ, అర్బన్‌ జిల్లాలకు కొత్త పేర్లు: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.