ETV Bharat / lifestyle

Lockdown Love: లాక్​డౌన్​లో ప్రేమికుల ఫీలింగ్స్​ ఇవే! - lockdown love stories

ఒకర్నొకరు కలుసుకోవడాలు లేవు.. మనసు విప్పి మాట్లాడుకుంది లేదు. లాక్‌డౌన్‌తో కుర్ర ప్రేమికులు నిన్నటిదాకా పడిన పాట్లు ఎన్నో. ఈ సమయంలో మీ ఫీలింగ్స్‌ ఏంటి? అంటూ ప్రముఖ డేటింగ్‌ యాప్‌ పెద్దఎత్తున సర్వే చేసింది. మీ లైఫ్‌స్టైల్‌ ఎలా మారిపోయింది? అంటూ అడిగింది. మన మిలీనియల్స్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలివి.

lovers feelings in lockdown
Lockdown Love: లాక్​డౌన్​లో ప్రేమికుల ఫీలింగ్స్​ ఇవే!
author img

By

Published : Jun 26, 2021, 11:06 AM IST

  • చేతిలో చేయి వేసుకొని, కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ కబుర్లు చెప్పుకుంటేనే కాదు.. ఎంతో దూరంలో ఉన్నా, మనసు విప్పి మాట్లాడుకునేదే నిజమైన ప్రేమ అని 91శాతం యువత సెలవిచ్చారు.
  • వలచిన చెలికాడు, మనసుకి నచ్చిన నెచ్చెలిని కలుసుకోవాలని ఉబలాటంగా ఉన్నా.. 58 శాతం మంది పరిస్థితులన్నీ సానుకూలంగా మారిన తర్వాత ఆ పని చేస్తామని చెప్పారు.
  • ఆన్‌లైన్‌ బ్రౌజింగ్‌ లేదా డేటింగ్‌ యాప్‌లతో మనసుకి నచ్చినవాళ్లు దొరికేశారని 38 శాతం మిలీనియల్స్‌ నొక్కి వక్కాణించారు.
  • ఇప్పటికిప్పుడు లవర్‌ని కలుసుకునే అవకాశం వస్తే ఏం చేస్తారని అడిగితే.. 41శాతం డిన్నర్‌ చేస్తామనీ, 22శాతం మంది సినిమాకు వెళ్తామని మనసులో మాట వెల్లడించారు.
  • మానసికంగా ఒకర్నొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత డేటింగ్‌, రొమాన్స్‌ ముచ్చట్లంటూ 85శాతం పడుచు ప్రాయులు ముసిముసిగా నవ్వారు.
  • ఎంత దూరంలో ఉన్నా ఫోన్లు, వీడియో చాటింగ్‌లతో మేం చేరువ అవుతామన్నది ఈ ఆధునిక ప్రేమికుల మాట.
  • వర్చువల్‌ ప్రేమలో మునిగి తేలడమే కాదు.. ఈ లాక్‌డౌన్‌లో పాకశాస్త్రంలో పాఠాలు నేర్చుకున్నామని 42శాతం అమ్మాయిలు, 39శాతం అబ్బాయిలు గర్వంగా చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.