ETV Bharat / lifestyle

బాదం తినండి.. ముఖంపైన మచ్చలకు, ముడతలకు చెక్ పెట్టండి! - శరీర సౌందర్య చిట్కాలు

మహిళల ముఖాలపై ముడతలు, చర్మం రంగు మారడం వంటి సమస్యల తీవ్రతను తగ్గించడంలో బాదం పప్పు బాగా సహకరిస్తుందని అధ్యయనం స్పష్టం చేసింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మీరూ బాదం పప్పులను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందండి.

health care tips
బాదం తినండి.. ముఖంపైన మచ్చలకు, ముడతలకు చెక్ పెట్టండి!
author img

By

Published : Mar 25, 2021, 3:23 PM IST

మహిళల ముఖ సౌందర్యాన్ని తగ్గించే సమస్యల్లో ముడతలు, పిగ్మెంటేషన్ ప్రధానమైనవి. ముడతలతో వయసు పైబడిన వారిలా కనిపిస్తే... పిగ్మెంటేషన్ మచ్చలతో ముఖమంతా అంద విహీనంగా మారుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని సౌందర్య సాధనాలు ఉన్నా సత్ఫలితాలను ఇస్తాయన్న గ్యారంటీ లేదు. పైగా ఒక్కోసారి దుష్ప్రభావాలు కూడా ఎదురుకావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బాదం పప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళలు ఈ సమస్యలను అధిగమించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ప్రత్యేకించి మెనోపాజ్ దశలో ఉన్న కొంతమంది మహిళల ముఖాలపై ముడతలు, చర్మం రంగు మారడం వంటి సమస్యల తీవ్రతను తగ్గించడంలో బాదం పప్పు బాగా సహకరిస్తుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

చర్మ సమస్యలకు చెక్!

క్యాలరీలు తక్కువగా ఉండే బాదం పప్పును చాలామంది బరువు తగ్గించుకోవడానికి స్నాక్స్‌గా వినియోగిస్తారు. ఇందులోని విటమిన్‌-ఇతో పాటు మోనో అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వుల కారణంగా వీటిని నిత్యం తీసుకునే మహిళల్లో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువని గత అధ్యయనాల్లో తేలింది. ఇలా ఎన్నో ప్రయోజనాలున్న బాదం పప్పుతో మహిళల్లో ముఖం పైన ముడతలు, పిగ్మెంటేషన్ మచ్చలు కూడా మాయమవుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

రెండు బృందాలుగా విభజించి..

పరిశోధనలో భాగంగా- ఎండ పడ్డప్పుడు చర్మం మండే, ముడతలు పడే, రంగు మారిపోయే స్వభావం కలిగిన మహిళలను రెండు బృందాలుగా విభజించారు. వీళ్లంతా మెనోపాజ్ దశలో ఉన్న ఆరోగ్యవంతులైన మహిళలే కావడం గమనార్హం. వీరిలో ఒక బృందానికి స్నాక్స్‌ కింద సుమారు 60 గ్రాముల బాదం పప్పు (340 క్యాలరీలు)ను ఇచ్చారు. రోజులో వారు తీసుకునే మొత్తం క్యాలరీల్లో దీని వాటా 20 శాతంగా ఉండేలా చూశారు. ఇక రెండో బృందానికి ఇతర ఆహార పదార్థాలు (ఫిగ్ బార్, గ్రానోలా బార్ వంటివి) అల్పాహారంగా అందించారు. అధ్యయనంలో పాల్గొన్న మహిళలు- బాదంతో పాటుగా, వాళ్లు రెగ్యులర్ గా తీసుకునే ఇతర ఆహార పదార్ధాలను మామూలుగానే తీసుకున్నారు. అయితే- ఒక్క బాదం తప్ప ఇతర నట్స్ ఏవీ వారి ఆహారంలో చేర్చుకోలేదు.

ఇలా 8, 16, 24 వారాలకొకసారి చొప్పున రెండు బృందాల్లోని మహిళల చర్మాలపై పరిశోధన సాగిస్తూ వచ్చారు. ఇందులో భాగంగా హై రిజల్యూషన్ కలిగిన ఫేషియల్‌ ఇమేజింగ్‌ విధానం ద్వారా మహిళల ముఖాలపై ముడతలు, పిగ్మెంటేషన్ సమస్యల తీవ్రతను పరిశీలించారు. అధునాతన 3డీ ఫేషియల్‌ మోడలింగ్‌ అండ్‌ మెజర్‌మెంట్‌నూ ఈ పరిశోధనలో వినియోగించారు.

వాటి తీవ్రత తగ్గింది!

స్కిన్‌ హైడ్రేషన్‌, చర్మం నుంచి ఆవిరయ్యే నీరు, సెబేషియస్‌ గ్రంథుల నుంచి ఉత్పత్తయ్యే జిడ్డు పదార్థం సెబమ్‌ స్థాయులను ఆధారంగా తీసుకుని ఈ అధ్యయనం సాగింది. ఇందులో భాగంగా మొదటి 16 వారాల్లో బాదం పప్పు ఆహారంగా తీసుకున్న మహిళల ముఖాలపై ముడతల తీవ్రత 15 శాతం మేర తగ్గిందని, అదే 24 వారాల తర్వాత 16 శాతం మేర తగ్గిందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అదేవిధంగా పిగ్మెంటేషన్ సమస్య తీవ్రత 24 వ వారం నాటికి 20 శాతం మేర తగ్గిందని పరిశోధకులు స్పష్టం చేశారు. అదేవిధంగా పరిశోధన కొనసాగిన ఈ 24 వారాల్లో బాదం తీసుకున్న మహిళల బరువుల్లో ఏ మాత్రం మార్పు కనిపించలేదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

అదే కారణం!

ఈ సందర్భంగా బాదం పప్పులో అధికంగా ఉండే ఆల్ఫా టోకోఫెరాల్‌ కారణంగానే మహిళల్లో ముడతలు, పిగ్మెంటేషన్ సమస్యల తీవ్రత తగ్గిందంటున్నారు ఈ పరిశోధనల్లో పాలు పంచుకొన్న ఓ శాస్త్రవేత్త. ‘బాదంలో ఆల్ఫా టోకోఫెరాల్‌ (విటమిన్‌-ఇ), అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులతో పాటు పలు పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఆల్ఫాటోకోఫెరాల్‌లో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల ముఖాలపై ఉన్న ముడతలు, పిగ్మెంటేషన్ సమస్యల తీవ్రతను తగ్గించేస్తాయి’ అని ఆ సైంటిస్ట్‌ చెప్పుకొచ్చారు.

అందుకు డైట్‌లో వీటిని చేర్చుకోవాల్సిందే!

ఇక ఈ అధ్యయనాన్ని భారతదేశంలోని ప్రముఖ చర్మసౌందర్య నిపుణులు కూడా స్వాగతిస్తున్నారు. ‘ప్రతిరోజూ బాదం పప్పులు తినడం వల్ల మహిళల ముఖంపై ముడతలు తగ్గడమే కాకుండా చర్మపు రంగులో కూడా మార్పులొస్తున్నాయని అధ్యయనంలో తేలడం ఎంతో సంతోషకరమైన విషయం. పర్యావరణ ప్రతికూలతలకు తోడు, అధిక సూర్యరశ్మి ప్రభావం కారణంగా స్కిన్‌టోన్‌ సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనే భారతీయ మహిళల్లో ఈ అధ్యయనం ఒక సానుకూల దృక్పథాన్ని నింపుతుందని ఆశించవచ్చు. బాదం పప్పుల్లో విటమిన్‌-ఇ అధికంగా ఉంటుంది. వీటితో పాటు అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు, పాలీఫినాల్స్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. మహిళలు తమ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు ఈ పోషకాలు ఎంతగానో సహకరిస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని మహిళలు, ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు తమ రోజువారీ డైట్‌లో బాదం పప్పులను చేర్చుకోవడం ఎంతో ముఖ్యం’ అని చెప్పుకొచ్చారు.

మరి పరిశోధకులు, చర్మ సౌందర్య నిపుణులు చెబుతున్నట్లు మీరూ బాదం పప్పులను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.