ETV Bharat / lifestyle

జుట్టు రాలిపోతోందా.. ఈ చిట్కాలు ప్రయత్నించండి!

వయసు పెరిగేకొద్దీ జుట్టు ఊడటమనేది సహజం. చిన్నప్పుడు పెద్ద జుట్టు ఉంటే ఇప్పుడూ అలాగే ఉండాలనుకుంటారు. గుడ్డు, చికెన్ లాంటి ప్రొటీన్ ఫుడ్ తింటున్నా జట్టు ఊడిపోతోందా? ఏం చేయాలో అర్థం కావట్లేదా అయితే ఈ చిట్కాలు మీకోసమే..

hairloss during menopase stage
జుట్టు రాలిపోతోందా.. ఈ చిట్కాలు ప్రయత్నించండి!
author img

By

Published : Jul 25, 2020, 12:36 PM IST

మెనోపాజ్‌ సమయంలో, వంశపారంపర్యమైన కారణాలు, హార్మోన్‌లలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల కూడా ఊడుతుంది. రోజుకు 50-100 వెంట్రుకలు ఊడితే పట్టించుకోనవసరం లేదు. ఇంతకంటే ఎక్కువ ఊడితే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి.

  • హార్మోన్ల తేడాలు, శరీరంలో ఇనుములేమి, విటమిన్‌-బి12, విటమిన్‌-డి3 తక్కువగా ఉన్నా, పీసీఓఎస్‌ సమస్య ఉన్నా జుట్టు ఊడుతుంది. తినే ఆహారంలో ఇనుము, కాపర్‌, విటమిన్‌-బి1 ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్‌ బానే తీసుకుంటున్నారు కాబట్టి ఒకసారి థైరాయిడ్‌ పరీక్ష కూడా చేయించుకోండి. ఒత్తిడి ఉన్నా, మానసిక సమస్యలున్నా కూడా జుట్టు ఊడిపోతుంది.
  • జాగ్రత్తలు తీసుకోండి..
  • పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి. ఇనుము ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, బీన్స్‌ తీసుకోవాలి. వారానికి రెండు, మూడు సార్లు చేపలు తినాలి.
  • గింజలు, విత్తనాలు తినాలి. వీటిల్లో ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్‌నట్స్‌, అవిసెగింజలు తీసుకోవాలి. పాలకూరలో ఇనుముతోపాటు విటమిన్‌-డి2 ఉంటుంది.
  • విటమిన్‌-ఎ ఉండే క్యారెట్లు, గుడ్లు తీసుకోవాలి. అలాగే విటమిన్‌-బి12, విటమిన్‌-సి ఎక్కువగా ఉండే ఆహారం తినాలి.
  • యోగా, ధ్యానం, వాకింగ్‌ లేదా వ్యాయామాలు చేయాలి. ఆర్గానిక్‌ హెయిర్‌ డైలు మాత్రమే వాడాలి. మందార ఆకులతో ప్యాక్‌ వేసుకుంటే వెంట్రుకలు చిట్లవు.

ఈ జాగ్రత్తలన్నీ పాటించినా జుట్టు ఊడిపోతే వైద్యులను సంప్రదిస్తే అవసరాన్ని బట్టి వాళ్లు చికిత్స అందిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.