రెండు కాళ్లను ఎడంగా పెట్టి నిలబడాలి. ముందుగా కుడిచేతిని నడుం మీద పెట్టుకుని ఎడమచేతిని పైకి లేపి మెల్లగా కుడిపక్కకు ఒంగాలి. ఇలానే మరోవైపూ చేయాలి. ఇలా ఇరవైసార్లు చేస్తే చూడచక్కని ఆకృతి మీ సొంతమవుతుంది.
నేల మీద బోర్లా పడుకుని.. చేతుల ఆధారంగా శరీరాన్ని మెల్లగా పైకి లేపాలి. తర్వాత పాదాలను ముందుకు తీసుకొచ్ఛి... పిరుదులు పైకి వచ్చేలా ఒంగి.. తిరిగి యథాస్థితికి రావాలి. ఇలా ఓ ఇరవైసార్లు చేయాలి.
రెండు కాళ్లను దూరంగా జరిపి నిలబడాలి. చేతులనూ భుజాలకు సమాంతరంగా చాపాలి. ఇప్పుడు కుడివైపు ఓసారి, మరోసారి ఎడమవైపు తిరగాలి. ఇలా ఓ పదిహేను సార్లు చేసి చూడండి. నడుము నాజూగ్గా మారుతుంది.
- ఇదీ చూడండి : ఇలా చేస్తే నిత్యం ఉత్సాహంగా ఉంటారు...