ETV Bharat / lifestyle

క్షణక్షణానికి మారే పిల్లల మూడ్​.. అర్థం చేసుకోవాలంటే.! - how to behave with children

చిన్నపిల్లలు మాటిమాటికీ అలుగుతుంటారు. అడిగింది ఇవ్వకపోయినా.. వారిని పట్టించుకోకపోయినా అలకపాన్పు ఎక్కుతారు. అలాంటి పరిస్థితుల్లో వారిని బుజ్జగించడం తల్లిదండ్రులకు కత్తి మీద సామే. ఆ సమయంలో వారి కోపాన్ని తగ్గించడానికి వారు అడిగిందల్లా ఇస్తారు. కానీ కొంచెం ఓపిగ్గా ఉంటే వారి కోపాన్ని చిటికెలో తీర్చేయొచ్చు. అదెలాగో చూడండి.

how to behave with children
పిల్లల కోపాన్ని తగ్గించాలంటే
author img

By

Published : Jun 28, 2021, 2:19 PM IST

పిల్లల మానసిక పరిస్థితులను ఊగే ఊయలతో పోల్చవచ్చు. ఎందుకంటే అది ఒక చోట కుదురుగా ఉండదు కదా.. అలానే వారి మూడ్‌ కూడా క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. చిన్న విషయాలకే ఎక్కువగా కోపం, విసుగు ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులుగా వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి.

తిట్టొద్దు... కొట్టొద్దు!

అసలే కోపంతో ఉన్న పిల్లలను కోప్పడటమో, కొట్టడమో చేయద్దు. ఇలా చేస్తే అగ్నికి ఆజ్యాన్ని పోసినట్లే అవుతుంది. ఇలాంటి సమయంలో మీరే కొంత సంయమనం పాటించాలి. పిల్లలు కోపంగా ఉన్నప్పుడు మీరు కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత వారి కోపానికి కారణమేంటో కనుక్కోవాలి. వాటిని అప్పటికప్పుడు పరిష్కరించకపోయినా... క్రమంగా వారి భావోద్వేగాలను అదుపుచేసుకోగలిగే సమర్థతను వారికి నేర్పాలి.

అన్నదల్లా తీర్చొద్దు...

తాము అడిగినవి అమ్మానాన్నలు కాదన్నారని టీనేజర్లకు కోపం వస్తుంటుంది. అయితే వారు అడిగనవన్నీ చేసుకుంటూ పోవద్దు. అవసరం, ప్రాధాన్యత ఆధారంగానే...వాటిని తీర్చాలి.

పూర్తిగా వినండి...

పిల్లల కోపాన్ని చూసీ చూడనట్లు వదిలేయొద్దు. అందుకుగల కారణాలను వారినే అడిగి తెలుసుకోండి. పూర్తిగా విన్నాకే పరిష్కారాన్ని సూచించండి. వాస్తవాలను అంగీకరించేలా వారిని ఒప్పించండి. అప్పుడు సర్దుబాటు వారికి అలవాటవుతుంది.

ఇదీ చదవండి: KTR: దూరం తగ్గించడానికే లింకు రోడ్ల నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.