స్త్రీలను తమవైపు మళ్లించుకోవడానికి కొందరు ఇలాగే ప్రేమ కబుర్లు వల్లిస్తారు. మాయమాటలు, పొగడ్తలతో ప్రలోభపెడ్తారు. దాంతో వీళ్లూ ఆకర్షితులవుతారు. అన్నీ ఆలోచించే కదా పెళ్లి చేసుకుంటారు. మీ బావ ఇప్పుడు వక్రబుద్ధి చూపుతున్నాడంటే రేపు మీ కంటే అందమైన పిల్ల కనిపిస్తే అటు మళ్లుతాడు. అతనికి మనసు నిలకడ, పెళ్లి పట్ల విలువ, నమ్మకం లేవని అర్థమవుతోంది. ఏది అందంగా కనిపిస్తే దాన్ని సొంతం చేసుకోవాలనే తత్వం కనిపిస్తోంది. ఆ మాటలు నమ్మితే మీకు అనర్థమే.
అందరూ మిమ్మల్నే తప్పు పడతారు. అక్కాబావలు తల్లిదండ్రులతో సమానమని గుర్తుచేయండి. ‘అక్కతో పెళ్లయింది, తనతోనే నీ జీవితం, నేను వచ్చే ప్రసక్తి లేదు, అమ్మానాన్నా చూసినతన్నే చేసుకుంటాను’ అని స్పష్టంగా చెప్పండి. అప్పుడతను మీమీద ఆశలు పెట్టుకోడు. మీకూ అటువైపు మనసు మళ్లదు. అయినా మారకపోతే మీ వాళ్లతో ఈ విషయం చెప్పడం మంచిది. మీ చదువూ లేదా ఉద్యోగం మీద ధ్యాస పెట్టండి. ఇలాంటి వ్యక్తులు మీతో కాకపోతే ఇంకెవరితోనైనా ఇలాగే చేస్తారు. ఇది మీ అక్కా బావల జీవితం, వాళ్లు నిర్ణయించుకోవాలి. అందులో మీ పాత్ర ఉండకూడదు.
ఇదీ చూడండి: WEIGHT LOSS: నడవకుండా బరువు తగ్గేందుకు టిప్స్