- రాతపై ఆసక్తి పెంచేందుకు ఓ చిన్న పోటీ పెట్టాలి. అందంగా అక్షరాలు రాస్తే ప్రశంసతోపాటు వారికిష్టమైన కానుక అందించండి. అది వారిని చేతిరాతకు దగ్గర చేస్తుంది. ఈ అలవాటు నుంచి వాళ్లు బొమ్మలు, డిజైన్లు వేసే స్థాయికి కూడా ఎదుగుతారు. రెండు మూడు భాషలకు సంబంధించిన అక్షరాలను నేర్పిస్తే వారికి భాషల్ని పోల్చి నేర్చుకునే సామర్థ్యం వస్తుంది.
- పిల్లలకు రంగురంగుల పెన్సిళ్లు ఇచ్చి... ప్రతి అక్షరానికీ రంగులు మార్చుతూ రాయమని చెప్పండి. వినూత్నంగా ఉండటంతో ఆ ప్రయత్నంలోకి దిగే పిల్లలు క్రమేపీ రాయడం నేర్చుకుంటారు. అలాగే డ్రాయింగ్ పుస్తకాల్లో బొమ్మలు వేయమని చెప్పండి.
- ఎప్పుడైనా చదవడానికి ఆసక్తి చూపకుంటే, కాసేపు పుస్తకంలోని ప్రధానాంశాల్ని నోట్సులో రాయమని చెప్పండి. అలా చదవడం, రాయడం రెండూ అలవాటవుతాయి.
ఇదీ చదవండిః పిల్లల అల్లరికి అడ్డుకట్ట వేయడమెలా?