ETV Bharat / lifestyle

Health tips: తరుచూ అలసిపోతున్నారా?.. అయితే ఇలా చేయండి! - తెలంగాణ వార్తలు

ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఉత్సాహంగా పని చేసే ఆమె తరుచూ అలసిపోతుందా? ఆహారం సరిగా తీసుకున్నా నీరసం వస్తుందా? అయితే శరీరంలోని కొన్ని మార్పులతో ఆమెలోని శక్తి క్షీణిస్తుందని అంటున్నారు నిపుణులు. మహిళలు ఈ అలసట నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి!.

tips for reduce tiredness, tips for women
అలసట రాకుండా చిట్కాలు, మహిళలు కోసం ఆరోగ్య చిట్కాలు
author img

By

Published : Jul 21, 2021, 12:07 PM IST

ఉదయం లేచినప్పటి నుంచి అమల ఉత్సాహంగా పని చేస్తూనే ఉంటుంది. అయితే ఈ మధ్య ఆమెను తరచూ అలసట ఆవరిస్తోంది. ఎప్పటిలాగే ఆహారం తీసుకుంటున్నా నీరసం ఎందుకొస్తోందో అర్థం కావడంలేదు. అయితే మహిళలకు నెలసరి, గర్భందాల్చడం, ప్రసవం వంటి వాటితో పాటు మారుతున్న కాలాలబట్టి ఆరోగ్యంలో మార్పులు సహజం అంటున్నారు నిపుణులు. రక్తహీనత, అలసట వంటి పలు సమస్యల నుంచి బయటపడాలంటే ఇనుము సమృద్ధిగా ఉండే వాటిని ఆహారానికి జత చేయాలని సూచిస్తున్నారు.

ఇనుము పుష్కలం

* ఆకు పచ్చని వర్ణం...

రక్తహీనతను దరిచేరకుండా మహిళల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇనుముకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. చినుకులు పడుతున్న ఈ సమయంలో ఐరన్‌ ఎక్కువగా ఉన్నవాటిని ఎంచుకోవాలి. వాటిలో ఆకుకూరలు ప్రధానమైనవి. ఆకుపచ్చని వర్ణంలో బీన్స్‌, చిక్కుడు, బఠాణీ, బ్రకోలీ, బీర, ఆనప, దొండ, పొట్లకాయ, కీరదోస వంటి తాజా కూరగాయల్లో ఐరన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది.

మరింత బలం కోసం

* గింజలు, ఎండుఫలాలు

జీడిపప్పు, ఆప్రికాట్స్‌, బాదం, వేరుశనగ, ఎండుద్రాక్ష, ఖర్జూరంవంటి వాటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ ఆహారంలో తీసుకుంటే మహిళలెదుర్కొనే కొన్నిరకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. గుమ్మడి, పొద్దు తిరుగుడు విత్తనాలు, ఫ్లాక్స్‌ సీడ్స్‌ను స్నాక్స్‌గా తీసుకోవడం అలవరుచుకోవాలి.

* మాంసాహారం

చికెన్‌ లివర్‌ను వారానికొకసారైనా తీసుకుంటే ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది. ఇందులోని పౌష్టికవిలువలు సీజన్‌లో వచ్చే అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచుతాయి. చేపలు, రొయ్యలను వారానికొకసారైనా తీసుకుంటే మరీ మంచిది. అంతేకాదు, డార్క్‌ చాకొలెట్‌ ఏ వయసువారికైనా ఆరోగ్యాన్ని అందిస్తుంది. కోకోలో మహిళలకు కావాల్సిన ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ అందుతాయి.

* సి విటమిన్‌తో..

సిట్రస్‌ జాతి పండ్లను తీసుకున్నా శరీరానికి తగినంత ఇనుము అందుతుంది. ఈ పండ్లు వర్షాకాలంలో తగినంత వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఐరన్‌ శాతాన్ని ఇనుమడిస్తాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.