ETV Bharat / lifestyle

తొలి రాత్రే నా కాళ్లు, చేతులు కట్టేసి నన్ను రేప్‌ చేశాడు! - మహిళ విజయగాథ

ఆడపిల్లను బాధ్యతగా కంటే బరువుగా భావించే తల్లిదండ్రులూ నేటి సమాజంలో ఉన్నారు. అందుకే వయసులోకి రాకముందే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసి ఆ బరువు దించుకుంటున్నారు. వారు అక్కడ చిత్రహింసలకు గురైనా అత్తారింట్లో ఇవన్నీ కామనే అని వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదిగో తనదీ అచ్చం ఇలాంటి పరిస్థితే అంటోంది కేరళలోని క్యాలికట్‌కు చెందిన జాస్మిన్‌ ఎం మూస.

Ideal fitness trainer for women
ఆదర్శంగా నిస్తున్న మహిళ
author img

By

Published : Apr 30, 2021, 3:34 PM IST

చదువుకోవాల్సిన వయసులో తన తల్లిదండ్రుల బలవంతంతో బాల్యవివాహం చేసుకొని అష్టకష్టాలను అనుభవించిందామె. రెండో పెళ్లీ చేదు అనుభవాలనే మిగిల్చింది. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె.. తనకోసం తాను బతకాలనుకుంది.. తన నుంచి తన జీవితాన్ని ఎవరూ తీసుకుపోలేరని దృఢంగా నిశ్చయించుకొని అడుగు ముందుకేసింది. ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ‘జీవితంలో మనం తీసుకునే ఓ మంచి నిర్ణయం మొత్తం జీవితాన్నే మలుపు తిప్పుతుందం’టోన్న ఆమె తన కథను కొన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా అది వైరలైంది. ఎంతోమందిలో స్ఫూర్తిని కలిగిస్తోంది.

స్కూల్లో పాఠాలు, స్నేహితులతో ఆటపాటలు, తోబుట్టువులతో సరదాలు, అలిగితే బుజ్జగించే అమ్మానాన్నలు.. ఇలా సరదాగా సాగిపోయే బాల్యమంటే ఎవరికైనా మంచి జ్ఞాపకమే! ఇవన్నీ కాకపోయినా నా చిన్నతనంలోనూ నాకు కొన్ని బాల్య స్మృతులు ఉన్నాయి. కేరళలోని క్యాలికట్‌ దగ్గర ఓ చిన్న గ్రామం మాది. 17 ఏళ్లొచ్చే వరకు స్కూల్లో, మా ఇరుగుపొరుగు వారితో ఎంతో సంతోషంగా, సరదాగా సమయం గడిపేదాన్ని. ఈ క్రమంలోనే ఓ రోజు స్కూల్ నుంచి ఇంటికొచ్చేసరికి.. మా ఇల్లంతా కొంతమంది అతిథులతో నిండిపోయింది. మాకు తెలిసిన దూరపు చుట్టాలేమో అనుకున్నా.. కానీ ఆ తర్వాత తెలిసింది. వారు నన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చారని!

నేను చేసుకోనంటే చేసుకోనన్నా!
అప్పుడు నా మనసులో ఒకటే ఆందోళన! ‘ఈ వయసులో నాకు పెళ్లేంటి నాన్నా? అయినా నేను అందుకు సిద్ధంగా లేను’ అని నాన్నతో నేరుగా చెప్పేశా. అయినా వారు వినిపించుకుంటేగా..? నా మాటలు వినకుండా, నా మనసులో ఏముందో తెలుసుకోకుండానే పెళ్లి ఖాయం చేశారు. వారంలో నిశ్చితార్థం, మరో మూడు రోజుల్లో పెళ్లి.. అన్నీ చూస్తుండగానే జరిగిపోయాయి. నిజానికి నేను పెళ్లి కొడుకుని మొదటిసారి చూసింది పెళ్లి మండపంలోనే! ఆ రాత్రి మాకు మొదటి రాత్రి. తను గదిలోకి రాగానే తన ప్రవర్తన ఏదో తేడాగా అనిపించింది. ఎకాఎకిన వచ్చి నన్ను బలంగా కిందికి తోసేశాడు. నన్ను ఆక్రమించుకున్నాడు. దాంతో ఏదో తెలియని భయం నన్ను ఆవహించింది. అరిచినా, కేకలు పెట్టినా నాకు సహాయం చేసే వారే కరువయ్యారు. నిజానికి ఇదంతా మా ఏరియాలో కామన్‌. నేనే కాదు.. నాలా ఎంతోమంది అమ్మాయిలు చిన్న వయసులోనే వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు.. తొలిరాత్రే ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు.

ఆ నిజం తెలిసి షాకయ్యా!
ఆ ఒక్క రాత్రి అనే కాదు.. రోజూ రాత్రి నన్ను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇలా కొన్ని నెలల పాటు భరించా. అప్పుడు నాకు మరో నిజం తెలిసింది. అతడు ఆటిజం బాధితుడని! ఇది తెలిసి షాకయ్యా! ఈ చిత్రహింసలు భరించలేనని, అతడితో జీవితాన్ని కొనసాగించడం నా వల్ల కాదని ఇరు కుటుంబ సభ్యులను సంప్రదించి అతడి నుంచి విడాకులు తీసుకున్నా. ఇలా భర్తతో విడిపోయిన అమ్మాయంటే ఎవరికైనా చులకనే! నా చుట్టూ ఉన్న సమాజం కూడా నన్ను ఇదే దృష్టితో చూసింది. అది భరించలేకపోయిన అమ్మానాన్నలు నాకు మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ నాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. అయినా నా పేరెంట్స్‌ పట్టుబట్టారు. అలా అయితే నాకు నచ్చిన వ్యక్తినే, అదీ నేను అతడితో మనసు విప్పి మాట్లాడాకే పెళ్లి చేసుకుంటానని నాన్నకు ముందే కండిషన్‌ పెట్టా. అందుకు ఆయనా సరేనన్నారు.

తొలి రాత్రే రేప్‌ చేశాడు!
దీంతో అమ్మానాన్న చూసిన అబ్బాయితో మనసు విప్పి మాట్లాడాను. నా గత జీవితం గురించీ అతడితో చెప్పా. అన్నింటికీ సరేననడంతో పెళ్లికి ఓకే చెప్పా. ఇక నా జీవితంలోని కష్టాలన్నీ తీరిపోయినట్లేనని సంబరపడిపోయా. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టా. అయితే ఈ బంధం కూడా నా జీవితంలో కష్టాలు, కన్నీళ్లనే మిగుల్చుతుందని నేను అప్పుడు ఊహించలేకపోయా. తొలిసారిలాగే మొదటి రాత్రి కాస్త సిగ్గు, బిడియంతోనే గదిలోకి అడుగుపెట్టా. అతను నా దగ్గరికొస్తుంటే ఏదో తెలియని బెరుకు! అంతలోనే నా చెంప ఛెల్లుమనిపించే సరికి ఒక్కసారిగా ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. అది తెలుసుకునేలోపే అతడు నా చేతులు, కాళ్లు కట్టేయడం, రేప్‌ చేయడం అన్నీ జరిగిపోయాయి. కనీసం నాకు ఇష్టమా, కాదా? అసలు నా మనసేంటో తెలుసుకోకుండా ఆ ఒక్కసారే కాదు.. ఇలా ఎన్నోసార్లు నాపై అత్యాచారం చేశాడు. అందుకు ఫలితంగా నేను గర్భం ధరించా. నా కడుపులో బిడ్డ పెరుగుతున్నాడని చెబితే మారిపోతాడేమో అనుకున్నా. కానీ అది మనసు కాదు.. బండరాయి అని తెలుసుకోలేకపోయా.

జీవచ్ఛవంలా మిగిలిపోవాలనుకోలేదు!
నేను గర్భవతిని అని ఎంత సంతోషంగా నా భర్తతో చెప్పానో.. నా జీవితంలో అంత విషాదాన్ని నింపాడతను. నా కడుపు మీద తన్నాడు. దాంతో తీవ్ర రక్తస్రావం, ఆపై అబార్షన్‌ కూడా జరిగిపోయింది. దాంతో నా మనసు మరోసారి ముక్కలైంది. ఇక అతడితో జీవించలేనని విడాకులు తీసుకున్నా. గృహహింస చట్టం కింద అతడిపై కేసు కూడా పెట్టా. అప్పటికే నన్ను నేను పూర్తిగా కోల్పోయానన్నంత బాధలో ఉన్న నేను ఒక దశలో దేశం విడిచి వెళ్లాలనుకున్నా. కానీ అమ్మానాన్న అందుకు ఒప్పుకోకపోవడంతో ఇక్కడే ఉండిపోయా! అలాగని జీవచ్ఛవంలా బతకడం నాకు ఇష్టం లేదు. ఎలాగైనా ఈ చేదు అనుభవాల నుంచి బయటపడాలని బలంగా నిశ్చయించుకున్నా. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా దృఢంగా మారేందుకు కొచ్చిలోని ఓ జిమ్‌లో జాయినయ్యా. అందులో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తూనే ఫిట్‌నెస్‌ మెలకువలు నేర్చుకున్నా. నా కథ తెలుసుకొని అక్కడికొచ్చే వారు నన్ను ప్రోత్సహిస్తూ నాలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేసేవారు.

ఒక్క మంచి నిర్ణయం చాలు!
ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రొఫెషనల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా మారాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే సర్టిఫికేషన్‌ కోర్సులో భాగంగా బెంగళూరుకు మకాం మార్చా. ఇదే సమయంలో డబ్బు విషయంలో ఇబ్బంది పడకూడదని అక్కడి రెస్టరంట్లు, కేఫ్‌లలో పార్ట్‌-టైమ్‌ జాబ్‌ చేసేదాన్ని. ప్రస్తుతం నేను ఇక్కడే లెవెల్-3 ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా కొనసాగుతున్నా. ఇప్పుడు నాకంటూ ఓ ఉద్యోగం ఉంది. ఓ గుర్తింపు ఉంది. నన్ను నన్నుగా సపోర్ట్‌ చేసే వారు నా చుట్టూ ఎంతోమంది ఉన్నారు.

జీవితం అనుకూలించక నాలాగే కష్టాలొచ్చిన వారు, గృహహింసను ఎదుర్కొంటున్న వారు ఎందరో ఉన్నారు. వారిలో చాలామంది హింసను భరించలేక ఎంతో అమూల్యమైన జీవితాల్ని మధ్యలోనే చాలిస్తున్నారు. అలాంటి వారందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. మన జీవితంలో అన్ని రోజులూ మనకు అనుకూలంగా ఉండవు.. అలాగని ప్రతికూలంగానూ ఉండవు.. సానుకూల సమయం వచ్చే వరకు ఓపికతో నిరీక్షించాల్సిందే! అలాకాకుండా క్షణికావేశంలో మనం తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలు మన ఉనికినే లేకుండా చేస్తాయి. అదే సానుకూలంగా ఆలోచించి ఒక్క మంచి నిర్ణయం తీసుకున్నా.. అది మన జీవితాన్నే మలుపు తిప్పుతుంది. నా జీవితమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ!

ఇదీ చదవండి: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.