ETV Bharat / lifestyle

'అందుకే మా మెన్‌స్ట్రువల్‌ కప్‌ ఒకటి కొంటే మరొకటి ఉచితం!' - తెలంగాణ వార్తలు

కాలం మారుతోంది.. టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది.. అందుకు అనుగుణంగానే మహిళల్లో పిరియడ్‌ పావర్టీ (నెలసరి పేదరికం)ని దూరం చేయడానికి, వారి వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎన్నెన్నో సరికొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. అలా ఎన్నొస్తే ఏం లాభం.. వాటి ధర ఆకాశాన్నంటుతోంది.. పేదవారికి, గ్రామీణ మహిళలకు అవి అందనంత ఎత్తులో ఉంటున్నాయి. మహిళల బాధలను తెలుసుకొని ఓ మహిళ మెన్‌స్ట్రువల్‌ కప్ డిజైన్ చేసింది. ఆ కప్​ ప్రత్యేకతలేంటో చూద్దాం...

menstrual cup usage, menstrual buy one donate one
మెన్‌స్ట్రువల్‌ కప్‌ ఉపయోగాలు, ఆరోగ్యం కోసం మెన్‌స్ట్రువల్‌ కప్‌
author img

By

Published : Apr 20, 2021, 1:56 PM IST

కాలం మారినా మహిళలు పిరియడ్‌ పావర్టీ (నెలసరి పేదరికం) ఎదుర్కొంటూనే ఉన్నారు. వారి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎన్నో ఉత్పత్తులు మార్కెట్​లోకి వచ్చినా వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకవేళ అందుబాటులో ఉన్నాయని తక్కువ ధరలో లభించే ఉత్పత్తుల్ని వాడితే అవి వారి ఆరోగ్యానికే చేటు చేస్తున్నాయి. ఇదే విషయాన్ని దగ్గర్నుంచి గమనించింది బెంగళూరుకు చెందిన ఇరా గుహ. మార్కెట్లో నాణ్యత లేని ఉత్పత్తుల్ని వాడడం వల్ల అవి వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థకే చేటుచేస్తున్నాయని తెలుసుకొని తానే స్వయంగా ఓ మెన్‌స్ట్రువల్‌ కప్‌ను డిజైన్‌ చేసి అభివృద్ధి చేసింది. ‘బై వన్‌ డొనేట్‌ వన్‌’ పేరుతో తాను ప్రారంభించిన ఈ నెలసరి ఉద్యమంతో నెలసరి పేదరికాన్ని పూర్తిగా రూపుమాపాలని కృషి చేస్తోందామె. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తోన్న కప్స్‌తో పోల్చితే తాను రూపొందించిన కప్‌కి ఓ ప్రత్యేకత ఉందంటూ దీన్ని అభివృద్ధి చేసే క్రమంలో తనకెదురైన అనుభవాలను ఇలా పంచుకుంది ఇరా.

మహిళల్లో నెలసరి అపోహల్ని దూరం చేయడం, ఈ విషయంలో వారిలో ఉన్న మూసధోరణుల్ని బద్దలు కొట్టి వారి వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడే క్రమంలో బోలెడన్ని నెలసరి ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి ధర సామాన్యులకు అందనంత ఎత్తులో ఉండే సరికి అవి అందరినీ చేరలేకపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సగానికి సగం మంది మహిళలు ఎలాంటి నెలసరి ఉత్పత్తుల్ని పొందలేకపోవడానికి ఇదే కారణమేమో అనిపిస్తుంది. అంతెందుకు మన చుట్టూ ఉన్న వారిలోనే చాలామంది ఈ పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు.

ఆమె బాధలోంచి పుట్టిన ఆలోచన ఇది!

2017లో నేను మసాచుసెట్స్‌లోని హార్వర్డ్‌ కెన్నడీ స్కూల్‌లో పబ్లిక్‌ పాలసీ విభాగంలో మాస్టర్స్‌ చదువుతున్న సమయంలో ఓసారి సెలవుల కోసమని బెంగళూరు వచ్చా. అదే సమయంలో మా ఇంటి పనిమనిషి తనకు ఆరోగ్యం బాగా లేదని సెలవు తీసుకుంది. కారణమేంటా అని ఆరా తీస్తే.. నెలసరి కారణంగానే తాను పనిలోకి రాలేకపోయిందని తెలిసింది. అంతేకాదు.. పిరియడ్స్‌ సమయంలో తాను చవకగా లభించే శ్యానిటరీ ప్యాడ్స్‌ ఉపయోగిస్తుందని, అవే తనలో ఇన్ఫెక్షన్లకు దారితీశాయని, దీంతో నెలసరి వచ్చినప్పుడల్లా తాను నొప్పితో విలవిల్లాడిపోయేదాన్నని ఆ తర్వాత తాను చెప్పేసరికి చాలా బాధనిపించింది. అయితే నాకు అప్పటికే మెన్‌స్ట్రువల్‌ కప్‌ వాడడం అలవాటు. దాంతో నా దగ్గర అదనంగా మరో కప్‌ ఉండే సరికి అది తనకు ఇచ్చాను. అది వాడాక తనకు ఎంతో సౌకర్యవంతంగా ఉందని చెప్పి మరొకటి కావాలని అడిగింది. ఇలా నాకు తెలిసిన కొంతమంది మహిళలకు మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ అందించాను.

menstrualcupdonataiongh650-1.jpg
బైవన్ డొనేట్ వన్

లోపాలను గుర్తించి..!

ఇప్పుడనే కాదు.. ఆ తర్వాత ఇండియాకొచ్చిన ప్రతిసారీ యూఎస్‌ నుంచి కొన్ని మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ తీసుకురావడం, వాటిని బాగా అవసరంలో ఉన్న మహిళలకు అందించడం అలవాటుగా మారిపోయింది. అయితే నేను ఎంత నాణ్యమైన కప్స్‌ని తీసుకొచ్చినా అవి కొంతమంది మహిళలకు పడకపోయేవి. ఈ క్రమంలో లీకేజీ, ఉపయోగించిన వాటిని తిరిగి తొలగించడం కష్టమవుతుందన్న సమస్యలు వారి నుంచి విన్నా. ఇక ఇలా అయితే లాభం లేదనుకొని.. నేనే స్వయంగా ఓ మెన్‌స్ట్రువల్‌ కప్‌ డిజైన్‌ చేసి అవసరార్థులకు అందిస్తే బాగుంటుంది కదా అని ఆలోచించా. ఈ ఆలోచనే ‘అసన్‌ మెన్‌స్ట్రువల్‌ కప్‌’కు ప్రాణం పోసింది. 2018లో దీని తాలూకు పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న కప్స్‌ని కొనుగోలు చేసి వాటిలోని లోపాలను లోతుగా పరిశీలించా. నేను రూపొందించే కప్‌లో అవేవీ పునరావృతం కాకుండా జాగ్రత్తపడ్డా. హార్వర్డ్‌ ఇన్నొవేషన్ ల్యాబ్‌లో అక్కడి ఇంజినీర్స్‌ సహాయంతో రెండేళ్ల పాటు శ్రమించి మెన్‌స్ట్రువల్‌ కప్‌ను రూపొందించాం. అంతేకాదు.. సుమారు నాలుగు దశలలో టెస్టింగ్‌ చేశాకే ఈ ఏడాది జనవరిలో దీన్ని మార్కెట్లోకి విడుదల చేశాం. ఈ ఉత్పత్తికి యూఎస్‌, యూకే, యూరప్‌, భారత్‌.. తదితర దేశాలు కూడా సురక్షితమే అన్న ముద్ర వేశాయి.

అదే మా కప్‌ ప్రత్యేకత!

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ వాటిని తొలగించే క్రమంలో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారన్న విషయం గమనించా. అందుకే ఆ సమస్య నేను రూపొందించే కప్‌లో పునరావృతం కాకూడదనుకున్నా. ఈ క్రమంలోనే దీన్ని సులభంగా తొలగించేందుకు వీలుగా దాని అడుగు భాగంలో ఒక ‘రిమూవల్‌ రింగ్‌’ని ఏర్పాటుచేశాం. మిగతా కప్స్‌తో పోల్చితే మా కప్‌ ప్రత్యేకత అదే! పూర్తి సురక్షితమైన సిలికాన్‌తో రూపొందించిన ఈ కప్‌ని 10 ఏళ్ల దాకా నిశ్చింతగా వాడేయచ్చు. ఇలా నెలసరి ఉత్పత్తిని తిరిగి ఉపయోగించడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.

ఒకటి కొంటే ఒకటి ఉచితం!

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ నెలసరిపై ఎన్నో అపోహలున్నాయి.. శ్యానిటరీ ప్యాడ్స్‌, ఇతర నెలసరి ఉత్పత్తుల్ని వారు కొనలేకపోతున్నారు. అందుకే అలాంటి వారికి ఈ కప్స్‌ని చేరువ చేయడమే ముఖ్యోద్దేశంగా ముందుకు సాగుతున్నా. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లోని మహిళా స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నా. ఇందులో భాగంగానే కొందరు మేటి గైనకాలజిస్టుల సహకారంతో నెలసరి అపోహలు, పరిశుభ్రత, ఇతర ప్రత్యుత్పత్తి సమస్యలపై కంటెంట్‌, వీడియోలు రూపొందించాం. వాటిని గ్రామీణ మహిళల్లోకి తీసుకెళ్లడానికి కొంతమంది ఆరోగ్య కార్యకర్తల్ని నియమించుకున్నాం.

ప్రస్తుతం ఈ మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ ‘www.asancup.com’ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి కొంటే మరొక దాన్ని ఉచితంగా అందిస్తున్నాం.. ఇలా ఉచితంగా తీసుకున్న కప్‌ను మీరు అవసరంలో ఉన్న మరొకరికి దానంగా ఇస్తే అది వారికి ఎంతో ఉపయోగపడుతుందన్న ముఖ్యోద్దేశంతోనే ఈ క్యాంపెయిన్‌ను తీసుకొచ్చా. ఇలా నా ప్రయత్నంతో దేశవ్యాప్తంగా నెలసరి పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. మీరు కూడా మీ వంతుగా నెలసరి విషయంలో మీ తోటి మహిళలకు నెలసరి ఉత్పత్తుల్ని అందిస్తూ వారికి సహాయపడడం, ఈ విషయంలో వారిలో అవగాహన పెంచడం.. వంటివి చేస్తే నా లక్ష్యం నెరవేరడానికి ఇంకెంతో సమయం పట్టదు.

ఇలా మెన్‌స్ట్రువల్‌ కప్‌ని రూపొందించడంలో భాగంగా తాను చేసిన పరిశోధనలు, కృషికి గాను హార్వర్డ్స్‌ విమెన్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ ప్రోగ్రాం ‘వార్నర్‌ ఫెలోషిప్‌’తో ఇరాను సత్కరించింది. అలాగే కేంబ్రిడ్జి యూనివర్సిటీలో నిర్వహించిన ‘కింగ్స్‌ కాలేజ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ కాంపిటీషన్‌’లో మొదటి స్థానంలో నిలవడంతో పాటు సుమారు రూ. 20 లక్షల నగదు బహుమతి కూడా అందుకుంది.

ఇదీ చదవండి: 2025 నాటికి 15 విద్యుత్ కార్లు: టొయోటా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.