ETV Bharat / lifestyle

ప్రేమించానన్నాడు.. ఆ ఫొటోలతో బెదిరించాడు.. అలా బుద్ధి చెప్పా! - తెలంగాణ వార్తలు

ఓ అబ్బాయి.. అమ్మాయి.. గాఢంగా ప్రేమించుకున్నారు. విషయం అమ్మాయి ఇంట్లో తెలిసి ముందు చదువుపై దృష్టి పెట్టమన్నారు. ఆ అమ్మాయి భవిష్యత్తుపై దృష్టి పెడుతూనే ప్రియుడితో అప్పుడప్పుడూ మాట్లాడేది. కానీ అతని ప్రవర్తనలో మార్పు వచ్చాక క్రమంగా ప్రియుడి నుంచి దూరం జరగడం మొదలుపెట్టింది. ఇది భరించలేకపోయిన ఆ అబ్బాయి తన వద్ద ఉన్న ఆ అమ్మాయి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది? ఈ సమస్య నుంచి ఎలా బయటపడింది? తన జీవితాన్ని తిరిగి సక్రమంగా ఎలా మలుచుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..!

girlfriend-cheated-on-by-boy-friend-and-finally-she-out-of-danger-from-in-his-blackmail
ప్రేమించానన్నాడు.. ఆ ఫొటోలతో బెదిరించాడు.. అలా బుద్ధి చెప్పా!
author img

By

Published : Mar 21, 2021, 3:56 PM IST

హాయ్.. నా పేరు సారిక. మా అమ్మానాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. విశాఖపట్నంలో హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో నాకు కాలేజీలో ఓ అబ్బాయి పరిచయం అయ్యాడు. పేరు సందీప్. అదే కాలేజీలో సీనియర్‌ని అని చెప్పాడు. చూడడానికి చాలా అందంగా ఉంటాడు. దాంతో మొదట్లో అతనితో మాట్లాడడానికి వెనకడుగు వేసినా ఆ తర్వాత కాదనలేకపోయా. అలా ఇద్దరి మధ్య మాటల ప్రవాహం పెరిగి అది స్నేహంగా మారింది. తనతో కలిసి సమయం గడుపుతుంటే రోజు ఒక క్షణంలా అనిపించేది. అస్సలు టైం తెలిసేది కాదు. అంత సంతోషంగా ఉండేవాళ్లం. ఆ సంతోషం మాతో ఎప్పుడూ ఉండాలని మా ప్రేమని ఒకరికొకరు వ్యక్తపరుచుకొని.. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకునేవాళ్లం.

blackmailmorphed650-1.jpg
మొదట ప్రేమ... తర్వాత నిజస్వరూపం

కానీ అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి? నా ప్రేమ ప్రభావం చదువుపై బాగా పడింది. పరీక్షల ఫలితాలు చూసిన మా అమ్మ, నాన్న చదువులో ఎప్పుడూ ముందు ఉండే నేను అలా తక్కువ మార్కులతో పాసయ్యే సరికి ఆలోచనలో పడ్డారు. ఓ రోజు నన్ను కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడుతూ విషయం కనుక్కొనే ప్రయత్నం చేశారు. నేను కూడా ఇదే సరైన సమయం అని భావించి సందీప్ గురించి మా వాళ్లకు చెప్పి, మేము జీవితాల్లో స్థిరపడిన తర్వాత మా ప్రేమను పెళ్లిగా మార్చుకునేందుకు అనుమతి ఇవ్వండని అడిగా. నిజానికి.. ఈ విషయం చెప్పిన వెంటనే మా అమ్మ, నాన్న నాపై కోప్పడతారని అనుకున్నా. కానీ ఇక్కడ జరిగింది వేరు.. 'ఈ వయసులో పుట్టేది ప్రేమ కావచ్చు.. కాకపోవచ్చు.. అదీకాకుండా.. నీకు ఏ వ్యక్తి సరైన జీవిత భాగస్వామి అనేది నీకు నువ్వుగా నిర్ణయించుకునే పరిణతి ఇంకా నీకు, నీ వయసుకు లేదు. కాబట్టి అప్పటి వరకు వేచి చూడు.. ఈలోగా చదువుపై దృష్టి పెట్టకపోతే బంగారు భవిష్యత్తుని నీ చేజేతులా నువ్వే నాశనం చేసుకున్నట్లు అవుతుంది' అంటూ ఎంతో ప్రేమగా నాకు వివరించి చెప్పారు.

He tried to blackmail me with morphed photos. I teach him a lesson
మోసపోయా..

అమ్మ, నాన్నలు చెప్పింది సబబుగానే అనిపించడంతో సందీప్‌తో కబుర్లు, కాలక్షేపం తగ్గించి చదువుపై మనసు లగ్నం చేయడం ప్రారంభించాం. అలా ఓవైపు డిగ్రీ చదువుతూనే తనతో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉండేదాన్ని. జీవితంలో స్థిరపడి, ఆ తర్వాత పెద్దలను పెళ్లికి ఒప్పిద్దాం అని సందీప్‌కు కూడా పదేపదే చెప్పేదాన్ని. కానీ తను మాత్రం నాతో సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవాడు. నాకు వీలు కుదరకపోవడంతో ఈ విషయమై మా ఇద్దరి మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. ఈలోగా నా డిగ్రీ పూర్తై క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా నాకు సౌదీలో ఉద్యోగం కూడా వచ్చింది. విషయం సందీప్‌కి చెప్పా. ఎంతో సంతోషిస్తాడని అనుకున్న నాకు తన నుంచి భిన్నమైన స్పందన లభించింది. 'నువ్వు వెళ్లడానికి లేదు.. వెళ్తే నన్ను పూర్తిగా మర్చిపోతావు.. ఇప్పటికే నన్ను పట్టించుకోవడం మానేశావు..' అంటూ ఏవేవో మాట్లాడాడు. తనకి సర్దిచెప్పి నేను ఉద్యోగం కోసం సౌదీకి చేరుకున్నా.

ఇక్కడకు వచ్చిన తర్వాత ఉద్యోగంలో కొత్తగా చేరా కాబట్టి ఆ బాధ్యతలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేదాన్ని. ఎప్పుడో ఒకసారి సందీప్‌కి ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. ఒక్కోసారి సందీప్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా దానికి రెస్పాన్స్ ఇచ్చే సమయం కూడా ఉండేది కాదు. దాంతో 'నేను అనుకున్నంత పని అయ్యింది.. నువ్వు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావు.. నువ్వు తప్పకుండా నాతో మాట్లాడి తీరాల్సిందే..' అంటూ ఆంక్షలు విధించడం మొదలుపెట్టాడు సందీప్. ఆ తర్వాత నాకు వీలున్నప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నా.. తనలో నాకు ఎలాంటి మార్పు కనిపించలేదు. క్రమంగా అతని ప్రవర్తన పట్ల నాకు అయిష్టత ఏర్పడింది. దాంతో ఉద్యోగంపైనే ఎక్కువగా దృష్టి సారించా. ఈసారి సందీప్ నుంచి నేను వూహించని విధంగా బెదిరింపులు మొదలయ్యాయి.. మేమిద్దరం కలిసి దిగిన ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి తనతో నేను మాట్లాడకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ హెచ్చరించాడు.

blackmailmorphed650-2.jpg
వేధింపులు మొదలు

మొదట్లో కేవలం నన్ను భయపెట్టడానికి మాత్రమే అలా మాట్లాడుతున్నాడని నేను భావించా. కానీ సందీప్ నన్ను బెదిరించిన వారం రోజుల తర్వాత నా ఫేస్‌బుక్ ఓపెన్ చేసి చూస్తే నిజంగానే కొన్ని ఫొటోలు చాలా అసభ్యంగా కనిపించేలా మార్ఫ్ చేసి పెట్టాడు. ఎంతగానో నమ్మి జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకున్న వ్యక్తే ఇలా మోసం చేసే సరికి ముందు చాలా బాధ కలిగింది. ఆ తర్వాత కోపం వచ్చింది.. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో జరిగినదంతా అమ్మ, నాన్నలకు ఫోన్ చేసి చెప్పా. వాళ్లకు నా గురించి పూర్తిగా తెలుసు. పైగా నాపై నమ్మకం ఉంది కాబట్టి నన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేను కూడా వైజాగ్ వచ్చి పోలీసులకు జరిగినదంతా చెప్పా. వారు పూర్తి వివరాలు సేకరించేందుకు దర్యాప్తు చేయగా.. సందీప్ గురించి తెలిసిన విషయాలు నన్ను విస్తుపోయేలా చేశాయి. నేను డిగ్రీ చదివిన కళాశాలలోనే సందీప్ కూడా చేరినప్పటికీ మధ్యలోనే చదువు ఆపేసి జులాయిగా తిరగడం ప్రారంభించాడని, ప్రేమ పేరుతో వల పన్ని అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం అతనికి అలవాటని పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత పోలీసులు సందీప్‌ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు నేను కూడా నా తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు సౌదీలోనే నేను, నా భర్త, బిడ్డతో సంతోషంగా ఉంటున్నా.

మరి, ఇదంతా మీకెందుకు చెప్తున్నానో తెలుసా?? ఈరోజుల్లో ప్రేమ పేరుతో వల పన్నే అబ్బాయిల ఉచ్చులో చాలామంది అమ్మాయిలు చిక్కుకుంటున్నారు. అదీకాకుండా సోషల్‌మీడియాను మాధ్యమంగా చేసుకొని ఆకతాయిలు బెదిరింపులకు పాల్పడడం కూడా సర్వసాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో అమ్మాయిలు మరింత ధైర్యంగా బయటకు వచ్చి అధికారులకు ఫిర్యాదు ఇచ్చి సదరు వ్యక్తికి బుద్ధి చెప్పాలి. ఇందుకోసం అవసరమైతే మీ కుటుంబ సభ్యులు/ సన్నిహితులు/ బంధువుల సహాయం కూడా తీసుకోవాలి. అంతేకానీ.. వారి బెదిరింపులకు భయపడి వెనకడుగు వేస్తే వారు మిమ్మల్ని మరింత దయనీయమైన పరిస్థితుల్లోకి తోసేస్తారని గుర్తుంచుకోవాలి.
ఇట్లు,
సారిక

ఇదీ చదవండి: ఒక్క ఫోన్‌ కాల్‌ నా జీవితాన్నే మార్చేసింది..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.