ETV Bharat / lifestyle

విడిపోయి... కలిసుండడం మంచిదేనా? - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

ప్రేమ పెళ్లి... పెద్దలు కుదిర్చిన పెళ్లి ఏది అయినా భార్యభర్తల మధ్య గొడవలు సహజం. చిన్నవాటినే పెద్దగా చేసుకొని తరుచుగా పోట్లాడుకునేవారూ లేకపోలేదు. కొందరికి పెద్ద వాళ్లు జోక్యం చేసుకొని సర్ది చెప్తుంటారు. ఈ రకమైన సర్దుబాటు మంచిదేనా? ఒక వ్యక్తిలో రాత్రికి రాత్రే మార్పు వస్తుందా? అనే దానిపై మానసిక నిపుణులు ఏమంటున్నారంటే..!

psychiatrists-told-about-wife-and-husband-problems
విడిపోయి... కలిసుండడం మంచిదేనా?
author img

By

Published : Dec 27, 2020, 1:14 PM IST

ప్రేమించి పెళ్లి చేసుకున్నా... పెళ్లి చేసుకుని ప్రేమించుకున్నా కలకాలం కలిసి ఉండాలంటే ఏదో ఒక సందర్భంలో సర్దుబాటు ధోరణి తప్పనిసరి. ఏ జంటకైనా చిన్న చిన్న గొడవలు సహజం. అయితే వాటినే పెద్దగా చేసుకుని తీవ్రంగా పోట్లాడుకుని విడిపోయేవాళ్లూ ఉంటారు. అలాంటి జంటల్లో పెద్దవాళ్లు జోక్యం చేసుకుని సర్ది చెప్పి మళ్లీ కలిసేలా చేస్తుంటారు. ఆ రకమైన సర్దుబాటు వల్ల పెద్ద ఉపయోగం ఉండదనీ అది వృథా ప్రయాసేననీ అంటున్నారు మానసిక నిపుణులు. ఆ క్షణానికి వాళ్లు సరేనన్నా తరవాత్తరవాత మళ్లీ పాత గొడవలన్నీ గుర్తు తెచ్చుకుని నీ వల్లే అంటే నీ వల్లే అప్పుడలా అయిందని ఒకరినొకరు విమర్శించుకోవడం వల్ల ఇద్దరిలోనూ విపరీతమైన మానసిక ఒత్తిడి పెరిగిపోతుందట.

ఎందుకంటే- రాత్రికి రాత్రి ఏ వ్యక్తి ప్రవర్తనా మారిపోదు. కాబట్టి గతంలో ఇద్దరి మధ్యా వచ్చిన విభేదాలే మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం లేకపోలేదు. అప్పుడు ఛ... అనవసరంగా వాళ్ల మాట విని వచ్చామే అన్న భావన బలపడిపోయి, మానసిక సంఘర్షణకు లోనవుతుంటారు. దానివల్ల ఇద్దరూ ప్రశాంతంగా ఉండలేరు, అంతగా ఒకరికొకరు కావాలనిపిస్తే- వాళ్లంతట వాళ్లే మాట్లాడుకుని పాత తగాదాలకు దారితీసిన పరిస్థితుల్ని విశ్లేషించుకుని మరోసారి అలాంటివి తలెత్తకుండా చూసుకుందామనుకోవాలి. కాబట్టి తీవ్రంగా పోట్లాడుకుని విడిపోయిన వాళ్లు మరోసారి కలిసి జీవించాలనుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు మానసిక విశ్లేషకులు.

ఇదీ చదవండి: న్యూ ఇయర్ పార్టీ విందు.. భలే పసందు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.