ETV Bharat / lifestyle

Girl's Role in Boy's Life : కుర్రాడి లైఫ్‌లో అమ్మాయి ఉంటే ఎన్ని లాభాలో..! - మహిళా దినోత్సవం 2022

Girl's Role in Boy's Life : వీడియోలు లేని యూట్యూబ్‌.. వెబ్‌సైట్లు చూపని గూగుల్‌.. ఊహించడానికే ఏదోలా ఉంటాయి కదూ! స్నేహితుల్లేని జీవితమూ అంతే. అందులోనూ అబ్బాయిలకి, అమ్మాయిలతో దోస్తీ కుదిరితే ఆ ఆనందం డబుల్‌ బొనాంజానే. స్నేహితురాలు, ప్రేమికురాలు, శ్రీమతి.. పాత్ర ఏదైనా కావొచ్చు.. మగాడికి అతివ అండదండలు ఉండి తీరాల్సిందేనంటారు. మార్చి 8, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఓ కుర్రాడి జీవితంలో అమ్మాయి ఉంటే లాభాలేంటో సరదాగా చర్చిద్దామా...

Girl's Role in Boy's Life
Girl's Role in Boy's Life
author img

By

Published : Mar 8, 2022, 10:30 AM IST

Girl's Role in Boy's Life : ఒక మగాడి జీవితంలో ఆడదాని పాత్ర చాలా కీలకం. బాధలో ఉన్నవాడికి ఓదార్పుగా.. సంతోషంలో ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని డబుల్ చేస్తూ.. అవసరమైనప్పుడు మంచి సలహాలిస్తూ.. దుందుడుకుతనంగా వ్యవహరిస్తూ ట్రాక్ తప్పినవాడిని దారిలో పెడుతూ.. కూతురిగా ప్రేమను పంచుతూ.. సోదరిలా అభిమానిస్తూ.. ప్రేయసిలా ఆనందాన్న కలిగిస్తూ.. జీవితభాగస్వామిగా అనుక్షణం వెంట నడుస్తూ.. అమ్మలా లాలిస్తూ ఇలా ప్రతి దశలో ఆడది మగాడికి తోడుగా నీడగా నడుస్తుంది. అలా ఓ కుర్రాడి జీవితంలో అమ్మాయి ఉంటే అతడికి ఎంత బెనిఫిటో ఓ సారి చూద్దామా..

ఓదార్పు :

Woman's Role in Man's Life : కుర్రాళ్లకి దూకుడు ఎక్కువైతే అమ్మాయిలకు ఓపిక జాస్తి. ఏం చెప్పినా సావధానంగా వింటారు. సమస్య పరిష్కారమయ్యే ఉపాయం ఆలోచిస్తారు. కష్టం ఎక్కువైతే భుజంపై చోటిచ్చి ఓదారుస్తారు. మనసుకి నచ్చే మాట చెబితే చిన్న హగ్‌ ఇచ్చి సంతోషం రెట్టింపు చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎమోషనల్‌ సపోర్ట్‌ అమ్మాయిల దగ్గర ఎక్కువ దొరుకుతుంది.

సంతోషం :

Women's Day Speciality: కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పే కాదు.. సంతోషాలు, సరదాలు కావాలనుకున్నప్పుడూ వెనువెంటనే దొరికేది ఆడవాళ్ల దగ్గరే. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ.. అంటూ గాళ్‌ఫ్రెండ్‌తో పంచుకున్నప్పుడు వచ్చే కిక్‌ ఎక్కడా దొరకదు.

సలహాదారు :

Women's Day 2022 : ప్రేమ, పెళ్లి, కెరియర్‌ అనిశ్చితి.. ఇలాంటి సమయాల్లో మంచి సలహాలిచ్చేది గాళ్‌ఫ్రెండే. ఒకమ్మాయి మనసు ఎలా ఉంటుందో, ఎలా ఆలోచిస్తుందో మరో అమ్మాయికే తేలిగ్గా అర్థమవుతుంది. ప్రేమ, పెళ్లి విషయంలో నిరభ్యంతరంగా వాళ్ల సలహాలు తీసుకోవచ్చు. అవసరమైతే మనసు పడ్డ అమ్మాయి కోసం ఫ్రెండ్‌తో రాయబారాలు నడపొచ్చు.

షాపింగ్‌ :

Women's Day 2022 Special Story : మన డ్రెస్‌ మనకెప్పుడూ బాగానే ఉంటుంది. అది నప్పిందా? లేదా? అమ్మాయిలే బాగా చెప్పగలుగుతారు. కుర్రాడికి ఓ ఫ్రెండో, ప్రేమికురాలో ఉంటే ఆ సమస్యే ఉండదిక. పైగా షాపింగ్‌ వాళ్లకే వదిలేస్తే భారం తప్పుతుంది. ఆచితూచి కొనడంలో అమ్మాయిల్ని మించినవారు ఎవరుంటారు?

ఆలోచన :

గొడవలు, వివాదాలప్పుడు ఆలోచన లేని దుందుడుకుతనం అబ్బాయిలది. ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యల్లో ఇరుక్కుపోతుంటారు. అలాంటి సమయంలో సైడ్‌ ట్రాక్‌ పట్టినవాళ్లని వెనక్కిలాగి సరైన దారిలో పెట్టేది అమ్మాయిలే. వాళ్ల దూకుడుకి కళ్లెం వేసేది అతివలే.

అభిమానం :

అబ్బాయి నచ్చాలేగానీ అమ్మలా, సోదరిలా అభిమానం కుమ్మరిస్తుంటారు అమ్మాయిలు. క్యాంటీన్‌లో లంచ్‌బాక్స్‌లే కాదు.. గడ్డు కాలంలో కష్టాలు పంచుకుంటారు. తోచినంత సాయం చేస్తుంటారు. కుర్రాళ్ల రహస్యాలు దాస్తారు. జీవితంలో ఎదిగేలా ప్రేరణ కలిగిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.