ETV Bharat / lifestyle

కరోనా కోరల్ని లెక్కచేయని తల్లి.. బిడ్డకు పునర్జన్మనిచ్చింది... - mother gave rebirth to her child

సముద్రం-అల... చెట్టు-వేరు... జాబిలి-వెన్నెల... ఇవి వేర్వేరుగా కనిపించినా వీటిని విడదీయలేం. తల్లీబిడ్డల బంధమూ అలాంటిదే. బిడ్డకి ఏ చిన్న కష్టం వచ్చినా తల్లి విలవిల్లాడిపోతుంది. మరి ముక్కుపచ్చలారని పసిబిడ్డకు ప్రాణాపాయమని తెలిస్తే ఊరుకోగలదా... అందుకే బిడ్డ చికిత్స కోసం కరోనా కోరల్ని లెక్కచేయకుండా రాంచీ నుంచి హైదరాబాద్‌ చేరిందా తల్లి. తన కాలేయం ఇచ్చి బిడ్డకి పునర్జన్మనిచ్చింది.

Mother came from ranchi to Hyderabad
బిడ్డకు పునర్జన్మనిచ్చిన తల్లి
author img

By

Published : Sep 28, 2020, 10:39 AM IST

మే రెండో వారంలో కొవిడ్‌ భయంతో అందరూ ఇళ్లకే పరిమితమైతే.. రాంచీకి చెందిన సంయుక్త, అభిషేక్‌... తమ మూడు నెలల బిడ్డ అభ్యాన్ష్‌ చికిత్స కోసం హైదరాబాద్‌ బయలుదేరారు. అభిషేక్‌ బైక్‌ మెకానిక్‌, సంయుక్త స్టాఫ్‌ నర్స్‌. వారి మొదటి సంతానం అభ్యాన్ష్‌. పుట్టిన కొద్దిరోజులకే బిడ్డకు కామెర్లు వచ్చాయి. ఎంతకీ తగ్గకపోవడంతో మరిన్ని పరీక్షలు చేయిస్తే బిడ్డ అత్యంత అరుదైన బైలరీ అట్రెషియాతో పుట్టాడని తెలిసింది. దాదాపు 15-20వేల నవజాత శిశువుల్లో ఒక్కరికే ఈ లోపం ఉంటుంది. జీర్ణక్రియలో ముఖ్యమైన బైల్‌ ద్రావణం కాలేయంలో ఉత్పత్తై జీర్ణాశయంలోకి చేరాలి. కానీ అభ్యాన్ష్‌ కాలేయం ఆ పని చేయడంలేదు. దాంతో కాలేయ మార్పిడికి లఖ్‌నవూ, హైదరాబాద్‌లలో ఏదోక చోటుకి వెళ్లమన్నారు స్థానిక డాక్టర్లు. విషయం తెలిసి ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చింది. ఎలాగైనా కొడుకుని బతికించుకోవాలనుకుంది. లఖ్‌నవూలో కొవిడ్‌ కారణంగా శస్త్రచికిత్సలు చేయట్లేదు. దూరమైనా హైదరాబాద్‌ వెళ్లక తప్పదు. దాంతో కేర్‌ హాస్పిటల్స్‌ని సంప్రదించారు. లాక్‌డౌన్‌వల్ల కొన్నాళ్లు ఆగమన్నారు.

ఆ సమయంలో కామెర్లు తగ్గకపోగా జ్వరమూ వస్తుందని చెప్పడంతో వెంటనే రమ్మన్నారు వైద్యులు. లక్షల్లో ఖర్చవుతుంది. కానీ అంత మొత్తం వారి దగ్గర లేదు. ఆ విషయమే ఆసుపత్రివర్గాలకు చెప్పి తమ బిడ్డను బతికించమని కోరిందా తల్లి. ఆమె కష్టాన్ని అర్థం చేసుకున్న ఆసుపత్రి బృందం ‘క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ప్రయత్నిద్దాం, మీరైతే బయలుదేరండి’ అని చెప్పి వారి ప్రయాణానికి అనుమతి ఇవ్వాలంటూ లెటర్‌ కూడా పంపారు. రాంచీ నుంచి హైదరాబాద్‌కు సాధారణంగా కార్లో 27-28 గంటల్లో రావొచ్ఛు కొవిడ్‌ కారణంగా అడుగడుగునా చెక్‌పోస్టులు ఉండటంతో 48 గంటలు పట్టింది. ఆ ప్రయాణంలో ఏమైనా తినాలనే ధ్యాస కూడా లేకుండా ఎంత త్వరగా హైదరాబాద్‌ చేరుకుంటామా అని మాత్రమే ఆలోచించారు. వచ్చిన వెంటనే ముగ్గురినీ ఐసోలేషన్‌లో ఉంచి కొవిడ్‌ పరీక్ష నిర్వహిస్తే నెగిటివ్‌ వచ్చింది. హాస్పిటల్‌ వర్గాలే క్రౌడ్‌ ఫండింగ్‌ కోసం ప్రయత్నించాయి. ఎన్నో మనుసులు స్పందించడంతో కావాల్సిన మొత్తం నాలుగు రోజుల్లోనే సమకూరింది.

ఉదరంలో చోటు సరిపోలేదు

చిన్నారుల రక్తనాళాలు ఎంతో సున్నితంగా ఉండటంతోపాటు దాతల కాలేయాన్ని వారి ఉదరంలో ఉంచేందుకు తగినంత చోటూ ఉండదు. సర్జరీ సమయానికి అభ్యాన్ష్‌ చాలా నీరసంగా, అయిదు కిలోల బరువుతో ఉన్నాడు. విజయావకాశాలు 75 శాతం మాత్రమేనని చెప్పినా, చికిత్సకు అంగీకరించారు తల్లిదండ్రులు. ఇద్దరినీ పరీక్షించాక దాతగా తల్లినే ఎంచుకున్నారు. ఎంతైనా పేగుబంధం కదా! మరోసారి కొవిడ్‌ పరీక్ష చేసి నెగిటివ్‌ అని తేలాక సిద్ధమయ్యారు. డాక్టర్‌ మహ్మద్‌ అబ్దున్‌ నయీమ్‌ ఆధ్వర్యంలో చికిత్స మొదలైంది. కాలేయంలో ఎనిమిది భాగాలు ఉంటాయి. గ్రహీతకు వాటిలో కనీసం రెండింటి అవసరం ఉంటుంది. అభ్యాన్ష్‌ ఉదరం మరీ చిన్నగా ఉండటంతో ఒకటిన్నర భాగాన్నే పెట్టారు. అయినా సరిపోకపోవడంతో కుట్లు ఒకేసారి వేయకుండా, కొంతమేర వేసి మిగతా భాగానికి కొన్ని గంటల తర్వాత వేశారు. కాలేయానికి రక్తం సరఫరా చేసే నరం సరిగ్గా ఎదగకపోవడంతో జంప్‌ గ్రాఫ్ట్‌నీ వినియోగించారు. ఇది అత్యంత అరుదైన అంశం. ఇంతమంది ప్రయత్నాలకు ఆ తల్లి ప్రార్థనలూ ఫలించి సర్జరీ విజయవంతమైంది.

‘ప్రసవానంతరం బిడ్డను గుండెలకు హత్తుకుని.. అప్పటివరకూ అనుభవించిన నరకయాతనను క్షణాల్లో మర్చిపోతుంది తల్లి... నేనూ అంతే. పండంటి బిడ్డను చూసుకుని ఎంతో మురిసిపోయా. కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. బిడ్డ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసి రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. బాబు నిద్రపోతుంటే అర్ధరాత్రి... ఊపిరి సరిగా ఆడుతుందో.. లేదోనని గమనించేదాన్ని. చికిత్స కోసం హైదరాబాద్‌కు బయలుదేరినపుడు హాస్పిటల్‌కి ఎంత త్వరగా చేరుకుంటామా... బాబుని ఎంత త్వరగా రక్షించుకుంటామా అని గుండెల్ని అరచేతిలో పెట్టుకుని ఎంతో ఆత్రంగా ఎదురుచూశా.

శస్త్రచికిత్స తర్వాత ఆరు రోజుల పాటు బాబూ, నేను వేర్వేరుగా ఉన్నాం. నేను పాలివ్వడానికి లేకపోవడంతో ఆవుపాలు, గ్లూకోజ్‌ పట్టారు. ఆ సమయంలో ఎంతో బాధ వేసింది. ఆ తర్వాత మెల్లగా కోలుకుంటున్న వాడి వీడియోలను చూసి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నా. దేవుడి దయ, డాక్టర్ల కృషి, దాతల మంచి మనసు వల్ల బిడ్డ మళ్లీ నా ఒడిలోకి చేరుకున్నాడు. సర్జరీ తర్వాతే మొదటిసారి వాడి మెహంలో పరిపూర్ణమైన నవ్వును చూశాను. మానవత్వమున్న ఎంతోమంది ఓ తల్లి కన్నీటిని తుడిచారు. నేను ఎన్ని రకాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నా.. వారి మంచితనం ముందు తక్కువే’ అంటోంది సంయుక్త.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.