ETV Bharat / lifestyle

అమ్మలూ.. అందుకే మనం ఉద్యోగం మానకూడదు..!

author img

By

Published : May 8, 2021, 1:50 PM IST

కొంతమంది మహిళలు పెళ్లై, పిల్లలు పుట్టాక ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపరు. ఇలా చేయడం కంటే పిల్లలు పుట్టాక కూడా ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించే అమ్మలు.. తమ పిల్లలకు రోల్​మోడల్​గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

mother's day, mother's day special story
మదర్స్ డే, మదర్స్ డే స్పెషల్ స్టోరీ

మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగ బాధ్యతల్ని భుజాలకెత్తుకోవడం గురించి ఈ రోజుల్లో కొత్తగా చెప్పుకోవక్కర్లేదు. అందులోనూ ఈ కరోనా సృష్టించిన సంక్షోభం పుణ్యమా అని ఆడైనా మగైనా ఉద్యోగ భద్రతే ప్రశ్నార్థకంగా మారుతోంది.. అయితే సాధారణంగా కొంతమంది పెళ్త్లె, పిల్లలు పుట్టే వరకే ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఆ తర్వాత పిల్లల ఆలనా-పాలనా, ఇంటి బాధ్యతల దృష్ట్యా ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికే పరిమితమైపోతుంటారు. అయితే ఇలా చేయడం కంటే పిల్లలు పుట్టాక కూడా ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించే అమ్మలు తమ పిల్లలకు రోల్ మోడల్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. ఈ క్రమంలో తల్లులు నిర్వర్తించే ఉద్యోగ బాధ్యతలు, వర్క్-లైఫ్ బ్యాలన్స్.. వంటివన్నీ తమ చిన్నారులకూ అలవడతాయట! ఈ నేపథ్యంలో వర్కింగ్ మదర్స్ తమ విధి నిర్వహణలో భాగంగా వారి పిల్లలకు ఎలా రోల్ మోడల్‌గా మారతారో ఈ 'మదర్స్ డే' సందర్భంగా తెలుసుకోవడం సందర్భోచితం.

motherrolemodelgh650-1.jpg
మదర్స్ డే

పెళ్త్లె, పిల్లలు పుట్టే వరకు ఎంతో ఉత్సాహంతో పనిచేసే మహిళలు.. మెటర్నిటీ తర్వాత తమ బాధ్యతల దృష్ట్యా తమకు ఇష్టం ఉన్నా, లేకపోయినా వర్క్ లైఫ్‌కు పూర్తిగా దూరమైపోతున్నారు. అయితే మరికొంతమంది మహిళలు మాత్రం ఉద్యోగంపై ఉన్న మక్కువను వదులుకోలేకో, లేదంటే తమ ఆర్థిక స్థితిగతుల రీత్యానో.. ఇలా కారణమేదైనా ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఉద్యోగం చేయకుండా ఇంటికి పరిమితమైన తల్లుల కంటే.. పిల్లలు పుట్టాక కూడా ఉద్యోగాన్ని కొనసాగించే అమ్మలే తమ పిల్లలకు రోల్ మోడల్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అది కూడా అబ్బాయి కంటే అమ్మాయిలపైనే వర్కింగ్ మదర్స్ ప్రభావం ఎక్కువట!

motherrolemodelgh650.jpg
తల్లుల అడుగుజాడల్లోనే కూతుళ్లూ..!

తల్లుల అడుగుజాడల్లోనే కూతుళ్లూ..!

పిల్లలు అన్ని విషయాలు నేర్చుకునేది తమ తల్లిదండ్రుల నుంచే కదా! అయితే ఆడవారు తమ నైపుణ్యాలతో అందనంత ఎత్తుకు ఎదుగుతోన్న ఈ రోజుల్లోనూ కొన్ని చోట్ల మహిళలను ఎదగనివ్వకుండా చేస్తున్నాయి పలు మూసధోరణులు. వీటిని బద్దలు కొట్టాలనే విషయాన్ని కూతుళ్లు ఎదిగే క్రమంలో ఉద్యోగం చేస్తోన్న తమ తల్లుల్ని చూసే నేర్చుకుంటుంటారు. ఈ విషయం నిరూపితమైంది కూడా! 'ఉద్యోగం చేసే అమ్మలు.. తమ కూతుళ్లపై ఎంత వరకు ప్రభావం చూపుతున్నారు?' అనే అంశంపై హార్వర్డ్ యూనివర్సిటీ దాదాపు 24 దేశాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా.. చాలామంది ఉద్యోగినుల కూతుళ్లు ఉన్నత విద్యార్హతలతో, మంచి ఉద్యోగం చేస్తూ, ఎక్కువ సంపాదిస్తున్నట్లు తేలింది. కాబట్టి ఇలా వర్కింగ్ మదర్స్ తమ కూతుళ్లకు మార్గదర్శకంగా నిలుస్తారన్నమాట!

motherrolemodelgh650-2.jpg

అప్పుడే సమానత్వం సాధ్యం!

అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ ఉద్యోగం చేసే తమ తల్లుల నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి, వంట చేసి, పిల్లల్ని రడీ చేసి, వారికి బాక్సులు సర్దడం.. ఇలా రోజూ తల్లి చేసే పనుల్ని దగ్గర్నుంచి గమనిస్తుంటారు పిల్లలు. ఈ క్రమంలో కొన్ని పనుల్లో పిల్లలు తల్లికి చేదోడు-వాదోడుగా ఉంటారు. ఇలా చిన్నతనం నుంచే ఇంటి పనులు చేయాలన్న బాధ్యత వారికి తెలుస్తుంది. ఆ తర్వాత ఇదే పద్ధతిని అబ్బాయిలు పెళ్లయ్యాక కూడా కొనసాగించే అవకాశముంది. ఉద్యోగం చేసే భార్యకు ఇంటి పనుల్లో సహాయపడడం, పిల్లల ఆలనా పాలనా బాధ్యతల్ని భార్యతో పాటు సమానంగా పంచుకోవడం.. వంటివి చేస్తారట! ఈ విషయం కూడా పలు పరిశోధనల ద్వారా నిరూపితమైంది. హార్వర్డ్ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనంలో భాగంగా.. ఉద్యోగం చేసే తల్లిని చూస్తూ పెరిగిన కొడుకులు, తమ భార్యలకు ఇంటి పనుల్లో సహాయపడతారని, పుట్టే పిల్లల బాధ్యతల్ని చూసుకుంటారని వెల్లడైంది. ఇలా తల్లులు కొడుకులపై సానుకూల ప్రభావం చూపడం మాత్రమే కాదు.. ఇలాంటి పరిణామాలు లింగ సమానత్వం సాధించేందుకు సైతం దోహదం చేస్తాయి.

motherrolemodelgh650-4.jpg
సమయం విలువ తెలుస్తుంది!

సమయం విలువ తెలుస్తుంది!

ఉద్యోగం చేసే తల్లులకు ప్రతి క్షణం ఎంతో విలువైనది. ఎందుకంటే ఇటు ఇంటి పనులు, అటు ఆఫీసు బాధ్యతలతో పాటు పిల్లల బాధ్యతలు చూసుకోవడానికి కూడా సమానంగా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇందులోనూ వర్కింగ్ మదర్స్ సక్సెస్ సాధించడంతో తమ తల్లుల్ని చూసి వారి పిల్లలకూ క్రమశిక్షణ, సమయ పాలన అలవడతాయి.

motherrolemodelgh650-5.jpg
సంతోషం సగం బలం!

సంతోషం సగం బలం!

ఇంట్లో ఉండి అనవసర విషయాలకు ఆందోళన చెందుతూ, తమ ఒత్తిళ్లను, చికాకును పిల్లలపై రుద్దే తల్లుల కంటే.. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఎలాంటి చీకూ-చింతా లేకుండా పిల్లలతో గడిపే తల్లులే ఎక్కువగా హ్యాపీగా ఉంటారని పలు అధ్యయనాల్లో రుజువైంది. చాలామంది ఉద్యోగినుల్లో అటు ఆఫీసు పనులు, ఇటు ఇంటి పనులు, పిల్లలకు సమయాన్ని కేటాయించడం తప్ప మరే అనవసర ఆలోచనలు మదిలో మెదిలే అవకాశమే ఉండదు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే దాన్ని స్వయంగా పరిష్కరించుకోవడం లేదంటే కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడంలోనూ ఉద్యోగం చేసే తల్లులు నేర్పు ప్రదర్శిస్తుంటారు. కాబట్టి సమస్యలను ఎదిరించే నేర్పరితనం, సంతోషకరమైన వాతావరణం.. వంటివన్నీ ఉద్యోగం చేసే తల్లుల పిల్లలపై సానుకూల ప్రభావం చూపుతాయి. ఓ రకంగా ఇది తల్లుల నుంచి పిల్లలు నేర్చుకునే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

motherrolemodelgh650-3.jpg
ఎవరిపైనా ఆధారపడరు!

ఎవరిపైనా ఆధారపడరు!

ఆర్థిక స్వాతంత్య్రం.. చాలామంది మహిళలు ఉద్యోగం చేయడానికి ఇది ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. మంచి చదువున్నా.. ఇంకా ఇతరులపై ఆధారపడడమేంటని భావించి, తమ చదువు, నైపుణ్యాలకు తగినట్లుగా ఆర్జిస్తూ ఆర్థికంగా పటిష్టంగా నిలుస్తున్నారు నేటి మహిళలు. అంతేకాదు.. తమ పిల్లలకు పెట్టే కొన్ని ఖర్చుల విషయంలోనూ ప్రతి దానికీ తమ భర్త ముందు చేయి చాచకుండా తామే స్వేచ్ఛగా తమ పిల్లలకు కావాల్సింది కొనిస్తున్నారు. ఇలా తల్లులు తమ కోసం చేస్తోన్న ఈ పనుల్ని, ఆర్థిక స్వేచ్ఛని దగ్గర్నుంచి గమనించే పిల్లలు చదువులో, ఆ తర్వాత వృత్తిఉద్యోగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. తద్వారా వారు ఉన్నత చదువులు చదివి తామూ ఆర్థికంగా బలంగా ఉండాలన్న తాపత్రయంతో ముందుకు సాగుతారని అధ్యయన సారాంశం. కాబట్టి ఇలా ఉద్యోగం చేసే తల్లులు తమ పిల్లలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడానికీ మార్గదర్శకంగా నిలుస్తారన్నమాట!

ఉద్యోగం చేసే మహిళలు తమ పిల్లలపై ఎలాంటి సానుకూల ప్రభావం చూపుతారు? వారు తమ చిన్నారులకు ఎలా రోల్ మోడల్‌గా నిలుస్తారు?? వంటి విషయాలు తెలుసుకున్నారు కదా! కాబట్టి అమ్మయ్యాక అటు పిల్లల బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే, ఇటు ఉద్యోగాన్నీ కొనసాగించండి.. పిల్లలకు మీరే మార్గదర్శకులవ్వండి..! అందులోనూ ఈ కరోనా కష్ట కాలంలో భార్యాభర్తలిద్దరూ ఆర్ధికంగా ఒకరికి ఒకరు చేదోడువాదోడుగా నిలవడం ఎంతో అవసరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.