నడక
‘అసలే సమయం లేదంటుంటే..’ అనకండి. దీన్నో పనిలా పెట్టుకుని చేస్తే అలాగే అనిపిస్తుంది. కాస్త విరామంగా తీసుకుని ప్రయత్నించండి. దీర్ఘకాల పని చేసేముందో, తర్వాతో ఆరు బయటో, డాబా మీదో అలా నాలుగు అడుగులేయండి. చల్లగాలి శరీరాన్ని తేలిక పరుస్తుంది. కొంత మ్యూజిక్ జత అయితే వ్యాయామంతో పాటు మనసూ కుదుటపడుతుంది.
'రోజూ వాకింగ్ చేసినా బరువు తగ్గడం కష్టమే!'
వంట
‘రోజూ ఉండేదేగా!’ అని తీసిపారేయొద్దు. కొత్తవి ప్రయత్నించండి. ఒత్తిడి, ఆందోళనలను దూరం చేయడంలో వంట పాత్రను తక్కువ చేయలేం. తక్కువ సమయంలో రుచిగా చేసే వాటిపై దృష్టిపెడితే భవిష్యత్తులోనూ ఉపయోగపడతాయి.
Depression: ఆందోళన తగ్గించే ఆహారం!
సృజన
కొత్తగా నేర్చుకునేదేదైనా భావోద్వేగాలపై అదుపును తెస్తుందట. పెయింటింగ్, అల్లికలు, సంగీతం.. గతంలో ప్రయత్నించాలనుకుని చేయలేని వాటిని మొదలు పెట్టండి. పూర్తిగా ఒకేసారి కూర్చుని చేయాలన్న నియమం ఏమీలేదు. కొద్దికొద్దిగా ప్రయత్నించొచ్చు. ఇప్పుడు ఎన్నో మార్గాలు నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అందుకుని చూడండి.
సృజనాత్మక ఆలోచనలకూ వ్యాయామం తప్పనిసరి
మార్చండి
ఏమీ తోచలేదూ.. అల్మరాలు, వర్కింగ్ టేబుల్‌ను భిన్నంగా మార్చడానికి ప్రయత్నించండి. కొత్తదనం మనసుకు ఉల్లాసాన్నిస్తుంది. పనిలో పనిగా అక్కర్లేని వాటినీ తీసేయొచ్చు.
అమ్మాయిల వార్డ్రోబ్ తెరిస్తే నైట్వేర్లే ఉంటున్నాయట!
చదవండి
ముందు ఏం చదవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. పనిలో కాస్త బద్ధకంగానో, చిరాకుగానో ఉన్నప్పుడు చదవండి. ఎంత చదవాలన్నదీ చూసుకోండి. లేదంటే.. సమయం తేలియకుండానే అయిపోతుంది.
ఇదీ చూడండి: PROPERTY ISSUE: ఇల్లొదిలి వచ్చేశాను.. భర్త ఆస్తి నాకొస్తుందా..?