ETV Bharat / lifestyle

కరోనా అలర్ట్‌: మేకప్‌ కిట్‌ని శానిటైజ్‌ చేయండిలా !

author img

By

Published : May 2, 2021, 4:31 PM IST

ఈ కరోనా సమయంలో ఏ వస్తువును ముట్టుకున్నా, పట్టుకున్నా భయంగానే అనిపిస్తోంది. అందుకే బయటి నుంచి రాగానే హ్యాండ్‌వాష్‌తో చేతుల్ని శుభ్రం చేసుకోవడం, పదే పదే శానిటైజర్‌ని వాడడం కామనైపోయింది. అయితే చేతులు శుభ్రం చేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ కొన్ని వస్తువుల్ని ఎలా శానిటైజ్‌ చేయాలో అర్థం కాక తికమకపడిపోతుంటాం. అలాంటి వాటిలో మనం రోజూ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు ఒకటి. మేకప్‌ బాక్స్‌నైతే శానిటైజర్‌తో శుభ్రం చేసేస్తాం.. మరి, అందులో ఉన్న ఉత్పత్తులను ఎలా శానిటైజ్ చేయాలో తెలుసుకుందాం రండి...

sanitize your beauty products, beauty products sanitize tips
సౌందర్య ఉత్పత్తుల శానిటైజేషన్, బ్యూటీ ప్రాడక్ట్స్ శానిటైజేషన్

కరోనా సమయంలో తరుచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, ఇతర వస్తువులను శానిటైజ్ చేయడం అలవాటుగా మారింది. రోజూ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులను శానిటైజ్ చేయడం అంటే పెద్ద పనే. మేకప్ బాక్స్​ని సులభంగా క్లీన్ చేయవచ్చు. మరి అందులో ఉండే పౌడర్‌, క్రీమ్‌, మేకప్‌ బ్రష్‌లు.. వంటి వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలో చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. తద్వారా వాటిని అలాగే అపరిశుభ్రంగా ఉపయోగించడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు సౌందర్య నిపుణులు. కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం వల్ల మనం రోజువారీ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు, మేకప్‌ ఉత్పత్తుల్ని ఈజీగా శానిటైజ్‌ చేయవచ్చు అంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

పౌడర్‌ ఉత్పత్తులు ఇలా..!

మనం ఉపయోగించే మేకప్ ఉత్పత్తుల్లో పౌడర్‌ తరహావి చాలానే ఉంటాయి. ప్రెస్‌డ్‌ పౌడర్స్‌, బ్లషెస్‌, ఐ షాడోస్‌, పౌడర్‌ ఫౌండేషన్స్‌.. ఇలాంటి వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలో చాలామందికి తెలియదు. అయితే ఇందుకోసం 70 శాతం ఆల్కహాల్‌ ఉన్న క్రిమి సంహారకాలను ఉపయోగించాలని చెబుతోంది వ్యాధి నియంత్రణ, నివారణ మండలి (సీడీసీ). ఇవి వైరస్‌ను నాశనం చేయడంలో సమర్థంగా పనిచేస్తాయంటోందా సంస్థ. వీటితో పౌడర్‌ తరహా బ్యూటీ ఉత్పత్తుల్ని శానిటైజ్‌ చేసే క్రమంలో.. 9 వంతుల ఈ ఆల్కహాల్‌ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోయాలి.. దీనికి ఒక వంతు డిస్టిల్డ్‌ వాటర్‌ని జతచేసి బాగా షేక్‌ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పౌడర్‌ ప్యాలట్‌పై స్ప్రే చేయాలి. పూర్తిగా ఆరేంత వరకు ప్యాలట్‌ను అలాగే తెరచి ఉంచాలి.

మేకప్‌ బ్రష్‌లు

మేకప్‌ ఉత్పత్తుల్నే కాదు.. మేకప్ బ్రష్‌లను తరచూ శుభ్రం చేయడం ఉత్తమం. ఎందుకంటే పదే పదే వాటినే వాడడం వల్ల అందులో ఉండే మేకప్‌ అవశేషాల వల్ల చర్మానికి హాని కలిగే ప్రమాదం ఉంది. అలాగే మేకప్‌ వేసుకున్న తర్వాత ఆ బ్రష్‌లను అలాగే వదిలేయడం వల్ల వాటిపై దుమ్ము-ధూళి, ఇతర వైరస్‌, బ్యాక్టీరియాలు చేరతాయి. తద్వారా అందానికే కాదు.. ఆరోగ్యానికీ ప్రమాదమే. కాబట్టి ఈ కరోనా సమయంలోనే అని కాకుండా తరచూ మేకప్‌ బ్రష్‌లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం తయారుచేసుకున్న ఆల్కహాల్‌ మిశ్రమాన్ని బ్రష్‌ బ్రిజిల్స్‌, బ్రష్‌ హ్యాండిల్‌పై స్ప్రే చేసి కాటన్‌ ప్యాడ్‌తో తుడిచేయాలి. లేదంటే ఆల్కహాల్‌తో కూడిన బ్రష్‌ క్లీనర్స్‌ మార్కెట్లో లభిస్తాయి. మేకప్‌ బ్రష్‌లను శానిటైజ్‌ చేయడానికి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు.. మనం తలస్నానం చేయడానికి ఉపయోగించే గాఢత తక్కువగా ఉండే షాంపూలతో సైతం మేకప్‌ బ్రష్‌లను శుభ్రం చేసుకోవచ్చు.

లిక్విడ్‌ ఫౌండేషన్‌

మేకప్‌ వేసుకోవడంలో భాగంగా మనం ఉపయోగించే లిక్విడ్‌ తరహా ఉత్పత్తుల్ని శానిటైజ్‌ చేయడమంటే కాస్త కష్టమనే చెప్పాలి. అలాగని ఆల్కహాల్‌ మిశ్రమాన్ని ఆ లిక్విడ్‌లో పోయలేం. కాబట్టి ఇందుకోసం ఇందాక మనం తయారుచేసి పెట్టుకున్న ఆల్కహాల్‌ మిశ్రమాన్ని ఒక కాటన్‌ ప్యాడ్‌పై వేసుకొని లిక్విడ్‌ ఫౌండేషన్‌ బాటిల్‌ లేదా ఫౌండేషన్‌ ట్యూబ్‌పై తుడవాలి. అలాగే దాని మూత తీసి ఫౌండేషన్‌ బయటికి వచ్చే రంధ్రం దగ్గర కూడా శుభ్రం చేయాలి. ఇలా లిక్విడ్‌, జెల్‌ తరహా మేకప్‌ ఉత్పత్తులను శుభ్రం చేయచ్చు.. కానీ వాటిలో ఉండే మిశ్రమాన్ని శానిటైజ్‌ చేయలేం కాబట్టి వాటిని ఉపయోగించే ముందు మీ ముఖాన్ని, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం మాత్రం మర్చిపోవద్దు.

మేకప్‌ పెన్సిల్‌/షార్ప్‌నర్స్‌

ఐబ్రోస్‌ని తీరైన ఆకృతిలో, ఒత్తుగా తీర్చిదిద్దుకోవడానికి, ఐలైనర్‌ పెట్టుకోవడానికి.. మేకప్‌ పెన్సిల్స్‌ని ఉపయోగించడం మామూలే. అయితే వీటిని ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయడం తప్పనిసరి. ఇందుకోసం మనం తయారుచేసి పెట్టుకున్న ఆల్కహాల్‌ మిశ్రమాన్ని పెన్సిల్‌పై స్ప్రే చేసి పొడి కాటన్‌ ప్యాడ్‌తో తుడిచేస్తే సరి. ఇక ఈ పెన్సిల్స్‌ని షార్ప్‌ చేసుకోవడానికి ఉపయోగించే షార్ప్‌నర్స్‌ని ఒక ఐదు నిమిషాల పాటు ఆల్కహాల్‌ మిశ్రమంలో మునిగేలా ఉంచాలి. ఆపై పొడి కాటన్‌ వస్త్రంతో దాన్ని పొడిగా తుడిచేస్తే అది శుభ్రపడుతుంది.

మేకప్‌ బ్యాగ్స్‌/ బాక్స్‌

మేకప్‌ ఉత్పత్తుల్నే కాదు.. వాటిని అమర్చుకునే బ్యాగ్స్ లేదా బాక్సుల్ని తరచూ శానిటైజ్‌ చేయడం మంచిది. ఈ క్రమంలో బ్యాగ్స్‌ అయితే సబ్బు, నీటితో శుభ్రం చేయచ్చు.. లేదంటే వాషింగ్‌ మెషీన్‌లో కూడా వేయచ్చు. అలాకాకుండా అవి మరీ సున్నితమైనవి అయినట్లయితే.. క్రిమి సంహారక ఆల్కహాల్‌ మిశ్రమాన్ని బ్యాగ్‌పై స్ప్రే చేసి పొడి వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుంది. మేకప్‌ బాక్సుల్ని కూడా ఇదే తరహాలో శుభ్రం చేయాల్సి ఉంటుంది. బాక్సు బయటే కాదు.. లోపల అరల్లో కూడా ఆల్కహాల్‌ మిశ్రమాన్ని స్ప్రే చేసి తుడిచేయాలి. ఇలా శుభ్రపరిచిన బ్యాగ్‌ లేదా బాక్సుల్ని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాతే వాటిలో తిరిగి మేకప్‌ ఉత్పత్తుల్ని అమర్చుకోవాలి.

ఆ ప్రదేశం శుభ్రంగానే..

మేకప్‌ వస్తువులే కాదు.. మనం మేకప్‌ వేసుకునే సమయంలో డ్రస్సింగ్‌ టేబుల్‌ను పదే పదే తాకుతుంటాం. ఈ క్రమంలో డ్రస్సింగ్‌ టేబుల్‌ ఉపరితలాన్ని, మిర్రర్‌ని శానిటైజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం క్రిమిసంహారక వైప్స్‌ మార్కెట్లో లభ్యమవుతాయి. వాటితో నేరుగా డ్రస్సింగ్‌ టేబుల్‌ ఉపరితలాన్ని, అద్దంపైన తుడిచేస్తే సరిపోతుంది. లేదంటే మనం తయారుచేసి పెట్టుకున్న ఆల్కహాల్‌ మిశ్రమాన్ని సైతం ఉపయోగించచ్చు.

ఇవి గుర్తుంచుకోండి!

  • మేకప్‌ ఉత్పత్తులంటే పెర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌ కూడా అందులో భాగమే. అందుకే వాటిపై కూడా క్రిమిసంహారకాలను స్ప్రే చేసి పొడి కాటన్‌ వస్త్రంతో తుడిచేయాలి.
  • బయటికి వెళ్లినప్పుడు మేకప్‌ వేసుకోవాల్సి వస్తే.. చేతులకు బదులుగా క్రిమి సంహారకాలతో శుభ్రం చేసిన మేకప్‌ బ్రష్‌లను ఉపయోగించడమే శ్రేయస్కరం. అయితే ఈ బ్రష్‌లతో ఫౌండేషన్‌.. వంటివి ముఖంపై అంత సమానంగా పరచుకోవు అనిపించినప్పుడు పరిశుభ్రమైన టిష్యూ వంటివి ఉపయోగించడం ఉత్తమం. తద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు.
  • మనం ఉపయోగించే మేకప్‌ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయడం ఎంత ముఖ్యమో.. వాటి ఎక్స్‌పైరీ డేట్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండడం అంతే ముఖ్యం. అందుకే వాటి ఎక్స్‌పైరీ డేట్స్‌ని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఆ ఉత్పత్తుల్ని మార్చేయడం మంచిది.

చూశారుగా.. ఈ కొవిడ్‌ సమయంలో మేకప్‌ ఉత్పత్తుల్ని ఎలా శుభ్రం చేయాలో! అయితే ఈ క్రమంలో లిక్విడ్‌, జెల్‌ తరహా మేకప్‌ ఉత్పత్తుల్లోకి ఆల్కహాల్‌ మిశ్రమం వెళ్లకుండా జాగ్రత్తపడాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ చిట్కాల్ని ఇప్పుడే కాదు.. కరోనా తొలగిపోయిన తర్వాత కూడా పాటిస్తే మేకప్‌ ఉత్పత్తుల వల్ల మన చర్మానికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తపడచ్చు..!

ఇదీ చదవండి: తెలంగాణలో నేడు, రేపు వడగండ్ల వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.