సోయాబీన్స్
సోయాబీన్స్(soya beans) రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును దరిచేరకుండా చూస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెనోపాజ్ తర్వాత క్యాల్షియం తగ్గి, ఎముకలు బలహీనపడే సమస్య నుంచి ఇవి దూరం చేస్తాయి.
తేనీటితో ..
క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే గ్రీన్ టీ(green tea) ఒత్తిడిని దూరం చేస్తుంది. అలాగే యాలకులు, మెంతులు, శొంఠిపొడి వంటి వాటితో చేసే తేనీరు మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.
ఆకు కూరలు
కెరొటినాయిడ్స్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఉండే వీటిని(leafy vegetables) ప్రతి రోజూ ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడితే జీర్ణశక్తి మెరుగుపడి, మలబద్ధకం ఉండదు. శరీరంలోని వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకి రావడంతో అనారోగ్యాలు దరిచేరవు.
వెల్లుల్లి..
మాంగనీస్, కాపర్, పొటాషియం, ఐరన్, విటమిన్ బి6, బి1, సితోపాటు పీచు ఉండే వెల్లుల్లి(Garlic) ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే వ్యాధినిరోధక శక్తి ఉండే పసుపు అనారోగ్యాలను దరిచేరనివ్వదు. మునగాకుతో చేసే వంటకాలు రక్తంలో చక్కెరస్థాయులను అదుపులో ఉంచుతాయి. వీటితోపాటు తాజాపండ్లు, కూరగాయలతో చేసే సలాడ్లు తీసుకోవడంతో మహిళలు ఆరోగ్యంగా సూపర్ ఉమెన్‌గా మారతారు.
- ఇదీ చదవండి : విటమిన్ లోపం ఉందా? ఈ 'గ్రీన్సూప్' తీసుకుంటే సరి