మీకు ఏర్పడిన మచ్చలు లేత రంగులో ఉంటే దానిపైన తేనెని రాసి చూడండి. ఒకవేళ మచ్చలు ముదురు రంగులో ఉంటే ఈ ప్యాక్‌ని ప్రయత్నించండి. ముందుగా ఒక కీరదోసను తీసుకోండి. దానిపై తొక్కను తొలగించి లోపలి భాగాన్ని పేస్ట్‌లాగా చేయాలి. ఈ పేస్ట్‌ని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని అంతే మొత్తంలో బార్లీ పిండిని కలపండి. ఈ రెండింటినీ ముద్దలాగా చేసి ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడ అప్లై చేయండి.
అలా 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి.. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. ఇలా మూడు నెలల పాటు వారానికి నాలుగుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మొటిమలు రాకుండా ఉండటం కోసం ఆయిల్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం, పిల్లో కవర్స్ ఎప్పటికప్పుడు మార్చుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం వంటివి చేయాలి.
ఇదీ చదవండి: ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షం