ETV Bharat / lifestyle

మీకెంతమంది నిజమైన నేస్తాలు.. ప్రియమైన ప్రేమికులున్నారో తెలుసుకోండిలా...

author img

By

Published : Aug 22, 2020, 6:52 PM IST

అప్పటి ఆర్కుట్‌.. ఇప్పటి ఇన్‌స్టాగ్రామ్‌.. దేంట్లోనైనా ఆశించేది ఒక్కటే నెట్టింటి స్నేహం.. మరి, మీకెంత మంది సోషల్‌ లైఫ్‌ స్నేహితులున్నారు? వాళ్లలో ఫేక్‌ ఎందరు? ప్రేమని పంచేదెందరు?ఎప్పుడైనా ఆలోచించారా? ఓ సారి ఫ్రెండ్స్‌ లిస్ట్‌ని రివ్యూ చేయండి. అంతేనా.. మీరెలాంటి సోషల్‌ మీడియా ఫ్రెండో చెక్‌ చేసుకోండి. అప్పుడే.. సోషల్‌ లైఫ్‌లో నిజమైన నేస్తాలు.. ప్రియమైన ప్రేమికులు ఎంతమందని తెలుస్తుంది?

social media friends true or fake test
social media friends true or fake test

ఎక్కడ ఉంటారో.. ఏం చేస్తారో తెలియదు.. ఒక్కసారీ కలిసిందీ లేదు.. ఫ్రెండ్‌ రిక్వస్ట్‌లతో కలుస్తారు. కొన్నాళ్లకు ఎంతో మంది ఫ్రెండ్స్‌, మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌లా మారిపోతారు. కొందరైతే ప్రేమికులుగా నెట్టింట్లో విహరిస్తారు. మరికొందరు జీవిత భాగస్వాములుగా డిజిటల్‌ వరల్డ్‌ నుంచి దైనందిన జీవితంలోకి వచ్చేస్తున్నారు. అంతలా.. ఆన్‌లైన్‌ వేదికలు నేటి తరం మిలీనియల్స్‌కి దగ్గరైపోయాయి. ముఖాముఖీగా కంటే ఆన్‌లైన్‌లోనే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఓ నివేదిక ప్రకారం యువతలో 76 శాతం సోషల్‌ లైఫ్‌లో చురుకుగా ఉన్నారట. పక్కనే ఉండే బెంచ్‌మేట్స్‌ కంటే.. సోషల్‌ మీడియా ఫ్రెండ్‌తోనే నిజాయితీగా ఉంటున్నారు.

నమ్మకం కలగాలి

డిజిటల్‌ మాధ్యమం ఏదైనా స్నేహం కోరి మాటకలిపితే అభిరుచులు ఒక్కటో కాదో చెక్‌ చేసుకోవాలి. ఆలోచనలు, అభిప్రాయాలు కలిస్తే ఒక అడుగు ముందుకేయొచ్చు. అదీ మీకు ధైర్యం ఉంటేనే! మీరు ఊహించని పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలనని అనిపిస్తేనే సోషల్‌ మీడియా స్నేహానికి చెయ్యందించాలి.

‘రచ్చ’ చేయొద్దు

స్నేహం కుదిరింది. ఛాటింగ్‌లు.. షేరింగ్‌లు అయ్యాయి. ఇరువురూ కలుద్దాం అనుకున్నారు. కలిసారు. కానీ, ఎక్కడో ఇద్దరికీ సెట్‌ కాదని అనిపించింది. ఇరువురిలో ఏ ఒక్కరికి ఇలా అనిపించినా హుందాగా స్నేహాన్ని కట్‌ చేసుకోవాలి. అంతేకానీ.. రచ్చ చేసే ఉద్దేశాలు మనసులో పెట్టుకోవద్దు. గతంలో పంచుకున్న వాటిని బహిర్గతం చేస్తూ ఇతరుల ప్రైవసీని నెట్టింట్లో పెట్టొద్దు.

హద్దులు దాటకుంటే మేలే

ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న డేటింగ్‌ యాప్‌లు తోడుని వెతుక్కోవడంలో ఇన్‌స్టెంట్‌ మార్గాలయ్యాయి. అవసరాలు అభిరుచులకు తగిన వారిని సెలెక్ట్‌ చేసుకుని స్నేహితులవుతున్నారు. అయితే, ఎంత దగ్గరైనా హద్దులు దాటకూడదనే నియమం పెట్టుకోవాలి. ముఖ్యంగా డబ్బు సాయం చేయడం, శారీరకంగా దగ్గరవడం లాంటివి చేస్తే చిక్కుల్లో పడతారు. స్నేహం, ప్రేమ ఏదైనా.. కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకుని ఒకే చెప్పడం శ్రేయస్కరం. ఆన్‌లైన్‌ స్నేహాల్లో తొందరపాటు వద్దు.

ప్రేరేపిస్తారు.. జాగ్రత్త

ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకున్న మొదట్లో ఎవరు ఆహ్వానం పంపినా ‘ఓకే’ చేసేస్తారు. ఇలా ఫ్రెండ్‌ లిస్ట్‌లోకి వచ్చిన వారు మీతో ముచ్చటిస్తూ వ్యక్తిగత వివరాల్ని కోరుతూ ఒత్తిడి తెస్తారు. మాటల్లోకి దిగిన వెంటనే ఫోన్‌ నెంబర్‌ని కోరితే కాస్త ఆలోచించాలి. అంతేకాదు.. బయటికి రావాలని కోరతారు. అదీ రాత్రి సమయంలో ఏదైనా లొకేషన్‌ని చెప్పి అక్కడికి రావాలంటూ ప్రేరేపిస్తున్నట్లయితే ప్రొఫైల్‌ని బ్లాక్‌ చేయడం మంచిది.

నియమాలు ఉండాలి

ప్రియ మిత్రులుగా బంధాన్ని కొనసాగిస్తున్నప్పటికీ సోషల్‌ లైఫ్‌లో కొన్ని నియమాలు పాటించాలి. నెట్టింట్లో ఒకరి ప్రైవసీని మరొకరు కాపాడేలా పోస్టింగ్స్‌ చేయాలి. ‘నా ఫ్రెండే కదా.. ఏం అనుకోదులే’ అనుకుంటే పొరబాటే. ఎందుకంటే.. మీరు పోస్ట్‌ చేసేది ఏదైనా ఇతరుల కోణంలో అదెలాంటి ప్రభావం చూపిస్తుందో చెప్పలేం. మితిమీరి చేసే షేరింగ్స్‌ వల్ల ఇతరుల కెరీర్‌పై నెగిటివ్‌ ప్రభావాన్ని చూపించొచ్చు.

‘టైమ్‌పాస్‌’ చేస్తారు..

ఏదో ఒక డేటింగ్‌ యాప్‌లో లాగిన్‌ అవ్వడం.. ప్రొఫైల్‌ని క్రియేట్‌ చేయడం.. ఫ్లర్ట్‌ చేయడం. ఇదే పనిగా టైమ్‌పాస్‌కి స్నేహం పేరుతో చేయందించేవారు ఎక్కువే. వర్చువల్‌, వాస్తవ ప్రపంచం దేంట్లోనైనా ఇతరుల ఎమోషన్స్‌తో ఆడుకోవడం అనైతికం.

- రత్న, గ్రాఫిక్స్‌ డిజైనర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.